శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రోగి సంరక్షణలో మారుతున్న అవసరాలను తీర్చడానికి మరియు అందుబాటులో ఉన్న రోగనిర్ధారణ మరియు చికిత్సా పద్ధతులను ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ఏఐ, క్వాంటం మరియు ఇతర కొత్త సాంకేతికతలతో నైపుణ్యం పెంచే వైద్యులను ప్రాతిపాదించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రివెంటివ్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్‌లో భారతదేశం ముందంజలో ఉందని చెప్పిన డాక్టర్ జితేంద్ర సింగ్

పెరుగుతున్న జీవితకాలంతో అమృతకాల్ సమయంలో భారతదేశం బైపోలార్ సవాలును ఎదుర్కొంటుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

" భారత్‌@2047 ఆర్కిటెక్ట్‌గా మారబోతున్న భారీ యూత్ రిసోర్స్ పూల్ శక్తిని సంరక్షించడంలో ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌ సహాయపడుతుంది"

నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా) 63వ వార్షిక స్నాతకోత్సవంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 08 OCT 2023 1:49PM by PIB Hyderabad

ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), క్వాంటం మరియు ఇతర కొత్త సాంకేతికతలతో మెరుగైన వైద్య నిపుణులను రోగుల సంరక్షణలో మారుతున్న అవసరాలను తీర్చడానికి మరియు అందుబాటులో ఉన్న తాజా రోగనిర్ధారణ మరియు చికిత్సా పద్ధతులను ఉత్తమంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు.

బెంగుళూరులోని రామయ్య మెడికల్ కాలేజీలో జరిగిన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా),నామ్స్‌ 63వ వార్షిక స్నాతకోత్సవంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

 

image.png


డయాబెటాలజిస్ట్ మరియు మెడిసిన్ ప్రొఫెసర్ కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా యువ నిపుణులలో నిరంతర నైపుణ్యాన్ని పెంపొందించాలని చెబుతూ.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రివెంటివ్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్‌లో ముందంజలో ఉందని అన్నారు. దేశంలోని పౌరులందరికీ ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అందించడానికి నామ్స్‌ మరియు ప్రభుత్వం వంటి వృత్తిపరమైన వైద్య సంస్థలు కలిసి రావచ్చని ఆయన అన్నారు.

"వాంఛనీయమైన పేషెంట్ కేర్‌ను అందించలేని చోట మనం కనీసం కొత్త టెక్నాలజీ మార్గాల ద్వారా వ్యాధుల నివారణపై దృష్టి పెట్టగలము మరియు నామ్స్‌ ఎంచుకోగల ఒక ప్రాంతం అని నేను భావిస్తున్నాను" అని చెప్పారు. ప్రివెంటివ్ హెల్త్‌కేర్ వైద్యులు, పూర్తిగా నివారణ ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. మనం అలా చేయగలిగితే  ఆరోగ్య సంరక్షణ లేదా వైద్య సంరక్షణ కోసం మాత్రమే కాకుండా భారత్‌@2047కు రూపశిల్పిగా మారబోతున్న ఆ భారీ యూత్ రిసోర్స్ పూల్ యొక్క శక్తిని కాపాడుకోవడం ద్వారా జాతీయ బాధ్యతను అందిస్తాము" అని తెలిపారు.

గత 9 సంవత్సరాలుగా భారతదేశాన్ని తక్కువ ఖర్చుతో కూడిన వైద్య గమ్యస్థానంగా మార్చామని 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అనేక మార్గనిర్దేశిత ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు మరియు నిబంధనలను ప్రారంభించడం వల్ల ఇది సాధ్యమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

"గతంలో భారతదేశం ఎటువంటి నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రసిద్ది చెందలేదు. కానీ నేడు భారతదేశం డిఎన్‌ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్, గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు అభివృద్ధి చేయబడిన "సెర్వావాక్‌", అలాగే ఇతర వ్యాధుల నివారణకు టీకాలను తయారు చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు.

 

image.png

 
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. “2014లో 145 మెడికల్ కాలేజీలు ఉండగా, వాటి సంఖ్య ఇప్పుడు 260కి పెరిగింది. అలాగే 19 ఎయిమ్స్‌లు అకడమిక్ సెషన్‌లను ప్రారంభించాయి.ఎంబీబీఎస్ యూజీ సీట్ల సంఖ్య 2014లో 51,348 ఉండగా అవి నేడు 91,927 సీట్లకు పెరిగిగాయి. అంటే ఇది 79% పెరుగుదల. ఇక పీజీ సీట్ల సంఖ్య కూడా 2014లో 31,185 సీట్ల నుంచి 93% పెరిగి 60,202 సీట్లకు చేరుకుందిని వివరించారు.

ఆయుష్మాన్ భారత్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకం అని, దానిని రూపొందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ఇప్పటికే ఉన్న వ్యాధికి కూడా బీమా కవరేజీని పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రపంచంలోనే  ఏకైక ఆరోగ్య బీమా పథకం ఇదే అని ఆయన చెప్పారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రజల జీవితకాలం పెరుగుదలతో అమృతకాల్ సమయంలో భారతదేశం బైపోలార్ సవాలును ఎదుర్కొంటుందన్నారు.

"ప్రస్తుతం మన జనాభాలో 70% కంటే ఎక్కువ మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఒకవైపు చిన్న వయస్సులో జనాభాలో ఎక్కువ శాతం ఉంది, మరోవైపు మనలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల, వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంతోపాటు అసమర్థతను నివారించడం మనకు జంట సవాలుగా ఉంది” అని ఆయన అన్నారు.

స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, స్పేస్ టెక్నాలజీ, ఇటీవల చంద్రయాన్-3, క్వాంటం టెక్నాలజీ మొదలైన వాటిలో భారతదేశం క్వాంటం లీప్ తీసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇటీవల అత్యంత విజయవంతమైన న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ సందర్భంగా అంతర్జాతీయ బయోఫ్యూయల్ అలయన్స్ ప్రకటించిందని వైద్య రంగంపై కూడా భారీ ప్రభావం చూపుతుందని తెలిపారు.

"ఇది ప్రధాని మోదీని ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన నాయకుడిగా నిలబెట్టింది" అని ఆయన అన్నారు.

 

image.png


గత నాలుగు-ఐదు సంవత్సరాలలో భారతదేశ క్వాంటం లీపులో చంద్రయాన్-3 మరియు భారతదేశ వ్యాక్సిన్ కథ అద్భుతమైన విజయగాథలను కలిగి ఉన్నాయని సైన్స్‌ అండ్ టెక్నాలజీ మంత్రి అన్నారు.

"మనకు ప్రతిదీ ఉంది. సరైన సందర్భం కోసం ఎదురు చూశాం. విధాన నిర్ణేతల స్థాయి నుండి, రాజకీయ నాయకత్వ స్థాయి నుండి ఆ ఎనేబుల్ పరిసరాలు రావాలి మరియు అది ప్రధాని మోదీ వచ్చిన తర్వాత జరిగింది” అని ఆయన అన్నారు.

“40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 70% జనాభా ఉన్న దేశంలో మరియు నేటి యువత భారతదేశ ప్రధాన పౌరులు@2047 నివారణ ఆరోగ్య సంరక్షణ మరియు విస్తృతమైన మాస్ స్క్రీనింగ్ మన ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి మోదీ నిర్దేశించిన వృద్ధి రేటును సాధించడంలో సహాయపడతాయని అన్నారాయన.

 

***



(Release ID: 1965828) Visitor Counter : 101