ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల కుస్తీ పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్ షెరావత్కు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2023 10:04PM by PIB Hyderabad
ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన అమన్ షెరావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. షెరావత్ చక్కని నైపుణ్యం ప్రదర్శించి, అద్భుత విజయం సాధించాడంటూ ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్ షెరావత్‌కు అనేకానేక అభినందనలు. అతని తిరుగులేని నైపుణ్యం, పట్టుదల, కఠోర పరిశ్రమ బరిలో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 1965273)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam