పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

భారతదేశ ఇంధన డిమాండ్ భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఇంధనాన్ని అందించడం కొనసాగిస్తుంది మరియు రాబోయే సంవత్సరాల్లో విపరీతంగా వృద్ధి చెందుతుంది: పెట్రోలియం మంత్రి హర్దీప్ ఎస్ పూరి


ప్రారంభమైన 26వ ఎనర్జీ టెక్నాలజీ మీట్

Posted On: 10 OCT 2023 1:33PM by PIB Hyderabad

గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం సాధించిన వేగవంతమైన పురోగతి గురించి పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ..నవంబర్ 2022 నాటికి 10 శాతం బయోఫ్యూయల్ బ్లెండింగ్ చేయాలన్న లక్ష్యాన్ని ఐదు నెలల ముందుగానే చేరుకున్నట్లు చెప్పారు. తద్వారా 2030 నాటి 20 శాతం జీవ ఇంధనం కలపాలన్న లక్ష్యం 2025 మారిందని వివరించారు.

 

image.png


26వ ఎనర్జీ టెక్నాలజీ మీట్‌ను ప్రారంభించిన సందర్భంగా పెట్రోలియం & సహజవాయువు మంత్రి శ్రీ పూరి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇంధన రంగంలోని 3 సవాళ్లు అంటే లభ్యత, స్థోమత మరియు సుస్థిరతపై మాట్లాడుతూ ప్రారంభంలో తాము స్థిరత్వంపై సవాలును వేగవంతం చేయడానికి  అనుమతించలేదని అన్నారు. అయితే నెమ్మదిగా మరియు ఖచ్చితంగా ఈ పరిమితిని విధించుకున్నందున  ఈ 20 శాతం పరిమితిని తొలగిస్తున్నామని మంత్రి చెప్పారు. ఎందుకంటే ఇంజిన్లలో 20 శాతం వరకు కలపడం వల్ల పెద్దమొత్తంలో అవసరం లేదని ఆటోమొబైల్ కంపెనీలు చెప్పాయి. అయితే ఇప్పుడు మన దగ్గర 20 శాతం మిశ్రమ ఇంధనం ఉందని, ఇథనాల్, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు తదితర ప్రక్రియలు పటిష్టంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆటోమొబైల్ తయారీదారులు కూడా సాంకేతిక పురోగతి పరంగా ముందుకు సాగుతున్నారు. ఇండియా ఆయిల్ ఇటీవల ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ బస్సుకు ఉదాహరణగా ఇస్తూ ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీ మైండ్‌సెట్‌లోకి వెళ్తున్నామని మనకు ఎలక్ట్రిక్ కార్లు మరియు ఇతర ఫ్లెక్సీ-ఇంధన వాహనాలు ఉన్నాయని అన్నారు.

దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ గురించి మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఇంధనాన్ని అందించడానికి భారతదేశ ఇంధన డిమాండ్ కొనసాగుతుందని మరియు రాబోయే సంవత్సరాల్లో విపరీతంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం దేశం చమురు వినియోగంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద వినియోగదారుగా, 3వ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా, 4వ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారుగా, 4వ అతిపెద్ద రిఫైనర్‌గా, 4వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉందని ఆయన అన్నారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారతదేశం 25% వాటాను కలిగి ఉంటుందని కేంద్రమంత్రి ఉద్ఘాటించారు.

బయో ఫ్యూయల్స్ అలయన్స్ ప్రారంభంతో గ్లోబల్ బయో ఫ్యూయల్ మార్కెట్ ప్రస్తుతం 92 బిలియన్ డాలర్ల నుండి 200 బిలియన్ డాలర్లకు త్వరలో పెరుగుతుందని శ్రీ పూరి చెప్పారు. అయితే, ఇది కథ ముగింపు కాదని..జీవ ఇంధనాలపై అసలు కథ ఇప్పుడే మొదలైందని అన్నారు. 10 శాతం ఎథ్నాల్ మిశ్రమం దిగుమతి బిల్లుపై గణనీయమైన పొదుపుకు దారితీసింది మరియు ఇది 20 శాతం మిశ్రమంతో పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

దేశ వృద్ధిని నిర్ణయించడానికి దాని శక్తి వినియోగాన్ని చూడటమే ఖచ్చితమైన మార్గం అని మంత్రి అన్నారు. మరియు భారతదేశ ఇంధన వినియోగం ప్రపంచ సగటు కంటే 3 రెట్లు. ఇలాగే మరిన్ని సమావేశాలు నిర్వహించాలని మరిన్ని దేశాలు వచ్చేలా ప్రోత్సహించాలని, చర్చలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

భారత ప్రభుత్వ పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సిహెచ్‌టి),  ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) మరియు నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్‌)తో కలిసి న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (భారత్ మండపం) 9-11 అక్టోబర్ 2023లో 26వ ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటిఎం) నిర్వహిస్తోంది.

పెట్రోలియం మరియు సహజ వాయువు & కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, పిఎన్‌జి కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ మరియు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కకోద్కర్, ఎంఓపి&ఎన్‌జి హైడ్రోకార్బన్‌లపై సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్,సిఎండీలు, డైరెక్టర్లు మరియు చమురు కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమక్షంలో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రారంభ సెషన్‌లో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రిఫైనరీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ & సక్షం అవార్డ్స్  మరియు ఇన్నోవేషన్ అవార్డులను పెట్రోలియం & సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి  విజేతలకు అందించారు. అవార్డుల జాబితా క్రింద ఉంది:

 

image.png


విద్యుదీకరణలో పెరుగుదల, చలనశీలత రంగంలో మార్పులు మరియు శక్తి మిశ్రమంలో పునరుత్పాదకత యొక్క పెరుగుతున్న వాటా కారణంగా గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్‌స్కేప్ ఒక నమూనా మార్పును చూస్తోంది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడంతోపాటు పెట్రోకెమికల్స్, బయోఫైనింగ్ మరియు గ్రీన్ హైడ్రోజన్‌లతో మరింతగా ఏకీకృతం చేయడం భారతీయ రిఫైనింగ్ రంగం యొక్క సవాలు. అందువల్ల ఈ కార్యక్రమ థీమ్ “ఎమర్జింగ్ ఎనర్జీ ట్రెండ్స్ & ఫ్యూచర్ ఆఫ్ రిఫైనింగ్”.

వార్షిక కన్వెన్షన్ కమ్ ఎగ్జిబిషన్ ఇంధన రంగంలో మరియు ముఖ్యంగా రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలో ఇటీవలి పురోగతులు మరియు సాంకేతిక పరిణామాలను బహిర్గతం చేయడానికి రిఫైనర్లు మరియు సాంకేతిక సేవా ప్రదాతలకు  వేదికను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 27 టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లు ఇంధన రంగంలో ఇటీవలి సాంకేతిక పురోగతిని ప్రదర్శించడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భారత్‌తో పాటు ఇతరదేశాల నుండి 1300 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు.

ఈఐఎల్ అనేది దక్షిణాసియాలోని ప్రముఖ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ మరియు ఈపీసీ కంపెనీ హైడ్రోకార్బన్‌లు, మౌలిక సదుపాయాలు, జీవ ఇంధనాలు, మైనింగ్ & మెటలర్జీ, నీరు & వ్యర్థాల నిర్వహణ, సౌర & అణుశక్తి మరియు ఎరువులు వంటి రంగాలలో విస్తృతమైన సేవలను అందిస్తోంది.

ఎన్‌ఆర్‌ఎల్‌ అనేది 3 ఎంఎంటిపిఏ నుండి 9  ఎంఎంటిపిఏకి దాని సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడానికి ఒక ప్రధాన సమీకృత రిఫైనరీ విస్తరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఎంఓపి&ఎన్‌జి క్రింద షెడ్యూల్-ఏ కేటగిరీ  మినీరత్న సిపిఎస్‌ఈ.

 

***



(Release ID: 1966323) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi , Marathi