నీతి ఆయోగ్
మహిళల వ్యవస్థాపకత వేదిక - గోవాలో అద్భుత విజయాన్ని సాధించిన మహిళల నేతృత్వంలో అభివృద్ధిపై నీతి ఆయోగ్ రాష్ట్ర వర్క్‌షాప్!
Posted On:
07 OCT 2023 8:26AM by PIB Hyderabad
వ్యవస్థాపకత ద్వారా మహిళల నేతృత్వంలో అభివృద్ధికి తోడ్పడంపై మహిళా వ్యవస్థాపకత వేదిక (డబ్ల్యుఇపి)- నీతీ ఆయోగ్ రాష్ట్ర వర్క్‌షేప్ సిరీస్ ప్రారంంభ ఎడిషన్‌ను 3 అక్టోబర్ 2023న గోవాలోని సిఎస్ఐఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఒ)లో నిర్వహించారు. దేశంలో పశ్చిమ ప్రాంతంపై దృష్టితో గోవా ప్రభుత్వ సహకారంతో వర్క్‌షిప్ ను నిర్వహించారు.
మహిళా వ్యవస్థాపకులు, స్థానిక స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి), క్లస్టర్లు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, ఇన్‌క్యూబేటర్లు/ ఆక్సిలరేటర్లు, ఆర్ధిక సంస్థలు, దాతృత్వ సంస్థలు సహా 500మందికి పైగా వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని అట్టడుగు స్థాయిలకు, చివరి మైలు వరకు విస్తరించడమే లక్ష్యంగా హబ్ అండ్ స్పోక్ నమూనాపై ప్రాథమికంగా దృష్టిని కేంద్రీకరించారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె సారస్వత్, నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం సహా పలు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.
నీతీ ఆయోగ్ సహాయంతో గోవా స్టేట్ విజన్ 2047ను తయారు చేస్తామని గోవా గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
స్వయంపూర్ణ గోవా చొరవ మూడు సంవత్సరాల మైలురాయిని పురస్కరించుకుని డాక్టర్ సావంత్ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, ప్రతి బ్లాక్, పంచాయతీలో ప్రభుత్వ సేవలను ఇంటింటికీ బట్వాడా చేయడానికి స్వయంపూర్ణ గ్రామీణ మిత్రల విస్తరణ పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా, సామాజిక - ఆర్థిక పురోగతిలో మహిళల పాత్రను పునరుద్ఘాటిస్తూ, సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మార్కెట్ అందుబాటును విస్తరించే లక్ష్యంతో స్వయం పూర్ణ ఇ- బజార్‌ను దసరా సందర్భంగా ప్రకటించారు.
దేశ వృద్ధి చోదకులుగా రాష్ట్రాల కీలక పాత్రను నొక్కి చెబుతూ, సహకార సమాఖ్యవాదమనే నీతీ ఆయోగ్ సూత్రాన్ని నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ పట్టి చూపారు. ఆయన ఉపాధి నుంచి విద్య నిష్పత్తిని కొనసాగించడం, మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, శ్రామిక శక్తిని పునర్నర్మించడం అన్న మూడు కీలక ప్రాధాన్యతలను ఉద్ఘాటించారు.
మహిళల నేతృత్వంలో అభివృద్ధి అన్నదానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంపై కేంద్ర ప్రభుత్వ తిరుగులేని నిబద్ధతను నీతీ ఆయోగ్ సిఇఒ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యం పునరుద్ఘాటించారు. ప్రతిరాష్ట్రంలో తమ సంస్థ వంటి సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడంలో నీతీ ఆయోగ్ తోడ్పాటును నొక్కి చెప్తూ, ఇది తప్పనిసరిగా ప్రత్యేక సంస్థ కానవసరం లేదని, ఇది ఒక విభాగం లేక ఇప్పటికే ఉనికిలో ఉన్న సంస్థ కావచ్చని ఆయన అన్నారు. అయితే, ఆలోచించి, భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం అన్నది కేంద్ర అంశంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నీతీ ఆయోగ్ నైపుణ్యాన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇలా సృష్టించిన సంస్థలలోని సిబ్బంది మరే ఇతర పనులలోనూ నిమగ్నం కాకుండా చూసుకోవాలన్నారు.
మహిళా వ్యవస్థాపకులకు తోడ్పడేందుకు నూతన సహకారాల శ్రేణిని ప్రకటించారు. ఇందులోని కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయి - ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ)- నీతీ ఆయోగ్ మధ్య భాగస్వామ్యం; ఉద్యమ్ అప్‌లిఫ్ట్ ప్రారంభం - మహిళల నేతృత్వంలోని వ్యాపారాల మధ్య సమ్మతిని బలోపేతం చేసేందుకు సిఎఎక్స్‌పర్ట్ (CAxpert) చొరవ, డబ్ల్యుఇపి అవార్డ్ టు రివార్డ్ (ఎటిఆర్) చొరవ కింద తొలి రెండు బృందాలను ప్రారంభించడం.
డబ్ల్యుఇపి భాగస్వాములు మైక్రోసేవ్ కన్సల్టింగ్, ఎస్ఐడిబిఐ నేతృత్వంలోని తొలి ఎటిఆర్ బృందం డబ్ల్యుఇపి- ఉన్నతి పేరిట భారతదేశానికి చెందిన పర్యావరణ అనుకూల వ్యవస్థాపకుల నుంచి దరఖాస్తులను సేకరిస్తుంది. వియ్ నర్చర్ పేరు కలిగిన రెండవ బృందానికి అటల్ ఇన్‌క్యుబేషన్ సెంటర్ - గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నేతృత్వం వహిస్తాయి.
****
(Release ID: 1965397)
Visitor Counter : 190