సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపుమేరకు, చరిత్ర సృష్టించిన ఖాదీ , గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు.


తొలిసారిగా, గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని కన్నాట్ప్లేస్ లోగల ఖాదీ భవన్ లో 1.5 కోట్ల రూపాయలకు చేరిన అమ్మకాలు .

Posted On: 04 OCT 2023 7:17PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుమేరకు, ఢిల్లీ ప్రజలు  ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల కొనుగోళ్లలో కొత్త రికార్డును సృష్టించారు. గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని ఖాదీభవన్లో రికార్డు
స్థాయిలో రూ 1,52,45,000 ల విలువగల ఖాదీ , గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన, ఖాదీ , గ్రామీణ పరిశ్రమల
 కమిషన్ (కెవిఐసి) ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్, మాట్లాడుతూ, గాంధీ జయంతి సందర్బంగా  , గాంధీజీ శకానికి గుర్తు అయిన ఖాదీ అమ్మకాలు మున్నెన్నడూ లేని స్థాయిలో పెరగడానికి కారణం,
 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రాండ్ పవర్, ఆయనకు గల విశేష జనాదరణే  కారణమని ఆయన అన్నారు.
 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023, సెప్టెంబర్ 24న తన మన్ కీ బాత్ ప్రసంగంలో , దేశ ప్రజలకు పిలుపునిస్తూ, గాంధీ జయంతి రోజున ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిందిగా సూచించిన విషయాన్ని మనోజ్ కుమార్ ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ఇచ్చని ఈ  పిలుపు మంచి ప్రభావం చూపిందని ఆయన తెలిపారు.  ప్రధానమంత్రి పిలుపు మేరకు , గతంలో కూడా ప్రజలు ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో గాంధీ జయంతి రోజున రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తూ వచ్చారని మనోజ్ కుమార్ తెలిపారు.
ఇది భారతదేశ వారసత్వంగా నిలిచిన ఖాదీ పట్ల ప్రజలకు గల ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తున్నదని చెప్పారు.
అమ్మకాల గణాంకాలను పరిశీలించినట్టయితే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో గాంధీ జయంతి రోజున , న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని ఖాదీ భవన్ అమ్మకాలు రూ 1,33,95,000లు కాగా,
 ఈ సారి అమ్మకాలు, రూ 1,52,45,000 లకు చేరాయని ఆయన తెలిపారు.2023 అక్టోబర్ 2 , గాంధీ జయంతి రోజు ఉదయం,  తొలి కస్టమర్ గా, కె.వి.ఐ.సి ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్, న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్,ఖాదీభవన్ నుంచి ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి , యుపిఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్నో సందర్భాలలో దేశ , విదేశాలలో పలు వేదికల మీద నుంచి ఖాదీ ఉత్పత్తులు కొనగోలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారని శ్రీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపం లో జరిగిన జి 20, చేనేత వస్త్ర దినోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
గడచిన 9  సంవత్సరాలలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, ఓకల్ ఫర్ లోకల్ నినాదాల కారణంగా ఖాదీ , గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలు 1.34 లక్షల కోట్ల రూపాయలు దాటినట్టు తెలిపారు.
 జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా రాజ్ ఘాట్ లో , జాతిపిత మహాత్మాగాంధీజీ  కి  నివాళులర్పించే కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఖాదీ దుస్తులలో ప్రపంచ నాయకులకు స్వాగతం చెప్పడం
ద్వారా , ఖాదీ కి ప్రపంచ గుర్తింపును తీసుకువచ్చారని, ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు దేశ ప్రజలకు గొప్ప ప్రేరణ నిచ్చారని ఆయన అన్నారు.  ఫలితంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున, న్యూఢిల్లీలోని కన్నాట్ప్లేస్ ఖాదీ భవన్ నుంచి ఖాదీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని తెలిపారు.
గాంధీ జయంతి రోజున గత మూడు సంవత్సరాల అమ్మకాలను పరిశీలించినపుడు, ప్రతి సంవత్సరం అమ్మకాలు కోటి రూపాయలను దాటుతూ వస్తున్నాయన్నారు. అయితే ఈ సారి తొలిసారిగా, అమ్మకాలు 1.5 కోట్ల రూపాయలు దాటాయని చెప్పారు. ఖాదీ , గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలు,
2021–22 సంవత్సరంలో 1.01 కోట్ల రూపాయలు ఉండగా, ఇవి 2022–23 సంవత్సరానికి 1.34 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 1.52 కోట్ల రూపాయలు దాటాయని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విజయాలు సాధించినట్టు ఆయన తెలిపారు.
దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భారతీయ ఖాదీ అగ్రభాగాన ఉన్నదని శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు.

 

***



(Release ID: 1964882) Visitor Counter : 76