ప్రధాన మంత్రి కార్యాలయం

కౌశల్ దీక్షాంత్సమారోహ్ 2023 ను ఉద్దేశించివీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘కౌశల్ దీక్షాంత్సమారోహ్ అనేది వర్తమాన భారతదేశం యొక్క ప్రాధాన్యాల కు అద్దం పడుతున్నది’’

‘‘బలమైన యువ శక్తి తో దేశం మరింత గా అభివృద్ధి చెందుతుంది, దీని ద్వారా దేశం యొక్క వనరుల కు న్యాయం జరుగుతుంది’’

‘‘ప్రస్తుతంయావత్తు ప్రపంచం ఈ శతాబ్దం భారతదేశం యొక్క శతాబ్దం కాబోతోంది అనే నమ్మకం తో ఉన్నది’’

‘‘నైపుణ్యాని కిఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని మా ప్రభుత్వం గ్రహించింది; అందుకోసం ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసి, విడి గా బడ్జెటు ను కేటాయించింది’’

‘‘ప్రస్తుత కాలానికి అనుగుణం గా రూపుదిద్దుకోవడం అనేది పరిశ్రమ కు, పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి సంస్థ లకు ముఖ్యం’’

‘‘భారతదేశం లోనైపుణ్యాభివృద్ధి తాలూకు పరిధి నిరంతరం గా పెరుగుతూనే ఉంది.  మనం ఒక్క మెకానిక్ లు, ఇంజినీర్ లు, సాంకేతిక విజ్ఞానం లేదా మరొక సేవల కే పరిమితం కాదు’’

‘‘భారతదేశం లోనిరుద్యోగం రేటు ఆరు సంవత్సరాల కాలం లో అత్యంత దిగువ స్థాయి లో ఉంది’’

‘‘రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లో ప్రపంచం లో అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థ ల సరసన భారతదేశం నిలుస్తుందన్న విశ్వాసం తో ఐఎమ్ఎఫ్ ఉంది’’

Posted On: 12 OCT 2023 1:05PM by PIB Hyderabad

కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, నైపుణ్యాభివృద్ధి తాలూకు ఈ వేడుక అద్వితీయమైనటువంటిది గా ఉంది, అంతేకాదు దేశవ్యాప్తం గా విస్తరించిన నైపుణ్యాభివృద్ధి సంస్థ ల సంయుక్త స్నాతకోత్సవం ఘట్టం ఎంతో ప్రశంసనీయమైనటువంటి కార్యక్రమం గా కూడా ఉంది అంటూ అభివర్ణించారు. కౌశల్ దీక్షాంత్ సమారోహ్ వర్తమాన భారతదేశం యొక్క ప్రాధాన్యాల ను ప్రతిబింబిస్తున్నది అని ఆయన అన్నారు. వేల కొద్దీ యువతీయువకులు సాంకేతిక విజ్ఞానం మాధ్యం ద్వారా ఈ కార్యక్రమం తో జత పడడాన్ని ప్రధాన మంత్రి గుర్తించి, వారందరికి తన తరఫున శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఏదైనా దేశం లో ఆ దేశాని కి చెందిన ప్రాకృతిక వనరులు గాని, లేదా ఖనిజ సంబంధి వనరులు గాని, లేదా ఆ దేశాని కి చెందిన సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంతాల వంటి బలాల ను వినియోగించుకోవడం లో యువ శక్తి కి ప్రాముఖ్యం ఉంటుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. బలమైన యువశక్తి అండతో దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది, తద్ద్వారా దేశం యొక్క వనరుల కు న్యాయం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఇదే రీతి న నడుస్తున్న ఆలోచన లు భారతదేశం యొక్క యువత కు సాధికారిత ను కల్పిస్తున్నాయి. తత్ఫలితం గా యావత్తు ఇకోసిస్టెమ్ లో ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి మెరుగుదల లు చోటు చేసుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ’’ఈ విషయం లో భారతదేశం యొక్క వైఖరి రెండు విధాలైంది గా ఉంది’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశం దాదాపు గా నాలుగు దశాబ్దాల కాలం అనంతరం క్రొత్త జాతీయ విద్య విధానాన్ని తీసుకు వచ్చింది. భారతదేశం విద్య మరియు నైపుణ్యాల ద్వారా తన యువత నూతన అవకాశాల తాలూకు ప్రయోజనాన్ని పొందేటట్లుగా వారిని సన్నద్ధుల ను చేస్తున్నది అని ఆయన వివరించారు. ప్రభుత్వం పెద్ద సంఖ్య క్రొత్త వైద్య కళాశాలల ను మరియు ఐఐటి లు, ఐఐఎమ్ లు, లేదా ఐటిఐ లు వంటి నైపుణ్య అభివృద్ధి సంస్థల ను ఏర్పాటు చేస్తోంది అని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ లో భాగం గా కోట్ల కొద్దీ యువతీ యువకులు శిక్షణ ను అందుకొన్నారు అని ఆయన ప్రస్తావించారు. మరో ప్రక్క ఉద్యోగాల ను కల్పిస్తున్నటువంటి సాంప్రదాయక రంగాల ను కూడా బలపరచడం జరుగుతున్నది. అలాగే, ఉపాధి ని ప్రోత్సహించేటటువంటి మరియు నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించేటటువంటి క్రొత్త రంగాల ను సైతం ప్రోత్సహించడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వస్తువుల ఎగుమతుల లో, మొబైల్ ఎగుమతుల లో, ఎలక్ట్రానిక్ సంబంధి ఎగుమతుల లో, సేవల సంబంధి ఎగుమతుల లో, రక్షణ సంబంధి ఎగుమతుల లో మరియు తయారీ లో భారతదేశం సరిక్రొత్త మైలు రాళ్ళ ను చేరుకొంటోంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు; అదే కాలం లో అంతరిక్షం, స్టార్ట్-అప్స్, డ్రోన్స్, ఏనిమేశన్, విద్యుత్తు వాహనాలు, సెమీ కండక్టర్స్ మొదలైనటువంటి అనేక రంగాల లో యువత కు క్రొత్త క్రొత్త అవకాశాల ను పెద్ద సంఖ్య లో కల్పించడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

 ‘‘ప్రస్తుతం యావత్తు ప్రపంచాని కి ఈ శతాబ్దం భారతదేశం యొక్క శతాబ్దం గా కాబోతోంది అనే నమ్మకం ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీని ఖ్యాతి భారతదేశం యొక్క యువ జనాభా దే అని ఆయన అన్నారు. ప్రపంచం లో అనేక దేశాల లో పెద్ద వయస్సు కలిగిన వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్న కాలం లో భారతదేశం నానాటికీ యవ్వన భరితం గా మారుతున్నది అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘‘భారతదేశాని కి ఈ విధమైన భారీ ప్రయోజనం ఉంది’’ అని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం భారతదేశం లోని నైపుణ్యవంతులైన యువత కేసి చూస్తోంది అని ఆయన అన్నారు. గ్లోబల్ స్కిల్ మేపింగ్ విషయం లో భారతదేశం చేసిన ప్రతిపాదన ను ఇటీవల జరిగిన జి20 శిఖర సమ్మేళనం లో ఆమోదించడమైంది అని ఆయన వెల్లడించారు. ఇది రాబోయే కాలాల్లో యువత కు ఉత్తమమైనటువంటి అవకాశాల ను కల్పించడం లో సహాయకారి అవుతుంది అని ఆయన చెప్పారు. అందివస్తున్నటువంటి ఏ ఒక్క అవకాశాన్ని వృథా పోనీయకండి అని ప్రధాన మంత్రి సూచించారు. ఈ విషయం లో మద్దతు ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉంది అంటూ ఆయన హామీ ని ఇచ్చారు. మునుపటి ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి విషయం లో అజాగ్రత వహించాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మా ప్రభుత్వం నైపుణ్యాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొని, దానికోసమంటూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పరచడం తో పాటు గా ఒక ప్రత్యేక బడ్జెటు ను కేటాయించింది’’ అని ఆయన అన్నారు. భారతదేశం ఇదివరకటి కంటే ఎక్కువగా తన యువత యొక్క నైపుణ్యాల పై మరింత గా పెట్టుబడి పెడుతోంది అని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భం లో ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ ను గురించి ఒక ఉదాహరణ గా ఆయన చెప్తూ, ఆ పథకం క్షేత్ర స్థాయి లో యువత ను బలోపేతం చేసింది అన్నారు. ఈ పథకం లో భాగం గా దాదాపు గా ఒకటిన్నర కోట్ల మంది యువతీ యువకుల కు ఇంతవరకు శిక్షణ ను ఇవ్వడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సమీపం లో క్రొత్త నైపుణ్య కేంద్రాల ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వీటి వల్ల పరిశ్రమ కు తన అవసరాల ను నైపుణ్య అభివృద్ధి సంస్థల కు వెల్లడించేందుకు వీలు చిక్కుతుంది. అదే జరిగిన నాడు సదరు నైపుణ్యాల ను యువత లో అభివృద్ధి పరచడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని ఆయన వివరించారు.

నైపుణ్యాల ను అలవరచుకోవడం, నైపుణ్యాల స్థాయి ని పెంపు చేసుకోవడం, ఇంకా రి-స్కిలింగ్ లకు గల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఉద్యోగాల సంబంధి స్వభావం మరియు ఉద్యోగాల తాలూకు అవసరాలు శరవేగం గా మారిపోతున్నాయన్నారు. ఆ మార్పుల కు అనుగుణం గా నైపుణ్యాల ను ఉన్నతీకరించుకోవలసిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఈ కారణం గా పరిశ్రమ, పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి సంస్థ లు వర్తమాన కాలాని కి తగినట్లుగా రూపొందడం చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. నైపుణ్యాల పట్ల శ్రద్ధ అధికం అయింది అని ప్రధాన మంత్రి చెప్తూ, గడచిన తొమ్మిది సంవత్సరాల లో దేశం లో సుమారు గా అయిదు వేల క్రొత్త ఐటిఐ లను స్థాపించి, నాలుగు లక్షల కు పైగా ఐటిఐ సీట్ లను జోడించడమైందన్నారు. ఆ సంస్థల ను సమర్థమైన మరియు ఉత్తమమైన అభ్యాసాల తో పాటు అధిక నాణ్యత కలిగిన శిక్షణ ను ఇచ్చే మాడల్ ఐటిఐ లుగా ఉన్నతీకరించే ప్రక్రియ కొనసాగుతోంది అని కూడా ఆయన అన్నారు.

‘‘భారతదేశం లో నైపుణ్యాభివృద్ధి తాలూకు పరిధి నిరంతరం గా వృద్ధి చెందుతున్నది. మనం మెకానిక్ లు, ఇంజినీర్ లు, సాంకేతిక విజ్ఞానం లేదా మరేదైనా సేవల కు మాత్రమే పరిమితం అయిపోలేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళల స్వయం సేవ సమూహాల ను డ్రోన్ టెక్నాలజీ ని వినియోగించుకోవడాని కి సన్నద్ధం చేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మన నిత్య జీవనం లో విశ్వకర్మ లకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, పిఎమ్ విశ్వకర్మ యోజన అనేది విశ్వకర్మ లకు వారి సాంప్రదాయక నైపుణ్యాల ను ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో, ఆధునిక ఉపకరణాల తో జతపరచుకొనే సామర్థ్యాన్ని అందిస్తుందని వివరించారు.

భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూ ఉన్న క్రమం లో యువత కోసం సరిక్రొత్త అవకాశాల ను కల్పించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం లో ఉద్యోగ కల్పన ఒక క్రొత్త శిఖర స్థాయి ని చేరుకొంది. మరి ఇటీవలి ఒక సర్వే ప్రకారం భారతదేశం లో నిరుద్యోగం రేటు ఆరు సంవత్సరాల కాలం లో అత్యంత తక్కువ స్థాయి లో ఉంది అని ఆయన చెప్పారు. భారతదేశం లో పట్టణ ప్రాంతాల లో మరియు గ్రామీణ ప్రాంతాల లో నిరుద్యోగం చాలా వేగం గా తగ్గుతోందని ప్రధాన మంత్రి చెప్తూ, అభివృద్ధి తాలూకు ప్రయోజనాలు నగరాల కు మరియు పల్లెల కు సమానం గా అందుతున్నాయి అని నొక్కి పలికారు. దీని ఫలితం గా నగరాల లోను, గ్రామాల లోను క్రొత్త అవకాశాలు సమానం గా వృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశం యొక్క శ్రమ శక్తి లో మహిళల భాగస్వామ్యం ఇదివరకు ఎన్నడూ లేని స్థాయి లో అధికం అయింది అని ఆయన చెప్పారు. ఈ ప్రభావం యొక్క ఖ్యాతి గడచిన కొన్నేళ్ళ లో మహిళ ల సశక్తీకరణ కు సంబంధించి భారతదేశం లో ప్రవేశపెట్టిన పథకాలు మరియు ప్రచార ఉద్యమాల దే అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) విడుదల చేసిన ఇటీవలి సంఖ్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతదేశం రాబోయే సంవత్సరాల లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ గా కొనసాగుతుంది అన్నారు. భారతదేశాన్ని ప్రపంచం లోని అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థల లో ఒక ఆర్థిక వ్యవస్థ గా నిలపాలన్న తన సంకల్పాన్ని కూడా ఆయన మరొక్క మారు గుర్తు కు తీసుకు వచ్చారు. ఐఎమ్ఎఫ్ కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లో భారతదేశం ప్రపంచం లోని అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థల లో ఒక ఆర్థిక వ్యవస్థ గా రూపొందగలుగుతుందన్న విశ్వాసం తో ఉంది అని ఆయన అన్నారు. అదే జరిగిందంటే గనక దేశం లో ఉపాధి సంబంధి మరియు స్వతంత్రోపాధి సంబంధి నూతన అవకాశాలు ఏర్పడుతాయఅని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, స్మార్ట్ మరియు స్కిల్ డ్ మేన్ పవర్ సాల్యూశన్స్ ను అందించాలి అంటే ప్రపంచం లో భారతదేశాన్ని నైపుణ్యం కలిగిన సిబ్బంది తాలూకు అతి పెద్ద కేంద్రం గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు. ‘‘నేర్చుకోవడం, బోధించడం లతో పాటు ముందంజ వేయడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండాలి. జీవనం లో అడుగడుగునా మీరు సఫలం అవుదురు గాక’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 



(Release ID: 1967244) Visitor Counter : 54