ప్రధాన మంత్రి కార్యాలయం

అక్టోబరు 17 వ తేదీ నాడు గ్లోబల్ మేరీటైమ్ ఇండియా సమిట్ 2023 ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


భారతదేశం యొక్క సముద్ర సంబంధి బ్లూ ఇకానామీ తాలూకుదీర్ఘకాలిక నమూనా అయిన ‘అమృత్ కాల్ విజన్ 2047’ ను ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి

23,000 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం లతో పాటు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ ఆథారిటీ లో టూనా టేక్రా డీప్ డ్రాఫ్ట్ టర్మినల్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

4500 కోట్ల రూపాయల కుపైగా ఖర్చు తో నిర్మాణమయ్యే టూనా టేక్ రా టర్మినల్ ఇండియా - మిడిల్ ఈస్ట్-యూరోప్ఇకానామిక్ కారిడార్ (ఐఎమ్ఇఇసి) గుండా భారతదేశ వ్యాపారాని కి ఒక ప్రవేశ ద్వారం గానిలువనుంది

సముద్ర సంబంధి రంగం లో ప్రపంచ మరియు జాతీయ  భాగస్వామ్యాల కోసం ఉద్దేశించిన 300 లకు పైగా ఎంఒయులను కూడా ప్రధాన మంత్రి అంకితంచేస్తారు

దేశం లో జరగనున్న అతి పెద్దదైన సముద్ర సంబంధి  కార్యక్రమం లో ప్రపంచం నలుమూల ల నుండి ప్రతినిధులుపాలుపంచుకోనున్నారు

Posted On: 16 OCT 2023 12:50PM by PIB Hyderabad

గ్లోబల్ మేరీటైమ్ ఇండియా సమిట్ (జిఎమ్ఐఎస్) 2023 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 10:30 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనాన్ని అక్టోబరు 17 వ తేదీ మొదలుకొని 19 వ తేదీ వరకు ముంబయి లో ఎమ్ఎమ్ఆర్ డిఎ గ్రౌండ్స్ లో నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి భారతదేశం సముద్ర సంబంధి బ్లూ ఇకానమి కోసం ఉద్దేశించినటువంటి దీర్ఘకాలిక నమూనా అయిన అమృత్ కాల్ విజన్ 2047’ ను ఆవిష్కరించనున్నారు. ఈ నమూనా నౌకాశ్రయ సదుపాయాల ను పెంచడాని కి ఉద్దేశించిన వ్యూహాత్మక కార్యక్రమాల ను తెలియజేయడం తో పాటు, స్థిర ప్రాతిపదిక కలిగిన అభ్యాసాల ను ప్రోత్సహించడం, ఇంకా అంతర్జాతీయ సహకారాని కి మార్గాన్ని సుగమం చేయడం గురించి వ్యూహాత్మక కార్యక్రమాల కు రూపురేఖల ను తయారు చేస్తుంది. ఈ అత్యాధునిక ప్రణాళిక కు అనుగుణం గా, ప్రధాన మంత్రి భారతదేశ సముద్ర సంబంధి బ్లూ ఇకానామీ కి చెందిన అమృత్ కాల్ విజన్ 2047’ తో సంబంధం కలిగిన 23,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా చేస్తారు.

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ ఆథారిటీ లో అన్ని రుతువుల లో కార్యకలాపాల ను నిర్వర్తించగలిగిన టూన్ టేక్ రా డీప్ డ్రాఫ్ట్ టర్మినల్ నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు; దీనిని 4,500 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. అత్యంత ఆధునికం గా ఉండే టటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ టర్మినల్ ను పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతి లో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఒక అంతర్జాతీయ వ్యాపార కేంద్రం గా రూపుదిద్దుకొనే అవకాశం ఉన్నటువంటి ఈ టర్మినల్ 18,000 కు పైగా ట్వంటీ-ఫూట్ ఈక్వివలెంట్ యూనిట్స్ (టిఇయు స్) కు పైగా సామర్థ్యం కలిగిన భావి తరం నౌకల ను హేండిల్ చేస్తుంది. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకోనామిక్ కారిడార్ (ఐఎమ్ఇఇసి) గుండా భారతదేశం వ్యాపారాని కి ఒక ప్రవేశ ద్వారం గా కూడా పని చేస్తుంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి సముద్ర రంగం లో ప్రపంచ మరియు జాతీయ భాగస్వామ్యాల కోసం 7 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 300 కు పైచిలుకు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎంఒయు)ను కూడా అంకితం చేయనున్నారు.

ఈ శిఖర సమ్మేళనం దేశం లో అతి పెద్దదైనటువంటి సముద్ర సంబంధి కార్యక్రమం అని చెప్పాలి. దీనిలో యూరోప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఏశియా (మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, ఇంకా బిఐఎమ్ ఎస్ టిఇసి ప్రాంతం సహా) దేశాల కు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రపంచ వ్యాప్త మంత్రులు పాలుపంచుకోనున్నారు. శిఖర సమ్మేళనం లో గ్లోబల్ సిఇఒ లు, వ్యాపార ప్రముఖులు, ఇన్వెస్టర్ లు, అధికారులు మరియు ప్రపంచ వ్యాప్తం గా ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొంటారు. అదనం గా, భారతదేశం లోని అనేక రాష్ట్రాల కు ప్రాతినిధ్యం వహించే మంత్రులు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటారు.

మూడు రోజుల శిఖర సమ్మేళనం లో రాబోయే కాలం లో నౌకాశ్రయాలు సహా సముద్ర సంబంధి అనేక విషయాల పై చర్చ మరియు సంప్రదింపులు జరగనున్నాయి. ఆయా విషయాల లో కర్బన ద్విఆమ్లం యొక్క ఉద్గారాల ను తగ్గించడం; కోస్టల్ శిపింగ్ & ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్టేశన్; నౌక ల నిర్మాణం; రిపేర్ ఎండ్ రీసైకిలింగ్; ఫైనాన్స్, బీమా & మధ్యవర్తిత్వం; మేరీటైమ్ క్లస్టర్స్; నూతన ఆవిష్కరణ లు మరియు సాంకేతిక విజ్ఞానం; సముద్ర రంగ సంబంధి సురక్ష మరియు భద్రత లకు తోడు సముద్ర సంబంధి పర్యటన రంగం వంటి ఇతర అంశాలు ఉన్నాయి. దేశం లోని సముద్ర రంగం లో పెట్టుబడి ని ఆకర్షించడం కోసం ఒక శ్రేష్ఠమైన వేదిక ను కూడా ఈ శిఖర సమ్మేళనం అందించనున్నది.

మొట్టమొదటి మేరిటైమ్ ఇండియా సమిట్ ను 2016 వ సంవత్సరం లో ముంబయి లో నిర్వహించడమైంది. రెండో మేరిటైమ్ సమిట్ ను 2021వ సంవత్సరం లో వర్చువల్ పద్ధతి లో నిర్వహించారు.

 

 

***

 

 

 



(Release ID: 1968270) Visitor Counter : 112