ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ గేమ్స్ 2022 లో పాలుపంచుకొన్న భారతీయక్రీడాకారుల దళం తో అక్టోబరు 10 వ తేదీ న భేటీ అయ్యి వారిని ఉద్దేశించిప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 09 OCT 2023 1:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 10 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4 గంటల 30 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియమ్ లో ఇటీవల ఏశియాన్ గేమ్స్ 2022 లో పాలుపంచుకొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో భేటీ కావడం తో పాటు గా వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

ఏశియాన్ గేమ్స్ 2022 లో క్రీడాకారుల శ్రేష్ఠమైన కార్యసాధన కు గాను వారి ని అభినందించడంతో పాటు రాబోయే కాలం లో పోటీల కై వారిలో ప్రేరణ ను కలిగించడానికి ప్రధాన మంత్రి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. భారతదేశం ఏశియాన్ గేమ్స్ 2022 లో 28 బంగారు పతకాలు సహా మొత్తం 107 పతకాల ను గెలిచింది. గెలిచిన పతకాల పరం గా చూస్తే గనక ఇది ఏశియాన్ గేమ్స్ 2022 లో భారతదేశం యొక్క అత్యుత్తమమైనటవంటి ప్రదర్శన గా ఉన్నది.

 

ఈ కార్యక్రమాని కి ఏశియాన్ గేమ్స్ లో పాల్గొన్న భారతదేశం క్రీడాకారులు, క్రీడాకారిణుల తో పాటు వారి కోచ్ లు, భారతీయ ఒలంపిక్ సంఘానికి చెందిన అధికారులు, జాతీయ క్రీడల సమాఖ్య ల ప్రతినిధులు మరియు యువజన వ్యవహారాలు, ఇంకా క్రీడ ల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా హాజరు కానున్నారు.

 

****

 



(Release ID: 1965931) Visitor Counter : 128