కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ప్రసారం & కేబుల్ సేవల కోసం నియంత్రణ విధివిధానాల సమీక్ష”పై ట్రాయ్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీ పొడిగింపు

Posted On: 03 OCT 2023 6:02PM by PIB Hyderabad

 

'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్‌) 08 ఆగస్టు 2023న “ప్రసారం & కేబుల్ సేవల కోసం నియంత్రణ విధివిధానాల సమీక్ష”పై ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. సంప్రదింపు పత్రంలో ప్రస్తావించిన అంశాలపై వాటాదార్ల నుంచి వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలు స్వీకరించే తేదీలను, తొలుత, వరుసగా 05 సెప్టెంబర్ 2023 & 19 సెప్టెంబర్ 2023గా నిర్ణయించింది.

సమయం పొడిగింపు కోసం వాటాదార్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని, రాతపూర్వక వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను స్వీకరించే గడువులను వరుసగా 19 సెప్టెంబర్ 2023 & 3 అక్టోబర్ 2023 వరకు ట్రాయ్‌ పొడిగించింది.

తర్వాత, సమయం పొడిగింపు కోసం మరికొన్ని అభ్యర్థనలు రావడంతో చివరి తేదీలను వరుసగా 3 అక్టోబర్ 2023 & 17 అక్టోబర్ 2023 వరకు మరోమారు పొడిగించింది.

మరింత సమయం కోసం అభ్యర్థనలు రావడంతో, ఆయా తేదీలను 10 అక్టోబర్ 2023 & 25 అక్టోబర్ 2023 వరకు ట్రాయ్‌ పొడిగించింది. వ్యాఖ్యలు/ప్రతివ్యాఖ్యల సమర్పణ కోసం మరింత సమయం పొడిగింపు కోసం వచ్చే అభ్యర్థనలను ఇకపై స్వీకరించదు.

వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ రూపంలో advbcs-2@trai.gov.in లేదా jtadvbcs-1@trai.gov.in ఈ-మెయిల్ ఐడీకి పంపవచ్చు. మరింత స్పష్టత/సమాచారం కోసం డైరెక్టర్ జనరల్ ట్రాయ్‌ సీఎస్‌ఆర్‌ &సలహాదారు (బీ&సీఎస్‌)  శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్‌ను ఫోన్‌లో సంప్రదించవచ్చు. నంబరు +91-11-23237922.

 

***


(Release ID: 1963930) Visitor Counter : 107