విద్యుత్తు మంత్రిత్వ శాఖ

54 ఈసి బాండ్ల ఇన్వెస్టర్ల కోసం 'సుగమ్ ఆర్ఈసి' మొబైల్ యాప్ ని ప్రారంభించిన ఆర్ఈసి

Posted On: 06 OCT 2023 11:17AM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్ఈసి లిమిటెడ్, 54ఈసి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపు బాండ్‌లలో ప్రస్తుత, భవిష్యత్తు పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ‘సుగమ్ ఆర్ఈసి’ పేరుతో, మొబైల్ యాప్ పెట్టుబడిదారులకు ఆర్ఈసి 54ఈసి  బాండ్లలో వారి పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

.

పెట్టుబడిదారులు తమ ఇ-బాండ్ సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తాజా పెట్టుబడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, కేవైసి అప్‌డేట్ చేయడానికి సంబంధించిన ముఖ్యమైన ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,  కాల్ / ఇమెయిల్ / వాట్సాప్ ద్వారా ఆర్ఈసి ఇన్వెస్టర్ సెల్‌తో కనెక్ట్ అవ్వగలరు.
మొబైల్ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అప్లికేషన్ సులభంగా డౌన్‌లోడ్ కోసం లింక్‌లు క్రింద ఇవ్వబడ్డాయి:

On Android: https://play.google.com/store/apps/details?id=com.rec.org

On iOS: https://apps.apple.com/in/app/sugam-rec/id6468639853

54ఈసి బాండ్లు ఏమిటి?

సెక్షన్ 54ఈసి బాండ్‌లు అనేవి  ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసి  ప్రకారం పెట్టుబడిదారులకు మూలధన లాభాల కింద పన్ను మినహాయింపును అందించే స్థిర ఆదాయ ఆర్థిక సాధనాల రకం.

 

***



(Release ID: 1965257) Visitor Counter : 125