విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ(అడాప్షన్) , అంచనాల డేటా కోసం డ్యాష్ బోర్డును ప్రారంభించిన కేంద్ర విద్యుత్ , నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి
విద్యుత్ దే భవిష్యత్: డీజిల్, పెట్రోల్ ఎస్ యు వి లు ఇక చరిత్రగా మిగిలిపోతాయి: విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్
ఎలక్ట్రిక్ వాహనాల్లో 2022-2030 మధ్య 45.5% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును అంచనా వేసిన ఇవి-రెడీ ఇండియా డ్యాష్ బోర్డు: 2030 నాటికి భారతదేశంలో 1.6 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక అమ్మకాలు
Posted On:
16 OCT 2023 4:58PM by PIB Hyderabad
సరికొత్త ఇవి-రెడీ ఇండియా డ్యాష్ బోర్డ్ (evreadyindia.org)ను కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఒఎంఐ ఫౌండేషన్ లోని పాలసీ, పరిశ్రమ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ డ్యాష్ బోర్డ్ దాదాపు రియల్ టైమ్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ , అంచనాలు, సంబంధిత బ్యాటరీ డిమాండ్, ఛార్జింగ్ సాంద్రత , మార్కెట్ వృద్ధి ధోరణులపై దృష్టి సారించే ఉచిత డిజిటల్ వేదిక. ఈ డ్యాష్ బోర్డు ప్రేక్షకులు, పరిశ్రమ, విధాన నిర్ణేతలు , ఎలక్ట్రిక్ వాహనాల అంతిమ వినియోగదారులకు మరింత చేర్చడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్లాట్ ఫాం డేటా , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్ధ్యాలను ఉపయోగిస్తుంది. భారతదేశం లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం పై స్థూల ఆర్థిక డేటా, విశ్లేషణ అవసరాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇవి-రెడీ ఇండియా డ్యాష్ బోర్డు 2022 క్యాలెండర్ సంవత్సరం , 2030 క్యాలెండర్ సంవత్సరం మధ్య ఎలక్ట్రిక్ వాహనాలలో 45.5% కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) ను అంచనా వేసింది, ఈ ప్రకారం 2022 లో 6,90,550 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఇ 2 డబ్ల్యు) వార్షిక అమ్మకాలు 2030 నాటికి 1,39,36,691 ఇ2 డబ్ల్యులకు పెరుగుతాయి.
ఈ కార్యక్రమంలో డ్యాష్ బోర్డుపై బుక్ లెట్ ను విడుదల చేశారు. వాటిని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. లాంచ్ వేడుకను ఇక్కడ వీక్షించవచ్చు.
“భవిష్యత్ విద్యుత్ దే. దీనిని ఎవరూ ఆపలేరు. డీజిల్, పెట్రోల్ ఎస్ యు వి లది ఇక చరిత్రే”
ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రపంచ బ్యాంకు, ఇతర భాగస్వాముల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్ మాట్లాడుతూ, భవిష్యత్తు ఎలక్ట్రిక్ గా ఉండబోతోందని ఉద్ఘాటించారు. 'భవిష్యత్తు ఎలక్ట్రిక్ తోనే ముడిపడి ఉంది. దీన్ని ఎవరూ ఆపలేరు. స్టోరేజ్ ధర తగ్గుతుంది. అది తగ్గితే డీజిల్, పెట్రోల్ ఎస్ యు వి లు చరిత్ర గా మారిపోతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మన ప్రయాణానికి సరిపోయే విద్యుత్ ను (ఎలక్ట్రిక్) ను కలిగి ఉంటాము” అని కేంద్రమంత్రి అన్నారు.
ఒక దేశంగా భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడం చాలా అవసరమని శ్రీ సింగ్ అన్నారు. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మనం ఎదగాలి. వ్యూహాత్మక వ్యవహారాల్లో మన పట్టును పెంచు కోవాలి. దీనికి ఇంధన స్వాతంత్ర్యం అవసరం, ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన కారణం” అని పేర్కొన్నారు.
"కర్బన ఉద్గారాలను తగ్గించడానికి రవాణాను డీకార్బోనైజింగ్ చేయడం చాలా అవసరం"
కేంద్ర విద్యుత్ , నూతన ,పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి తన ప్రసంగంలో రవాణా రంగాన్ని డీకార్బనైజ్ చేయవలసిన అవసరాన్ని ప్రముఖంగా చెప్పారు. మన ఉద్గారాలలో రవాణా 18% వాటాను కలిగి ఉందని, ఇది పరిశ్రమ కంటే తక్కువ అని , ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను చురుకుగా ప్రోత్సహిస్తోందని అన్నారు. “మన ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ సోలార్ ను రూ.15కు కొనుగోలు చేశారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.50కే లభిస్తోందని అప్పట్లో చాలా మంది విమర్శించారని, కానీ ఆ రేటుకు కొంటే తప్ప ధర తగ్గదని చెప్పారు. నేడు సోలార్ ధర తగ్గింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వెనుక ఉద్దేశం ఇదే' అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఎవరైనా మాట్లాడటం ప్రారంభించకముందే 2018 ఏప్రిల్లో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం మార్గదర్శకాలను విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు.
ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం డ్యాష్ బోర్డు (https://evyatra.beeindia.gov.in/) ను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఆ డ్యాష్ బోర్డు ద్వారా గమ్యస్థానానికి చేరుకునే లోపే ఛార్జింగ్ స్పేస్ బుక్ చేసుకోవచ్చు.
“ వాల్యూమ్ పెంచడం, నిల్వ ఖర్చును తగ్గించడం కోసం బ్యాటరీలకు మరొక పిఎల్ఐ”
ఎలక్ట్రిక్ వాహనాల అనువర్తనం లో అవరోధాల గురించి మంత్రి మాట్లాడుతూ, ధర ఒక అడ్డంకి అయితే, అది స్టోరేజ్ వ్యయం న వల్ల అని అన్నారు. “బ్యాటరీల తయారీకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పి ఎల్ ఐ)తో ముందుకు వచ్చాం. మరో పి ఎల్ ఐ ని తీసుకురాబోతున్నాం. అలాగే మనం స్టోరేజీ ధరలను తగ్గించ వలసిన అవసరం ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించ వలసిన అవసరం గురించి పశ్చిమ దేశాలు మాట్లాడుతూనే ఉన్నాయి, కానీ నిల్వ వ్యయాన్ని తగ్గించడం గురించి వారు ఏమీ చేయలేదు. వాల్యూమ్ పెంచితేనే స్టోరేజ్ ధర తగ్గుతుంది. , అందుకే తయారీ, సామర్థ్యం, వాల్యూమ్స్ పెంచేందుకు మరో పిఎల్ఐని తీసుకు వస్తున్నాం” అని తెలిపారు.
"సరఫరా గొలుసు సమస్యలు వ్యూహాత్మక మైనవి. లిథియం నుండి ఇతర రసాయనాలకు మారాల్సిన అవసరం ఉంది"
ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు మరో అడ్డంకి లిథియం వనరులేనని మంత్రి పేర్కొన్నారు. “లిథియం నిల్వల్లో 80 శాతం ఒక దేశంతో ముడిపడి ఉన్నాయి. , 88 శాతం లిథియం ప్రాసెసింగ్ ఒక దేశంలో ఉంది. . సప్లై చైన్ సమస్యలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా లిథియం నుంచి సోడియం అయాన్ వంటి ఇతర రసాయనాలకు మారాలి. సరఫరా గొలుసు భద్రతకు ప్రత్యామ్నాయ రసాయనాలు చాలా అవసరం. సప్లై చైన్ సమస్యలు వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యామ్నాయ రసాయన శాస్త్రాలలో పరిశోధనలో పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలి” అని శ్రీ సింగ్ కోరారు.
"పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు, వాతావరణ చర్యకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకం"
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు , వాతావరణ చర్యకు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం చాలా ముఖ్యమైనదని శ్రీ సింగ్ స్పష్టం చేశారు. "వాతావరణ మార్పుల పై చర్చను మార్చడం, దానిని నిజం చేయడం చాలా అవసరం. వాతావరణ చర్యపై చర్చ ను అభివృద్ధి చెందిన దేశాలు నడుపుతున్నాయి. ఇది వంచన తప్ప మరేమీ కాదు. మన తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటులో మూడింట ఒక వంతు ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఉన్నాయి. మన జనాభా 17% ఉన్నప్పటికీ భూగోళంపై కార్బన్ డయాక్సైడ్ లోడ్ లో కేవలం 4% మాత్రమే మనం బాధ్యత వహిస్తాము. అందుకే తలసరి ప్రాతిపదికన అతి తక్కువ పరిమాణంలో కార్బన్ ను జోదించాం. తలసరి ప్రాతిపదికన సాధ్యమైనంత తక్కువ వేగంతో కలుపుతున్నాము” అని చెప్పారు.
కర్బన ఉద్గారాల అంచనా తలసరి ప్రాతిపదికన ఉండాలే తప్ప సంపూర్ణ ప్రాతిపదికన కాదని మంత్రి పునరుద్ఘాటించారు. “ అంతేకాక, ప్రపంచ ఉష్ణోగ్రతలో రెండు డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు అనుగుణంగా ఇంధన మార్పు చర్యలు ఉన్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం. అన్ని ఎన్ డిసి కట్టుబాట్లను ముందుగానే సాధించిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా మనదే. మరే దేశంలోనూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఇంత వేగంగా పెరగలేదు. ఉద్గారాల తీవ్రతను తగ్గించే ఎన్ డి సి ని 11 ఏళ్ల ముందే 2019లో సాధించాం. కాబట్టి, గ్లాస్గోలో, మనం మన ఇంధన సామర్థ్యంలో 50% శిలాజేతర ఇంధన వనరుల నుండి వస్తామని చెప్పాము. ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల ఉద్గారాలు తగ్గుతాయి”అని శ్రీ సింగ్ అన్నారు. "ఒక ప్రభుత్వంగా ఇది మాకు ముఖ్యం ఎందుకంటే మనం భూగోళానికి విలువ ఇస్తాము, ఇది మన సంస్కృతిలో ఉంది. పర్యావరణంపై నమ్మకంతోనే చర్యలు తీసుకుంటున్నాము” అన్నారు.
భారత ప్రభుత్వ జి 20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, " ఒఎమ్ఐ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన bఇవి-రెడీ ఇండియా డ్యాష్ బోర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీపై ముఖ్యమైన అంతర్దృష్టులను ఏకీకృతం చేసే పరివర్తన వేదిక. ఎలక్ట్రిక్ మొబిలిటీలో నిజమైన చర్య ప్రభుత్వ స్థాయిలో సంభవిస్తుందని గుర్తించి, డ్యాష్ బోర్డు సమగ్రమైన, ప్రభుత్వ -నిర్దిష్ట అంతర్దృష్టులను అందిస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి విధానకర్తలకు అధికారం ఇస్తుంది, గ్లోబల్ ఇ వి లీడర్ గా భారతదేశ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది”అన్నారు.
ఇవి -రెడీ ఇండియా డ్యాష్ బోర్డు
ఒఎంఐ ఫౌండేషన్ ప్రకారం, ఇ వి -రెడీ ఇండియా డ్యాష్ బోర్డు భారతదేశంలోని ఏకైక డ్యాష్బోర్డు. , ఇది అన్ని వాహన్ రాష్ట్రాలు, తెలంగాణలో అమ్మకాల డేటాను సంకలనం చేస్తుంది, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, డిమాండ్ ధోరణులు , టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్ షిప్ పోలికలను ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది, ఇది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదనంగా, ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రస్తుత పెట్టుబడి వాతావరణాన్ని ట్రాక్ చేస్తుంది.దేశంలో మార్కెట్ వృద్ధి , ఇవి హాట్ స్పాట్లపై అంచనాలను ట్రాక్ చేస్తుంది. ఇది నెట్ జీరోకు భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఉద్గారాలను మరింత కొలుస్తుంది.
2030 నాటికి భారతదేశంలో 1.6 కోట్లకు పైగా వార్షిక ఎలక్ట్రిక్ వాహనాల మోహరింపులను డ్యాష్ బోర్డు అంచనా వేస్తోందని ఫౌండేషన్ తెలిపింది. దీనితో, భారతదేశంలో అత్యధిక ఛార్జింగ్ స్టేషన్లతో మహారాష్ట్ర , ఢిల్లీ (వరుసగా 2531 , 1815) ఉంటాయని పేర్కొంది. తమిళనాడు ఇ2డబ్ల్యు తయారీ కేంద్రంగా, తెలంగాణ ఇ3డబ్ల్యు తయారీలో, మహారాష్ట్ర ఇ4డబ్ల్యు తయారీలో, గుజరాత్ బ్యాటరీ తయారీలో, కర్ణాటక ఆర్ అండ్ డిలో ముందంజలో ఉన్నాయి. చండీగఢ్ లో అత్యల్పంగా కిలోవాట్ కు 3.6 రూపాయలు, (జాతీయ సగటు 13.74/కిలోవాట్ తో పోలిస్తే 73% తక్కువ)ఉంది. 2023 లో భారతదేశం ఇప్పటివరకు 5.18 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించిందని డ్యాష్ బోర్డు నివేదించింది, ఇది లక్షద్వీప్ దీవుల మొత్తం విస్తీర్ణానికి రెట్టింపు విస్తీర్ణంలో ఉన్న 85.47 మిలియన్ చెట్ల మొలకలకు సమానం.
ఒఎంఐ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐశ్వర్య రామన్ మాట్లాడుతూ, “ఇవి -రెడీ ఇండియా డ్యాష్ బోర్డు. ఇది అందరికీ ఉచితం. ఇది భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో భాగం కావాలనుకునే వారందరి కోసం. ఇది ఒఎంఐ ఫౌండేషన్ కు ఒక మైలురాయి, ఎందుకంటే ఇది విస్తృతమైన పరిశోధన, గణాంక విశ్లేషణ , మన అంతర్గత నిపుణుల అలుపెరగని అంకితభావానికి నిదర్శనం. ఈ వేదిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి, పర్యావరణ వ్యవస్థ-విస్తృత సహకారాన్ని పెంపొందించడానికి , సమర్థవంతమైన విధాన రూపకల్పనకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది - ఎందుకంటే మనం ఈ డ్యాష్ బోర్డు ను మరింత సమగ్రంగా , అంతర్దృష్టితో కొనసాగిస్తున్నాము. సుస్థిర చలనశీలతలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ఇది మా వంతు సహకారం” అన్నారు.
ఇవి -రెడీ ఇండియా డ్యాష్ బోర్డు ప్రత్యేకతలు:
- విధాన నిర్ణేతలు , పరిశ్రమల కోసం, డ్యాష్ బోర్డు మొత్తం 34 వాహన్ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు అదనంగా తెలంగాణ కోసం ఏకీకృత అమ్మకాల డేటాను అందిస్తుంది. అడాప్షన్ రేట్లు , కాలానుగుణ ధోరణులను, రూప కారకాలు, రాష్ట్రాలు , మరెన్నో సులభంగా అర్థం చేసుకోవడానికి డేటా విజువలైజ్ చేయబడుతుంది.
- ఈ డ్యాష్ బోర్డ్ ఇ వి అడాప్షన్ , 2030 వరకు అనుబంధ బ్యాటరీ డిమాండ్ పై అంచనాలను చూపిస్తుంది, ఇది విధానకర్తలు , పరిశ్రమ రెండింటినీ వారి క్లీన్ మొబిలిటీ లక్ష్యాలను వ్యూహరచన చేయడానికి , అమలు చేయడానికి అనుమతిస్తుంది. పాన్-ఇండియా అంచనాలతో పాటు, డ్యాష్ బోర్డు గతంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాల వారీగా అంచనాలను అందిస్తుంది.
- అంతిమ వినియోగదారుడికి, అంటే ఎలక్ట్రిక్ వాహనాల (సంభావ్య) కొనుగోలుదారుకు, డ్యాష్ బోర్డ్ ఇవి యాజమాన్యం ఆర్థిక ప్రయోజనాలను చూపుతుంది, వీటిలో ముందస్తు ఖర్చులు, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు మొదలైన వాటిపై సంభావ్య పొదుపు ఉంటుంది. ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారుడు సబ్సిడీలకు అర్హమైన ఇ వి మోడళ్ల జాబితాను , అటువంటి సబ్సిడీ పరిమాణాన్ని కూడా సమీక్షించవచ్చు.
- ఇది ఇ వి పర్యావరణ వ్యవస్థ అన్ని విలువ గొలుసులను కవర్ చేసే అన్ని విధానాలు నిబంధనల సమగ్ర భాండాగారాన్ని కూడా కలిగి ఉంటుంది. పాలసీ మాడ్యూల్ రాష్ట్రా లకు తమ పాలసీలను పోల్చుకోవడానికి, వాటి పోటీ ప్రయోజనాల ఆధారంగా వాటిని అప్ డేట్ చేయడానికి సహాయపడుతుంది.
- వినియోగదారులు, పరిశ్రమలు, విధాన నిర్ణేతల కోసం, డ్యాష్ బోర్డు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు , పాయింట్లు రెండింటినీ కవర్ చేసే ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. అదనంగా, రహదారిపై ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల సాంద్రతను డ్యాష్ బోర్డు చూపుతుంది. ఈ మాడ్యూల్ ఛార్జింగ్ టారిఫ్ లను కూడా చూపిస్తుంది, ఇది రాష్ట్రాలను ఇతరులతో పోలిస్తే తమ రేట్లను మెరుగుపరచడానికి అనుమతిస్తుంది,
- వాహనాల తయారీ, బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ రీసైక్లింగ్ లేదా అర్బన్ మైనింగ్ మొదలైన ఎలక్ట్రిక్ వాహనాల విలువ గొలుసులలో పెట్టుబడులను ట్రాక్ చేయడం , బెంచ్ మార్క్ చేయడం , పరిశోధన - అభివృద్ధి వంటి ఇ వి విలువ గొలుసు లలో పెట్టుబడులను ట్రాకింగ్, బెంచ్ మార్కింగ్ చేయడం ద్వారా డ్యా ష్ బోర్డ్ భారతదేశ ఆర్థిక వృద్ధి , ఉద్యోగాల సృష్టికి లభిస్తున్న సహకారాలను మ్యాప్ చేస్తుంది.
- దేశవ్యాప్తంగా వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ కారణంగా నివారించబడిన ఉద్గారాలను ట్రాక్ చేయడం ద్వారా నెట్ జీరో దిశగా భారతదేశ ప్రయాణాన్ని ఈ డ్యాష్ బోర్డు కొలుస్తుంది.
- చివరగా, డ్యాష్ బోర్డ్ ఇవి పర్యావరణ వ్యవస్థ అన్ని విలువ గొలుసులకు సంబంధించిన ఇవి స్వీకరణ, డేటా-ఆధారిత నిర్ణయాలపై వార్తలు బ్లాగులను ఒకే ప్రదేశంలో అందిస్తుంది.
ప్రారంభ కార్యక్రమం లో " ఇ వి సెక్టార్ లో డేటా ఆధారిత డెసిషన్ మేకింగ్" గురించి ప్యానెల్ డిస్కషన్ కూడా జరిగింది.
https://evreadyindia.org/ వద్ద డ్యాష్ బోర్డును యాక్సెస్ చేసుకోండి
మీరు కింది వాటిని కూడా పరిశీలించ వచ్చు :
- https://powermin.gov.in/en/content/electric-vehicle
- ఫేమ్ స్కీమ్ రెండవ దశ కింద 7432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ల కోసం కేంద్రం రూ 800 కోట్లు మంజూరు చేసింది.
- దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం మూడు పథకాలను ప్రారంభించడంతో పాటు అనేక చర్యలు తీసుకుంది.
- విద్యుత్ వాహనాలు
- ఫేమ్ ఇండియా పథకం కింద ఇ వి లను కొనుగోలు చేశారు.
***
(Release ID: 1968348)
Visitor Counter : 90