ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం,జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) ప్రధాన పెట్టుబడిదారులుగా 600 మిలియన్ డాలర్ల ఇండియా-జపాన్ ఫండ్ (ఐజేఎఫ్)ను ప్రారంభించిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)
పర్యావరణ సుస్థిరత, కర్బన ఉద్గారాలను తగ్గించడం భారతదేశంలో జపాన్ పెట్టుబడులు ఎక్కువ చేయడానికి ప్రణాళిక అమలు చేయనున్న ఇండియా-జపాన్ ఫండ్
Posted On:
04 OCT 2023 10:15AM by PIB Hyderabad
భారత ప్రభుత్వం,జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) ప్రధాన పెట్టుబడిదారులుగా 600 మిలియన్ డాలర్ల ఇండియా-జపాన్ ఫండ్ (ఐజేఎఫ్)ను ప్రారంభించడానికి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. వాతావరణం, పర్యావరణ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెంపొందించడానికి ఒప్పందం సహకరిస్తుంది.
ఎన్ఐఐఎఫ్ మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ద్వైపాక్షిక ఫండ్ లో 49% పెట్టుబడులను భారత ప్రభుత్వం, మిగిలిన 51% నిధులను జేబీఐసీ సమకూరుతాయి. నిధులను ఎన్ఐఐఎఫ్ లిమిటెడ్ ( ఎన్ఐఐఎఫ్ఎల్), జేబీఐసీ ఐజీ (జేబీఐసీ అనుబంధ సంస్థ) నిర్వహిస్తాయి. భారతదేశంలో జపాన్ పెట్టుబడులు పెరిగేలా చూసేందుకు ఎన్ఐఐఎఫ్ఎల్ కు జేబీఐసీ ఐజీ సహకారం అందిస్తుంది.
పర్యావరణ సుస్థిరత, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అమలు చేసే కార్యక్రమాలకు ఇండియా-జపాన్ ఫండ్ నిధులు సమకూరుస్తుంది. భారతదేశంలో జపాన్ పెట్టుబడులు మరింత ఎక్కువగా వచ్చేలా చూసేందుకు కూడా ఇండియా-జపాన్ ఫండ్ కృషి చేస్తుంది.
భారతదేశం,జపాన్ దేశాల మధ్య అమలు జరుగుతున్న వ్యూహాత్మక,ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇండియా-జపాన్ ఫండ్ ఏర్పాటు సహకరిస్తుంది.
***
(Release ID: 1964061)
Visitor Counter : 210