మంత్రిమండలి

తెలంగాణ రాష్ట్రం లో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్నిఏర్పాటు చేయడం కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009 లో సవరణ కు ఆమోదంతెలిపిన మంత్రిమండలి

Posted On: 04 OCT 2023 4:04PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని పదమూడో షెడ్యూలు (2014 వ సంవత్సరపు సంఖ్య 6) లో తెలిపిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం లోని ములుగు జిల్లా లో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009 లో సవరణ నిమిత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, 2023 పేరిట పార్లమెంటు లో ఒక బిల్లు ను ప్రవేశపెట్టడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.

 

దీని కోసం 889.07 కోట్ల రూపాయల నిధుల ను సర్దుబాటు చేయడం జరుగుతుంది. క్రొత్త విశ్వవిద్యాలయం రాష్ట్రం లో ఉన్నత విద్య అవకాశాల ను పెంపు చేయడం తో పాటు ఉన్నత విద్య సంబంధి నాణ్యత ను మెరుగు పరచడం మాత్రమే కాకుండా ఉన్నత విద్య ను అందుకొనే దారుల ను విస్తరించడం, అలాగే రాష్ట్రం లో గిరిజనుల జనాభా కు మేలు చేయడానికి గాను గిరిజన కళ లు, గిరిజన సంస్కృతి, ఇంకా గిరిజన సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థల లో బోధన పరమైన, ఇంకా పరిశోధన సంబంధమైన సదుపాయాల ను కూడా అందిస్తూ పురోగామి జ్ఞానానికి బాట ను పరచనుంది. ఈ క్రొత్త విశ్వవిద్యాలయం అదనపు సామర్థ్యాన్ని కల్పిస్తుంది; దీంతో పాటు ప్రాంతీయ అసమానతల ను తొలగించడానికి కూడాను పాటుపడుతుంది.

 

 

***



(Release ID: 1964155) Visitor Counter : 288