వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గతిశక్తి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పీఎం గతిశక్తి రూపొందించిన సంక్షిప్త నివేదిక విడుదల చేసిన కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పీఎం గతిశక్తి కింద అమలు జరిగిన 8 ప్రాజెక్టులకు కలిగిన ప్రయోజనాలు వివరిస్తూ రూపొందిన సంక్షిప్త నివేదిక

Posted On: 14 OCT 2023 12:30PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి గతిశక్తి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పీఎం గతిశక్తి  రూపొందించిన సంక్షిప్త నివేదికను   కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విడుదల చేశారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నివేదికను  మంత్రి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి కింద అమలు జరిగిన 8 ప్రాజెక్టులకు కలిగిన ప్రయోజనాలు వివరిస్తూ సంక్షిప్త నివేదిక రూపొందించారు. నివేదిక విడుదల కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ . సోమ్ ప్రకాష్, పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ త్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి. సుమితా దావ్రా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

జిఐఎస్  మ్యాప్‌ల ద్వారా డిజిటల్ సర్వేలను వేగవంతంగా పూర్తి చేసి రెండు సంవత్సరాల కాలంలో దేశంలో 7,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయడానికి పీఎం గతిశక్తి ఉపయోగపడింది.  2022-23 సంవత్సరంలో కొత్త రైల్వే లైన్‌ల కోసం తుది స్థాన సర్వేలు (ఎఫ్ఎల్ఎస్ ) గణనీయంగా పెరిగాయి.  2022-23 సంవత్సరంలో 400 కి మించి ప్రాజెక్టుల  ఎఫ్ఎల్ఎస్ సర్వేలు జరిగాయి. అంతకుముందు సంవత్సరం కేవలం 57 ప్రాజెక్ట్‌ల ఎఫ్ఎల్ఎస్  సర్వేలు మాత్రమే జరిగాయి.  ఎఫ్ఎల్ఎస్  సర్వే ఆధారంగా 13,500 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణానికి  ప్రణాళికను రూపొందించారు. పెట్రోలియం, సహజ వాయువు పైప్‌లైన్‌ల కోసం వివరణాత్మక సర్వేల తయారీలో కూడా పీఎం గతిశక్తి  విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. గతంలో  ప్రక్రియ పూర్తి కావడానికి  6-9 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం ఈ పని  కేవలం కొన్ని గంటల్లో పూర్తవుతోంది.చెట్లు నరికి వేయాల్సిన అవసరాన్ని    తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పీఎం గతిశక్తి పథకం ద్వారా  కృషి జరుగుతోంది. 

పీఎం గతిశక్తి కింద అమలు చేసిన 8 ప్రాజెక్టులకు కలిగిన ప్రయోజనాలను సంక్షిప్త నివేదికలో పొందుపరిచారు.  రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ప్రణాళిక, రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన  రైలు కనెక్టివిటీ ప్రణాళిక, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ల ప్రణాళిక, .ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలలు లేని ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయడం వంటి తో సహా 8 ప్రాజెక్టుల వివరాలను నివేదికలో పొందుపరిచారు.  ప్రధానమంత్రి గతిశక్తి వల్ల కలిగే  ప్రయోజనాలు పీఎం గతిశక్తిని మరింత ఎక్కువగా ఉపయోగించడానికి గల అవకాశాలను నివేదిక ద్వారా తెలుసుకుని అమలు చేయడానికి వీలవుతుంది. 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  మార్గదర్శకత్వంలో ప్రధాన మంత్రి గతిశక్తి నూతన లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తోంది. తదుపరి తరం మౌలిక సదుపాయాల అభివృద్ధి, సులభతరం వ్యాపార నిర్వహణ, సులభతర జీవనం అంశాలకు పీఎం గతిస్కతిలో ప్రాధాన్యత ఇస్తున్నారు.  

సమాచారం ఆధారంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు ప్రణాళిక రూపొందించడానికి పీఎం గతిశక్తి వినూత్న, అధునాతన  విధానాన్నిఅందిస్తుంది. బహుళ లేయర్‌ల డేటాను వుపయోగించి పనిచేసే పీఎం గతిశక్తి , ఇది డిజిటల్ సర్వేలను క్రమబద్ధీకరించి, మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేయడానికి,  క్షేత్ర స్థాయి  సర్వే సమయం తగ్గించడానికి, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా చూసేందుకు పీఎం గతిశక్తి సహకరిస్తుంది.  పెట్టుబడి నష్టాలను తగ్గిస్తుంది. భారీ పెట్టుబడితో చేపట్టిన  ప్రాజెక్ట్‌ల పర్యవేక్షణ సక్రమంగా జరిగేలా చూసే పీఎం గతిశక్తి కార్యక్రమం  ఆర్థిక సామాజిక అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది.

 

 

 

***



(Release ID: 1967790) Visitor Counter : 69