బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

16% వృద్ధి సాధించి 2023 సెప్టెంబర్ లో 67.21 మిలియన్ టన్నులకు చేరిన మొత్తం బొగ్గు ఉత్పత్తి


51.44 మిలియన్ టన్నులకు చేరిన కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి

11% పెరుగుదలతో సెప్టెంబర్ వరకు 462.32 మిలియన్ టన్నుల వరకు బొగ్గు పంపిణీ

Posted On: 03 OCT 2023 12:55PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ 2023 సెప్టెంబర్ నెలలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల

నమోదు చేసింది.దేశంలో  సెప్టెంబర్ నెలలో  67.21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది.  అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 58.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. బొగ్గు ఉత్పత్తి  15.81% మేరకు పెరిగింది.  బొగ్గు ఉత్పత్తిలో  కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)  12.63% వృద్ధి నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ లో 45.67  మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కోల్ ఇండియా   2023 సెప్టెంబర్ నెలలో 51.44 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  చేసింది.2023-24 ఆర్థిక సంవత్సరం (సెప్టెంబర్ 2023 వరకు)లో 428.25  మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది 2022-23 లో ఇదే  కాలంలో 382.16   మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది బొగ్గు ఉత్పత్తి  12.06 % పెరిగింది. 

 

 

బొగ్గు పంపిణీ సెప్టెంబర్ 2023లో గణనీయమైన వృద్ధి సాధించింది,సెప్టెంబర్ నెలలో 70.33 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరిగింది.  2022 సెప్టెంబర్ నెలలో  61.10 మిలియన్ టన్నుల బొగ్గురవాణా జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన పంపిణీతో పోల్చి చూస్తే ఈ ఏడాది బొగ్గు పంపిణీ  15.12% మేరకు పెరిగింది. బొగ్గు పంపిణీలో  కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)  అత్యుత్తమ పనితీరు కనబరిచింది.2023 సెప్టెంబర్ నెలలో కోల్ ఇండియా లిమిటెడ్ 55.06మిలియన్ టన్నుల బొగ్గు పంపిణీ చేసింది. 2022  సెప్టెంబర్ నెలలో జరిగిన  48.91మిలియన్ టన్నుల బొగ్గు రవాణాతో పోల్చి చూస్తే  12.57% వృద్ధిని సూచిస్తుంది. సంచిత బొగ్గు పంపిణీ (సెప్టెంబర్ 2023 వరకు) 10.96% వృద్ధి నమోదు చేసింది.20'22-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు 416.64మిలియన్ టన్నుల బొగ్గురవాణా జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు  462.32మిలియన్ టన్నుల బొగ్గు రవాణా అయ్యింది. 

 

 ఉత్పత్తి, పంపిణీ, నిల్వ స్థాయి గణనీయంగా పెరగడంతో బొగ్గు రంగం  అభివృద్ధి పధంలో పయనిస్తోంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు చిత్తశుద్ధితో పనిచేసి ఉత్పత్తి ఎక్కువ చేసి బొగ్గు రంగం అభివృద్ధిలో  కీలక పాత్ర పోషించాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా అవసరాల మేరకు బొగ్గు రవాణా చేయడానికి దేశంలో పటిష్ట  సరఫరా వ్యవస్థ అమలులో ఉంది. 

స్థిరమైన బొగ్గు ఉత్పత్తి , పంపిణీ చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తోంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఇంధన రంగానికి అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి మంత్రిత్వ శాఖ పటిష్ట చర్యలు అమలు చేస్తోంది.  

***


(Release ID: 1963604) Visitor Counter : 135