బొగ్గు మంత్రిత్వ శాఖ
తాత్కాలిక బొగ్గు గణాంకాలు 2022-23 అన్న గణాంక ప్రచురణను విడుదల చేసిన బొగ్గు కార్యదర్శి
బొగ్గు, లిగ్నైట్‌కు సంబంధించిన కీలక డాటాను అందుబాటులోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన విశేష వేదిక
Posted On:
17 OCT 2023 4:21PM by PIB Hyderabad
ప్రొవిజినల్ కోల్ స్టాటిస్టిక్స్ ఫర్ 2022-23 ( తాత్కాలిక బొగ్గు గణాంకాలు -2022-23) అన్న గణాంకాల ప్రచురణను మంగళవారం నాడు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృతలాల్ మీనా, అదనపు కార్యదర్శి ఎం. నాగరాజు, అదనపు కార్యదర్శి విస్మిత తేజ, డిడిజి సంతోష్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో విడుదల చేశారు. పరిశోధకులు, విధానకర్తలు, అనేకమంది భాగస్వాముల డాటాకు సంబంధించిన అవసరాలను నెరవేర్చేందుకు అత్యంత శ్రద్ధతో ఈ వార్షిక ప్రచురణను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సిసిఒ- బొగ్గు నియంత్రణ సంస్థ) రూపొందించింది.
ఆర్ధిక వ్యవస్థకు అనివార్యమైన, కీలకమైన స్తంభంగా బొగ్గు నిలుస్తూ, వృద్ధిని, అభివృద్ధిని నడిపించే చోదక శక్తిగా పని చేస్తుంది. భారతదేశంలో వాణిజ్యపరమైన ఇంధనానికి ప్రాథమిక వనరుగా, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులతో పోలిస్తే దాని విశ్వసనీయత కారణంగా మన శక్తి వినియోగంలో సగానికి బొగ్గు వాటాను కలిగి ఉండడమే కాక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇంధనంగా ఉంది.
బొగ్గు, లిగ్నైట్‌కు సంబంధించిన ఖచ్చితమైన, అధిక నాణ్యత గణాంకాల లభ్యత అన్నవి సమర్ధవంతమైన డాటా విశ్లేషణ, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి చాలా ముఖ్యమైంది. తాత్కాలిక బొగ్గు గణాంకాలు 2022-23 అన్నది 2022-23 సంవత్సరానికి బొగ్గు, లిగ్నైట్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన డాటాను పొందుపరిచే విశేష వేదికగా పని చేస్తుంది.
తాత్కాలిక బొగ్గు గణాంకాలు 2022-23 బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి & ఉత్పాదకత, పిట్-హెడ్ క్లోజింగ్ స్టాక్, క్యాప్టివ్ బ్లాక్స్ & వాణిజ్య బ్లాకుల పనితీరు, బట్వాడాలు, దిగుమతి, ఎగుమతి, బొగ్గు వాషరీలు, రాయల్టీ, డిఎంఎఫ్, ఎన్ఎంఇటి వంటి వివిధ అంశాలపై సమగ్రమైన, వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఇది బొగ్గు, లిగ్నైట్ రంగం క్రీయాశీల రంగంలోకి లోతైన దృష్టించిన అందించి, విశ్వసనీయ డాటా ఆధారంగా విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది.
వివరణాత్మక నివేదికను దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు -
https://coal.gov.in/sites/default/files/2023-10/17-10-2023a-wn.pdf.
***
(Release ID: 1968613)
Visitor Counter : 65