వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని చావాలా లోగల బిఎస్ఎఫ్ క్యాంప్ వద్ద , కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సిఎపిఎఫ్ ఎస్ ) వారికోసం చిరుధాన్యాల ఎఫ్.పి.ఒ ఎగ్జిబిషన్ ఏర్పాటు.


30 కి పైగా రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్.పి.ఒలు) ముడి చిరుధాన్యాలతోపాటు , అప్పటికప్పుడు వండుకునేందుకు వీలైన, వెంటనే తినేందుకు ఉపయోగపడే ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించాయి.

చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ఎగ్జిబిషన్ లోనే వండి సందర్శకులకు రుచిచూపించే కౌంటర్లను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ప్రథమార్థంలో కేంద్ర హోంమంత్రి త్వశాఖ కేంద్ర సాయుధ బలగాలలోని వారు, జాతీయ విపత్తు స్పందన బలగాలలోని వారికి అందించే ఆహారంలో 30 శాతం చిరుధాన్యాలను ప్రవేశ పెట్టింది.

Posted On: 06 OCT 2023 3:08PM by PIB Hyderabad

కేంద్ర సాయుధ బలగాలలో శ్రీ అన్న లేదా చిరుధాన్యాల వినియోగాన్ని మరింత గా ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం, కేంద్ర సాయుధ బలగాల వారికోసం చిరుధాన్యాల ఎప్.పి.ఒ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 6 నుంచి న్యూఢిల్లీలోని చావాలా లో బిఎస్.ఎఫ్.క్యాంప్ వద్ద దీనిని ఏర్పాటు   చేశారు. దేశవ్యాప్తంగా గల వివిధ ప్రాంతాలనుంచి, 30 మందికి పైగా రైతు
ఉత్పత్తి సంస్థలు (ఎఫ్.పి.ఒలు) ముడి చిరుధాన్యాల ఉత్పత్తులతోపాటు, అప్పటికప్పుడు వండుకునేందుకు వీలైన ఉత్పత్తులు, వెంటనే తినేందుకు వీలైన ఉత్పత్తులను ప్రదర్శించాయి. వివిధ పారామిలటరీ బలగాలకు చెందిన
సుమారు వెయ్యి మంది ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
ఈ ఎగ్జిబిషన్ను డిఎడబ్ల్యు అడిషనల్ సెక్రటరీ శ్రీ పైజ్ అహ్మద్ కిద్వాయ్ రిబ్బన్ కత్తిరించి ప్రారంబించారు. ఆయన వెంట డిఎఎఫ్ డబ్ల్యు అడిషనర్ సెక్రటరీ శ్రీ  ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ ,
డిఎఫ్ డబ్ల్యు జె.ఎస్. కాప్స్ శ్రీమతి శుభా ఠాకూర్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరుధాన్యాల ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తూ శ్రీ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, దేశంలో 75,000 రైతు ఉత్పత్తి సంస్థలు చిన్న రైతులకు అండగా ఉండేందుకు, తగిన వనరులు, మార్కెట్ అనుసంధానతతో కృషి
చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజస్థాన్, యుపి, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 34 చిరుధాన్యాల ఎఫ్.పి.ఒలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయని, వారు తమ చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు,
సిఎపిఎప్ క్యాంటీన్లు, డిపార్టమెంటల్ స్టోర్లతో నేరుగా సంబంధాలు నెలకొల్పుకున్నారని ఇది భవిష్యత్తులో వీటి నుంచి చిరుధాన్యాల సేకరణకు ఉపకరిస్తుందని అన్నారు.
డిఎ అండ్ ఎఫ్.డబ్ల్యు , జె.ఎస్. కాప్స్ శ్రీమతి శుభా ఠాకూర్ మాట్లాడుతూ చిరుధాన్యాల ఉత్పత్తులను ఆదరిస్తున్నందుకు , పారామిలటరీ బలగాలను అభినందించారు. అలాగే చిరుధాన్యాల ఎఫ్.పి.ఒలకు, పారామిలటరీ బలగాలకు మధ్య
ఫలప్రదమైన సమన్వయం , సహకారం ఏర్పడగలదన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. ఈ ఎఫ్.పి.ఒలు తమ ఉత్పత్తులు ప్రదర్శించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
 ఈ ఎగ్జిబిషన్ ఎఫ్.పి.ఒలు నేరుగా సాయుధ బలగాలతొ , వారి కుటుంబాలతో సంభాషించడానికి, వివిధ చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ప్రొక్యూర్మెంట్ అధికారులు, చెఫ్లు, కుక్లు చిరుధాన్యాల
ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి, చిరుధాన్యాలను సులభంగా సేకరించడానికి, ఎఫ్.పి.ఒ అనుసంధానతను పెంపొందించుకోవడానికి, ఆయా విభాగాలు తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా
చిరుధాన్యాలను సమీకరించుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపకరించింది.

ఈ ఏడాది ప్రథమార్థంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ , కేంద్ర సాయుధ బలగాలు, జాతీయ విపత్తు దళం సభ్యులకు వారికి అందించే ఆహారంలో 30 శాతం చిరుధాన్యాల వంటకాలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా , చిరుధాన్యాలు మంచి పోషక విలువలుగల ఆహారంగా   పారామిలటరీ బలగాల శారీరక దారుఢ్యాన్ని పెంచేందుకు అందించాలని నిర్ణయించారు.
ఈ చిరుధాన్యాలలో మంచి లవణాలు, పీచుపదార్ధం, అవసరమైన పోషకాలు ఉంటాయి. 2023 ఆగస్టులో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ పారామిలటరీ బలగాలలో పనిచేసే 250 మంది చెఫ్లు, వంటవారికి
చిరుధాన్యాల వంటకాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ పారమిలటరీ బలగాలలో అస్సాం రైఫిల్స్, సరిహద్దు భద్రతా దళం, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీసు దళం,
ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు, జాతీయ భద్రతా గార్డ్, సశస్త్ర సీమా బల్, తోపాటు వివిధ ప్రభుత్వ క్యాంటీన్లకు చెందిన వారు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన మిల్లెట్ వంటకాల శిక్షణ ద్వారా,
చిరుధాన్యాలతో ఉపాహారం నుంచి, పూర్తి భోజన పదార్ధాల వరకు తయారు చేయడంపై వారికి అవగాహన కల్పించారు. దీనితో వారు పారామిలటరీ బలగాలకు రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను తగిన విధంగా చేర్చడానికి వీలు కలుగుతుంది.


.34 కు పైగా రైతు ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అలాగే  పలు   ఉత్పత్తులను కమాండెంట్లు, సెకండ్ ఇన్ కమాండెంట్లు,క్వార్టర్ మాస్టర్లు , చెఫ్లు కుక్లు, వారి కుటుంబాలవారికి ఈ ఎగ్జిబిషన్ సందర్బంగా,ప్రదర్శించడమే కాక వాటిని అమ్మారు.
ఈ ఎగ్జిబిషన్లో అప్పటికప్పుడు తినేందుకు వీలైన చిరుధాన్యాల ఉత్పత్తులైన మిల్లెట్ ఖాక్రా, బజ్రా కుకీలు, జోవర్ లడ్డూలు, మిల్లెట్ రస్క్లు, రాగి నమ్ కీన్లు, కేక్లు వంటి వి ఉన్నాయి. ఈ పదార్థాల ను ఎగ్జిబిషన్కు వచ్చిన వారు ఇష్టంగా రుచిచూశారు.
అలాగే ఈ చిరుధాన్యాల ఉత్పత్తుల గురించి మరింతగా తెలుసుకునేందుకు వారు ఆసక్తి ప్రదర్శించారు. చిరుధాన్యాల పిండి, రవ్వనుంచి వివిధ రకాల వంటలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు. ఇడ్లీ పిండి,
చిరుధాన్యాలతో ఉప్మా తయారు చేసుకోవడం, మిల్లెట్ నూడుల్స్,వంటి వాటిని తమ రోజువారి ఉపాహారంలో చేర్చుకోవడం గురించి సందర్శకులు తెలుసుకున్నారు.

ఎగ్జిబిషన్ లో అక్కడికక్కడే చిరుధాన్యాల వంటకాలను వండి పారామిలటరీ బలగాల అధికారులకు,జవాన్లకు రుచి చూపించారు. రాగి, జొన్న,సజ్జలతో వంటకాలు, చిరుధాన్యాల పొంగలి, రాగి లడ్డులు, చిరుధాన్యాలతో , డ్రైఫ్రూట్ కలిపిన పదార్ధాలు,
సందర్శకులకు రుచి చూపించారు. చిరుధాన్యాల ఉత్సవంతోపాటు సెల్ఫీ బూత్ను ఒక దానిని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చిరుధాన్యాల ఆకారంతో ఈ బూత్లు ఏర్పాటుచేసి, దానిపై హ్యాపీ మిల్లెట్ ఫ్యామిలీ అని రాశారు. అక్కడ సందర్శకులు
తమ సెల్ఫీలు తీసుకున్నారు. ఇది అద్భుతంగా  విజయవంతమైంది.

 

***


(Release ID: 1966221) Visitor Counter : 103