మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఒడిషాలోని సంభల్‌పూర్‌లో ప్రారంభమైన పాఠశాలల కోసం ఫుట్‌బాల్ (ఎఫ్4ఎస్) మాస్టర్ శిక్షణ
బాల,బాలికలకు ఫుట్‌బాల్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడం ఎంఒఇ, ఫీఫా, ఎఐఎఫ్ఎఫ్ లక్ష్యం
ఫుట్ కార్యకలాపాలను విద్యా వ్యవస్థలో చేర్పు
Posted On:
02 OCT 2023 8:10PM by PIB Hyderabad
పాఠశాలలకు ఫుట్‌బాల్ (ఫుట్‌బాల్ ఫర్ స్కూల్స్ - ఎఫ్4ఎస్) అన్నది ఫెడరేషన్ ఇంటర్నేషనేల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఫ్ఐఎఫ్ఎ- ఫీఫా) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం. దేశంలో ఈ కార్యక్రమాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ) మద్దతుతో విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పాఠశాల విద్య& అక్షరాస్యత విభాగం అమలు చేస్తోంది. ఎఫ్4ఎస్‌లో భాగంగా 2 అక్టోబర్ 2023న ఒడిషాలోని సంభల్‌పూర్‌లో రెండు రోజుల సామర్ధ్య నిర్మాణ మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఫీఫా నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, కెవిఎస్, ఎన్‌విఎస్, ఎఐఎఫ్ఎఫ్‌లకు చెందిన 95మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు/ ట్రైనీలు పాలుపంచుకున్నారు. ఇటువంటి రెండు కార్యక్రమాలను పూణెలోనూ, బెంగళూరులోనూ 5-6 అక్టోబర్ 2023న నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 200 మంది ( వీటిలో 100 మంది చొప్పున) భాగస్వాములు పాలుపంచుకోనున్నారు. ఈ శిక్షణానంతరం ఈ టీచర్లు/ ట్రైనీలు తదుపరి స్థాయిలో సామర్ధ్య నిర్మాణాన్ని మరింతగా పెంచుకోవడానికి రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్‌లుగా పరిగణిస్తారు.
రెండు రోజుల మాస్టర్ శిక్షణ కార్యక్రమం ఒడిషాలోని సంభల్‌పూర్‌లో సోమవారం ప్రారంభం అయింది. ఫీఫా నుంచి 3 మాస్టర్ ట్రైనర్లు, ఎఐఎఫ్ఎఫ్ నుంచి ఒక ప్రతినిధి, పాఠశాల విద్య& అక్షరాస్యత విభాగం. కెవిఎస్, ఎన్‌విఎస్ నుంచి ఇద్దరు చొప్పున పాలుపంచుకున్నారు. పాలుపంచుకున్నవారిలో 95 మంది (67 పురుషులు, 28మంది మహిళలు) 13 రాష్ట్రాలు, కెవిఎస్, ఎన్‌విఎస్, ఎఐఎఫ్ఎఫ్ నుంచి శిక్షణకు హాజరవుతున్నారు.
విద్యా మంత్రిత్వ శాఖ, ఎఐఎఫ్ఎఫ్, ఫీఫా మధ్య 30 అక్టోబర్ 2022న అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇందుకోసం మంత్రిత్వ శాఖ జవహర్ నవోదయ విద్యాలయను నోడల్ సంస్థ బాధ్యతలను అప్పగించింది. ఈ కార్యక్రమం 11.15 లక్షల ఫుట్‌బాల్‌లు, వాటి సామర్ధ్యాన్ని పెంపొందించడం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, కోచ్‌లతో ప్రభుత్వ పాఠశాలలకు సాధికారతను కల్పిస్తుంది. ఈ బంతులను దేశవ్యాప్తంగా పాఠశాల మధ్య పంపిణీ చేస్తారు.
ఎఫ్4ఎస్ సుమారు 700 మిలియన్ల పిల్లల విద్య, అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంబంధిత అధికారులు, వాటాదారుల భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థలో ఫుట్‌బాల్ కార్యకలాపాలను చేర్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల,బాలికలకు ఫుట్‌బాల్ ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఎఫ్4ఎస్ భారతదేశంలో ఫీఫా ద్వారా ప్రారంభమైంది.
***
(Release ID: 1963542)
Visitor Counter : 112