వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
యుఎఇ- భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్
పెరుగుతున్న ఆర్ధిక వృద్ధి, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వల్ల రెండు వైపులా వ్యాపారాలు వేగవంతమైన వృద్ధిని పొందేందుకు అవకాశాలను కల్పిస్తాయి - శ్రీ గోయెల్
భారత్- యుఎఇల మధ్య సహకారానికి సంబంధించిన కీలకమైన ఆహార భద్రత, విద్య, ఇంధన భద్రత, వాతావరణ మార్పులను తగ్గించడం నుంచి అంతరిక్ష సాంకేతిక రంగాల వరకు ఉన్నాయిః శ్రీ గోయెల్
భారతదేశం తన 1.4 బిలియన్ల మంది ఆకాంక్షాత్మక పౌరులతో యుఎఇ వ్యాపారాలకు ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది - శ్రీ గోయెల్
భారతదేశ ప్రజలు, యుఎఇ ప్రజలు పరస్పరం కలిగి ఉన్న అపురూపమైన ప్రేమ, అప్యాయతలను నిర్వచించే భాగస్వామ్యంగా,21వ శతాబ్దపు సోదరభావంగా మార్చడానికి సిద్ధం - శ్రీ గోయెల్
Posted On:
06 OCT 2023 12:00PM by PIB Hyderabad
యుఎఇ- భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై కేంద్ర వాణిజ్య & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, జౌళిశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత దేశం & యుఎఇకి చెందిన అగ్రవాణిజ్యవేత్తలతో అబుదాబి ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ, రెండు దేశాల ఆర్ధిక వృద్ధి పెరగడం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం అన్నది రెండు దేశాలలో వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలను కల్పిస్తాయని మంత్రి అన్నారు.
భారతదేశపు రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా, మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా అతిపెద్ద పెట్టుబడిదారుగా పేర్కొంటూ, ఈ భాగస్వామ్యంలో యుఎఇ కీలక పాత్రను శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం సహకారానికి ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. రెండు దేశాలూ గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాన్ని పంచుకోవడమే కాక ప్రస్తుత సామర్ధ్యాలు, భవిష్యత్తు అవకాశాలతో కలిపి ఈ భాగస్వామ్యం అభివృద్ధి చెందడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. భారతదేశం, యుఎఇ మధ్య సహకారం కీలకమైన ఆహార భద్రత, విద్య, ఇంధన భద్రత, వాతావరణ మార్పులను తగ్గించడం నుంచి అంతరిక్ష సాంకేతిక రంగాల వంటి కీలకమైన వరకు ఉన్నాయన్నారు. స్టార్టప్ 20, బి20, యుఎఇ - ఇండియా బిజినెస్ కౌన్సిల్, భారత్ బజార్ వంటి ఒకరి సంస్కృతుల ప్రచారం, కార్యక్రమాలను కూడా మంత్రి పట్టి చూపారు. దాదాపు 1.4 బిలియన్ల ఆకాంక్షాపూరితమైన పౌరులతో అతిపెద్ద మార్కెట్‌గా, యుఎఇలో వ్యాపారాలకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించడంలో భారతదేశం పాత్రను గురించి మంత్రి పేర్కొన్నారు. ఆయన "30 బై 30 బై 30 అవకాశాన్ని విరిస్తూ, రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ సగటు వయస్సు 30 ఏళ్ళ లోపు ఉంటుందని, 2047 నాటికి జిడిపికి 30 ట్రిలియన్ల డాలర్లను జోడించాలనే లక్ష్యంతో ఉన్న విషయాన్ని వివరించారు. సహకారం, పోటీ స్ఫూర్తితో ఈ అవకాశాలను అందిపుచ్చుకుని సహకరించవలసిందిగా ఆయన వ్యాపారస్తులను ప్రోత్సహించారు.
తనకు లభించిన సౌహార్ద్రపూర్వక స్వాగతం, యుఎఇ- భారత్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి పొరలుతున్న ఉత్సాహాన్ని గురించి శ్రీ గోయెల్ నొక్కిచెప్పారు.
ఈ భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వ్యాపారాలు చేస్తున్న వారి అపారమైన సహకారంతో పాటు భారతదేశ ప్రజలు, యుఎఇ ప్రజలు పరస్పరం కలిగి ఉన్న అపురూపమైన ప్రేమ, అప్యాయతలను నిర్వచించే భాగస్వామ్యంగా,21వ శతాబ్దపు సోదరభావంగా మార్చడానికి సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్ళుగా భారతదేశం చెప్పుకోదగ్గ ఆర్ధిక వృద్ధిని సాధించిందని, బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ నుంచి ప్రపంచవ్యాప్తంగా బలోపేతమైన ఐదవ ఆర్ధిక వ్యవస్థగా పరివర్తన చేశారని ఆయన అన్నారు. రానున్న నాలుగేళ్ళలో ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా మారాలన్న ప్రతిష్ఠాత్మక లక్ష్యం దిశగా ఆకట్టుకునే ప్రయాణాన్ని శ్రీ గోయెల్ పట్టి చూపారు. భారత అభివృద్ధికి రానున్న 25 ఏళ్ళు స్వర్ణయుగమని ఆయన పేర్కొన్నారు.
యుఎఇ- భారత్ భాగస్వామ్యాన్ని అన్ని పడవలను ఎగిసిపట్టే అలలతో పోలుస్తూ, రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం, సహకారం ఇరు వైపులా వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుందనే విశ్వాసాన్ని తన ముగింపు వ్యాఖ్యలలో శ్రీ పీయూష్ గోయెల్ వ్యక్తం చేశారు.
****
(Release ID: 1965217)
Visitor Counter : 138