రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐఎన్‌ఎస్‌ బియాస్ సేవాకాలం పెంపు, ఆధునికీకరణ కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం

Posted On: 16 OCT 2023 2:33PM by PIB Hyderabad

ఐఎన్‌ఎస్‌ బియాస్ సేవాకాలం పెంపు, ఆధునికీకరణ కోసం కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో (సీఎస్‌ఎల్‌) రూ. 313.42 కోట్ల విలువైన ఒప్పందాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకుంది. న్యూదిల్లీలో 2023 అక్టోబర్ 16న ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఐఎన్‌ఎస్‌ బియాస్, బ్రహ్మపుత్ర విభాగానికి చెందిన నౌక. ఆవిరి నుంచి డీజిల్‌ శక్తికి మారుతున్న మొదటి ఓడ ఇది. 2026లో సేవాకాలం పెంపు, ఆధునికీకరణ పూర్తవుతుంది. అప్పుడు, ఆధునిక ఆయుధ సామగ్రి, పోరాట సామర్థ్యంతో భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ బియాస్‌ తిరిగి వస్తుంది.

ఈ ప్రాజెక్టులో 50కి పైగా ఎంఎస్‌ఎంఈలు భాగస్వాములు అవుతాయి, 3,500కు పైగా మందికి ఉపాధి లభిస్తుంది.

'భారత్‌లో తయారీ' చొరవకు అనుగుణంగా, ఆత్మనిర్భర్ భారత్‌లో గర్వించదగిన ప్రాజెక్టుగా ఇది నిలుస్తుంది.

***



(Release ID: 1968297) Visitor Counter : 50