శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

2023 అక్టోబర్ 13న ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో "సి.ఆర్.టి.డి.హెచ్ ల ద్వారా ఎంఎస్ఎంఇల సాధికారత " పై మేధోమథన శిబిరం (చింతన్ శిబిర్) ప్రారంభోత్సవం


యూనివర్శిటీ (డిపిఎస్ ఆర్ యు), న్యూఢిల్లీ కి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మద్దతు .

Posted On: 12 OCT 2023 11:21AM by PIB Hyderabad

డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్ఐఆర్) పరిశ్రమల ద్వారా ఆర్ అండ్ డిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అధిక వాణిజ్య విలువ కలిగిన అత్యాధునిక ప్రపంచవ్యాప్త పోటీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి పారిశ్రామిక యూనిట్లకు మద్దతు ఇస్తోంది. ప్రయోగశాల-స్థాయి ఆర్ అండ్ డి వేగవంతమైన వాణిజ్యీకరణను కూడా ప్రేరేపిస్తుంది, సాంకేతిక బదిలీ సామర్థ్యాలను పెంచుతుంది, మొత్తం ఎగుమతుల్లో టెక్నాలజీ ఇంటెన్సివ్ ఎగుమతుల వాటాను పెంచుతుంది.  పారిశ్రామిక కన్సల్టెన్సీని బలోపేతం చేయడం, దేశంలో శాస్త్రీయ ,పారిశ్రామిక పరిశోధనలను సులభతరం చేయడానికి వినియోగదారు-స్నేహపూర్వక సమాచార నెట్వర్క్ ను ఏర్పరుస్తుంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ లు) దేశవ్యాప్తంగా సమాన అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా భారతదేశ మొత్తం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల, ఈ ఎంఎస్ ఎం ఇ లు ప్రభుత్వ నిధులతో కూడిన పరిశోధన - అభివృద్ధిని ఉత్పత్తులు , ప్రక్రియలుగా అనువదించడానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా, డిఎస్ఐఆర్ 2014 సంవత్సరం నుండి సి ఆర్ టి డిహెచ్ కార్యక్రమం కింద ఎంఎస్ఎంఇ క్లస్టర్లతో అనుసంధానం , సమీపంలో ఉన్న ప్రభుత్వ నిధుల సంస్థలలో కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్  (సి ఆర్ టి డిహెచ్) లను అమలు చేస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 18 సీఆర్ టీడీహెచ్ లు ఎంఎస్ ఎం ఇ లకు,  పరిశోధనా సంస్థలకు శాస్త్రీయ పరిజ్ఞానం, ఆలోచనలను కొత్త ఉత్పత్తులు, ప్రక్రియల్లోకి అనువదించడానికి అత్యాధునిక ఆర్ అండ్ డీ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, ఆవిష్కర్తలు, స్టార్టప్ లు ఈ సౌకర్యాలను వినియోగించుకుంటున్నాయి.

"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" చొరవలో భాగంగా "ఆత్మనిర్భర్ భారత్" దిశగా ప్రయాణాన్ని సాగిస్తూనే, సి ఆర్ టి డిహెచ్ లు ఎంఎస్ఎంఇలు / స్టార్టప్ లు / ఆవిష్కర్తల మధ్య పరస్పర చర్యను బలోపేతం చేయడానికి, డిఎస్ఐఆర్ అన్ని సి ఆర్ టి డిహెచ్ లలో "సి ఆర్ టి డిహెచ్.ల ద్వారా  ఎంఎస్ఎంఇల సాధికారత పై  చింతన్ శిబిర్” నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ భాగస్వాములతో లోతైన చర్చలు, నిమగ్నతకు ఈ శిబిరాలు వేదికలుగా పనిచేస్తాయి. ఐఐటీ ఖరగ్పూర్, సీఎస్ఐఆర్-ఐఐటీఆర్, లక్నో, సీఎస్ఐఆర్-సీఎంఇఆర్ఐ, దుర్గాపూర్, సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ భువనేశ్వర్ లలో ఇప్పటికే నాలుగు చింతన్ శిబిరాలను డీఎస్ఐఆర్ నిర్వహించగా, ఐదోది 2023 అక్టోబర్ 13 న న్యూఢిల్లీలోని ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ (డీపీఎస్ఆర్ యు )లో నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీలోని డీపీఎస్ఆర్ యు వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రమేశ్ కె గోయల్ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. డీపీఎస్ఆర్ యు  అండ్ డీపీఎస్ఆర్ యు - సి ఆర్ టి డి హెచ్ విజన్ పై ఆయన ప్రసంగిస్తారు, ఆ తర్వాత డీఎస్ఐఆర్ కార్యదర్శి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి ప్రారంభోపన్యాసం చేస్తారు.  సి ఆర్ టి డి హెచ్ ,డిఎస్ఐఆర్ సైంటిస్ట్-జి అండ్ హెడ్- డాక్టర్ సుజాత చక్లనోబిస్ చింతన్ శిబిర్ ఉద్దేశం గురించి వివరిస్తారు. డిపిఎస్ఆర్. యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డాక్టర్) హర్విందర్ పోప్లి , డిపిఎస్ఆర్. యు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-సి ఆర్ టి డిహెచ్ ప్రొఫెసర్ గీతా అగర్వాల్ ప్రసంగాలతో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో డీఎస్ఐఆర్ సీ ఆర్ టి డీహెచ్ స్కీమ్ విభాగానికి చెందిన డాక్టర్ విపిన్ సి శుక్లా, డాక్టర్ రంజిత్ బైర్వా, డాక్టర్ సుమన్ మజుందార్ తో పాటు డీపీఎస్ ఆర్ యు కు కు చెందిన సీఆర్టీడీహెచ్ బృందం, డీపీఎస్ ఆర్ యు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ బృందం పాల్గొంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్లు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆర్ అండ్ డీ ప్రయత్నాల్లో సీఆర్టీడీహెచ్ ప్రయోజనాలను అన్వేషిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం ఎగ్జిబిషన్ లోని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.

'ఎంఎస్ఎం ఇ లకు ఆర్ అండ్ డీ, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సి ఆర్ టి డి హెచ్ ద్వారా మద్దతు వ్యవస్థ ఏర్పాటు ‘అనే అంశంపై డీఎస్ఐఆర్ సైంటిస్ట్-ఎఫ్, అండ్ సి ఆర్ టి డి హెచ్   మెంబర్ సెక్రటరీ డాక్టర్ విపిన్ సి శుక్లా నేతృత్వంలో ప్యానల్ డిస్కషన్ ప్రారంభమవుతుంది. ఎంఎస్ఎం ఇలు ఎదుర్కొంటున్న సవాళ్లను అన్వేషించడం,  చర్చించడం, సమస్య పరిష్కారానికి సాధనాలుగా పరిశోధన , అభివృద్ధిని ప్రోత్సహించడంపై బలమైన దృష్టి పెడతారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధానాలు, కార్యక్రమాలు, చొరవ ల అభివృద్ధికి, అమలుకు దోహదపడే కొత్త ఆలోచనలు, అంతర్దృష్టులు, దృక్పథాలను సృష్టించడం దీని ఉద్దేశం. ఎంఎస్ఎంఇ లు, స్టార్టప్ లు,  పరిశ్రమలు వంటి ఈ వ్యాపారాలకు సి ఆర్ టి డి హెచ్ లో అందుబాటులో ఉన్న వనరులు వారి సామర్థ్యాన్ని , ఉత్పాదకతను పెంచుతాయో ఇంకా తక్కువ ఖర్చు ఆరోగ్య పరిష్కారాల రంగంలో ఆవిష్కరణలను ఎలా ముందుకు తీసుకువెళతాయో అర్థం చేసుకోవడానికి చింతన్ శిబిర్ ఒక వేదికను అందిస్తుంది. ఎంఎస్ఎం ఇ లు , ఇతర భాగస్వాములకు పరిశోధన మౌలిక సదుపాయాలు, సాంకేతికతలు, భవిష్యత్తు సాంకేతికతలు,  దేశంలో వారికి ప్రస్తుత , భవిష్యత్తు అవకాశాలతో సాధికారత కల్పించడంలో సి ఆర్ టి డి హెచ్ పాత్రను విభిన్న సెషన్ లు ప్రముఖంగా వివరిస్తాయి.

మొత్తం మీద, సమగ్రమైన చర్చలు, విమర్శనాత్మక విశ్లేషణ , వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా ప్రభుత్వ అధికారులు, డిపిఎస్ ఆర్ యు , భాగస్వాముల ఉమ్మడి విజ్ఞానం, పరిజ్ఞానం,  నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. దేశంలో ఎంఎస్ఎంఇలు, స్టార్టప్ లు, , ఆవిష్కర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంభావ్య పరిష్కారాలను మేధోమథనం చేయాలనే లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది, అదే సమయంలో తక్కువ ఖర్చు ఆరోగ్య సంరక్షణ రంగంలో పారిశ్రామిక పరిశోధన , తయారీకి భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేసే  అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటుంది.

 

***



(Release ID: 1967238) Visitor Counter : 40