ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో పారుల్ చౌదరి రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2023 9:29PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ పోటీలో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో పారుల్ చౌదరి అద్భుత ప్రతిభ దేశానికి రజత పతకం సాధించిపెట్టింది 000 ! ఈ మేరకు ఆమె అంకిత భావం, కృషి సత్ఫలితం ఇచ్చాయి. మాతృభూమి సంతోషంతో ఉప్పొంగేలా చేసిన ఆమెకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(రిలీజ్ ఐడి: 1963469)
సందర్శకుల సూచీ సంఖ్య : : 155
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam