సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖలో ముమ్మరంగా ‘ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం 3.0’
దేశవ్యాప్తంగా 900కుపైగా ప్రక్షాళన ప్రదేశాల ఎంపిక;
తుక్కు నిర్మూలనసహా పరిశుభ్రతపై 644 అవగాహన కల్పన కార్యక్రమాలు
Posted On:
05 OCT 2023 5:50PM by PIB Hyderabad
దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ప్రధాన సచివాలయాలు, వాటి అనుబంధన-ఉప కార్యాలయాల్లో ‘ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం 3.0’ను కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 2023 సెప్టెంబరు 15 నుంచి శ్రీకారం చుట్టిన సన్నాహక దశలో వివిధ పారామితులపై ‘డిఎఆర్‌పిజి’ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం కింద సాధించాల్సిన లక్ష్యాలు ఖరారు చేయబడ్డాయి. అటుపైన 2023 అక్టోబరు 2నుంచి ప్రారంభమైన కార్యక్రమం తొలిదశ 2023 అక్టోబర్ 31వరకు కొనసాగుతుంది. ఈ కాలవ్యవధిలో నిర్దేశిత ప్రదేశాల ప్రక్షాళన, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంసహా తమ కార్యాలయాల్లో ఉత్తమ పద్ధతుల అనుసరణపై దృష్టి సారిస్తారు.
ఈ కార్యక్రమం అమలు-పర్యవేక్షణ సంబంధిత యంత్రాంగంతోపాటు ఇప్పటిదాకా పురోగతిని మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర సమీక్షించారు. ప్రత్యేక పరిశుభ్రత 2.0 సందర్భంగా అందుబాటులోకి వచ్చిన ఖాళీ స్థల వినియోగంతోపాటు ప్రస్తుత కార్యక్రమం అమలుకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా పర్యవేక్షించడం కోసం అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
3. వివిధ పారామితుల కింద నిర్దేశిత లక్ష్యాలు.. కార్యాచరణ పురోగమనం ఇలా ఉంది:
వ.సం.
|
పారామితులు
|
లక్ష్యాలు
|
1
|
దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బహిరంగ కార్యక్రమాలు
|
644
|
2
|
నిర్మూలనకు నిర్దేశించిన తుక్కు వస్తువులు( కిలోల్లో)
|
89,926
|
3
|
ఎంపీల నుంచి వచ్చిన అపరిష్కృత ప్రస్తావనలు
|
92
|
4
|
పార్లమెంటుపరంగా అపరిష్కృత హామీలు
|
15
|
5
|
అపరిష్కృత ప్రధాని కార్యాలయ ప్రస్తావనలు
|
04
|
6
|
అపరిష్కృత ప్రజా ఫిర్యాదులు
|
296
|
7
|
అపరిష్కృత ప్రజా ఫిర్యాదుల పునరభ్యర్థనలు 26ర3
|
61
|
8
|
సమీక్షించాల్సిన ఫైళ్ల సంఖ్య
|
49,984
|
9
|
పరిష్కారం/మూసివేతకు ఎంపిక చేసిన ఫైళ్ల సంఖ్య
|
1.640
|
***
(Release ID: 1964890)
Visitor Counter : 96