వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పెట్టుబడులపై భారతదేశం-యుఏఈ ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ 11వ సమావేశానికి కో-ఛైర్‌గా శ్రీ పీయూష్ గోయల్


అబుదాబి ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు హిస్ హైనెస్ షేక్ హమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి కో-ఛైర్‌గా కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి

Posted On: 04 OCT 2023 5:06PM by PIB Hyderabad

భారత ప్రభుత్వంలోని కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు టెక్స్‌టైల్స్ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం 2023 అక్టోబరు 5, 6వ తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించనుంది. పెట్టుబడులపై భారతదేశం-యుఏఈ ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ 11 సమావేశానికి శ్రీ పీయూష్ గోయల్ కో-ఛైర్గా వ్యవహరించనున్నారు. యుఏఈ హై లెవల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ (హెచ్.ఎల్.టి.ఎఫ్.ఐ) మరియు పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం కావడానికి మరియు అబుదాబి ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు హిస్ హైనెస్ షేక్ హమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని యుఏఈ ప్రతినిధి బృందంతో మంత్రి సంభాషించనున్నారు.  ప్రస్తుతం ఉన్న పెట్టుబడులకు సంబంధించిన సమస్యలు/సవాళ్లను రెండు ప్రతినిధి బృందాలు చర్చిస్తాయి. భారతదేశంలో యుఏఈ కంపెనీలు మరియు యుఏఈలో భారతీయ కంపెనీలు చేసిన పెట్టుబడులను గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశం ఇప్పటి వరకు జాయింట్ టాస్క్ ఫోర్స్ యొక్క పని ద్వారా సాధించిన ఫలితాలను సమీక్షిస్తుంది. ఆర్థిక వృద్ధికి సంభావ్యతతో పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో పెట్టుబడులను సులభతరం చేయడానికి రెండు వైపులా మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తుంది. రెండు రోజుల పర్యటనలో మంత్రి గోయల్ సాధారణ వాణిజ్యం, పెట్టుబడి విషయాలు మరియు భారతదేశం-యుఏఈ సంబంధాలను బలోపేతం చేయడానికి సహకార రంగాలను మెరుగుపరచడానికి ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.

యుఏఈ మరియు భారతదేశం మధ్య వాణిజ్యం, పెట్టుబడి మరియు ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించడానికి ఒక కీలక వేదికగా 2013లో జాయింట్ టాస్క్ ఫోర్స్ స్థాపించబడింది. సంవత్సరాలుగా హెచ్.ఎల్.టి.ఎఫ్.ఐ  ఇరు దేశాల వైపులా కంపెనీలు ఎదుర్కొనే కీలక పరిమితులను పరిష్కరించడానికి సమర్థవంతమైన వేదికగా ఉద్భవించింది. భారతదేశం-యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై (సీఈపీఏ) సంతకం చేసిన ఒక సంవత్సర వేడుకల తర్వాత ఇది మొదటి సమావేశం.

 

***



(Release ID: 1964502) Visitor Counter : 74