ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మీజిల్స్ మరియు రుబెల్లా టీకా కవరేజీని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 5.0 (ఐఎంఐ 5.0) కార్యక్రమం 14 అక్టోబర్ 2023న మూడు విడతలను ముగిస్తుంది.
ఐఎంఐ 5.0 దేశంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించబడుతోంది మరియు 5 సంవత్సరాలలోపు పిల్లలను ఇది కవర్ చేస్తుంది.
దేశవ్యాప్తంగా ఐఎంఐ 5.0 మొదటి 2 విడతల కార్యక్రమంలో 34 లక్షల మంది పిల్లలు మరియు 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ డోస్‌లను అందించారు.
మిషన్ ఇంద్రధనుష్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5.06 కోట్ల మంది చిన్నారులు, 1.25 కోట్ల మంది గర్భిణులకు వ్యాక్సిన్‌లు వేశారు.
Posted On:
12 OCT 2023 11:43AM by PIB Hyderabad
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ 5.0) కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్‌షిప్ రొటీన్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్. ఇది 14 అక్టోబర్ 2023న మొత్తం 3 రౌండ్‌లను ముగిస్తుంది. ఐఎంఐ 5.0 రొటీన్ ఇమ్యునైజేషన్ సేవలు పొందలేకపోయిన పిల్లలు మరియు గర్భిణులకు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా దేశంలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమం నిర్వహించబడుతోంది మరియు 5 సంవత్సరాలలోపు పిల్లలను కవర్ చేస్తోంది. (మునుపటి కార్యక్రమాలలో 2 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉన్నారు)
ఐఎంఐ 5.0 కార్యక్రమం జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ (ఎన్‌ఐఎస్) ప్రకారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపి) కింద అందించబడిన అన్ని టీకాలకు రోగనిరోధక కవరేజీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నాటికి మీజిల్స్ & రుబెల్లా నిర్మూలన లక్ష్యంతో మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాక్సినేషన్ కవరేజీని మెరుగుపరచడం మరియు దేశంలోని అన్ని జిల్లాల్లో పైలట్ మోడ్‌లో రొటీన్ ఇమ్యునైజేషన్ కోసం యూ-విన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది.
ఐఎంఐ 5.0 మూడు రౌండ్లలో నిర్వహించబడుతోంది.7-12 ఆగస్టు, 11-16 సెప్టెంబర్, మరియు 9-14 అక్టోబర్ 2023 అంటే నెలలో 6 రోజులు నిర్వహించడబడుతోంది. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాలు/యూటీలు ఐఎంఐ 5.0 కార్యక్రమానికి సంబంధించిన మూడు రౌండ్లన్నింటినీ అక్టోబర్ 14, 2023 నాటికి ముగిస్తాయి. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నాలుగు రాష్ట్రాలు ఆగస్టులో ఐఎంఐ 5.0 ప్రచారాన్ని ప్రారంభించలేకపోయాయి. ఈ రాష్ట్రాలు 1వ రౌండ్‌ను ముగించాయి మరియు ప్రస్తుతం 2వ రౌండ్‌ను నిర్వహిస్తున్నాయి. వారు నవంబర్ 2023 నెలలో 3వ రౌండ్ ఎంఐఎం 5.0 కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
30 సెప్టెంబర్ 2023 నాటికి, దేశవ్యాప్తంగా ఐఎంఐ 5.0 కార్యక్రమం మొదటి 2 రౌండ్లలో 34,69,705 మంది పిల్లలు మరియు 6,55,480 మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ డోసులను అందించారు.
డిహెచ్‌ఎస్ డైరెక్టర్ సియో అధికారులతో కలిసి అస్సాంలోని దర్రాంగ్ జిల్లా, సిఫాజర్ బిపిహెచ్‌సి పరిధిలోని హెచ్‌ఆర్‌ఏ బ్రిక్లిన్‌ను సందర్శించారు.
సిక్కింలోని పిల్లలు, శిశువులు మరియు గర్భిణీ స్త్రీల రోగనిరోధక శక్తిని తనిఖీ చేయడానికి సెషన్ సైట్‌లు మరియు రిలీఫ్ క్యాంపు ప్రాంతాల పర్యవేక్షణ.
మణిపూర్‌లోని ఐఎంఐ సెషన్‌లో టీకా వేసిన తర్వాత శిశువుకు సహాయం చేస్తున్న ఎఎన్‌ఎం కమ్ వ్యాక్సినేటర్.
ఐఎంఐ సెషన్ హెచ్‌ఎస్‌సి బహాంగ్, నగ్గర్ బ్లాక్ , కులు, హిమాచల్ ప్రదేశ్.
ఐఎంఐ 5.0 కోసం ప్రిపర్డ్‌నెస్ అసెస్‌మెంట్ నేషనల్ మానిటర్స్ ద్వారా 19 జూలై మరియు 23 జూలై 2023 మధ్య నిర్వహించబడింది. వారు 27 రాష్ట్రాలు/యూటీలలోని 154 అధిక ప్రాధాన్యత గల జిల్లాల్లో విస్తృతమైన సంసిద్ధత అంచనాలను నిర్వహించారు. సిఫార్సులతో పాటు సంసిద్ధత అంచనా యొక్క ఫలితాలు అన్ని రాష్ట్రాలు/యుటిలు పంచుకోబడ్డాయి.
ఐఎంఐ 5.0పై జాతీయ వర్క్‌షాప్ 23 జూన్ 2023న నేషనల్ క్యాపిటల్‌లో అన్ని రాష్ట్రాలు/యూటీలకు ప్రచారం గురించి దిశానిర్దేశం చేయడానికి నిర్వహించబడింది.
కమ్యూనికేషన్ వ్యూహంతో పాటు కార్యాచరణ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు/యూటీలతో భాగస్వామ్యం చేయబడ్డాయి. కమ్యూనికేషన్ వ్యూహంలో 360-డిగ్రీల కమ్యూనికేషన్ విధానం, వ్యాక్సిన్‌లో సందేహాలను పరిష్కరించడం మరియు స్థానిక ప్రభావశీలులు మరియు నాయకులను నిమగ్నం చేయడం వంటి వ్యూహాలతో కూడినది. స్థానిక భాషల్లో అనుసరణ కోసం వివిధ ఐఈసీ మెటీరియల్స్ అన్ని రాష్ట్రాలు/యూటీలతో భాగస్వామ్యం చేయబడ్డాయి మరియు కీలక సందేశాలతో ప్రజలకు సమర్థవంతంగా చేరతాయి.
ఐఎంఐ 5.0 ప్రజల నుండి భాగస్వామ్యాన్ని చూసింది మరియు అన్ని రాష్ట్రాలు/యూటీల అంతటా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు, ప్రజలు సమీపంలోని టీకా కేంద్రాలను సందర్శించి, కుటుంబం మరియు సమాజంలోని పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఏవైనా తప్పిపోయిన మోతాదులను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
2014 నుంచి దేశవ్యాప్తంగా మిషన్ ఇంద్రధనుష్ 11 దశలు పూర్తయ్యాయి. 12వ దశ ప్రస్తుతం కొనసాగుతోంది. కార్యక్రమం కింద ఇప్పటి వరకు మొత్తం 5.06 కోట్ల మంది పిల్లలు మరియు 1.25 కోట్ల మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్‌లు అందించారు.
***
(Release ID: 1967236)
Visitor Counter : 192