గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణాభివృద్ధి పథకాల్లో వివక్ష చూపుతున్నారన్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం
యు పి ఎ ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పశ్చిమబెంగాల్ కు గ్రామీణాభివృద్ధి పథకాల నిధులు ఎక్కువగా కేటాయించింది - గిరిరాజ్ సింగ్
పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ప్రధాని కట్టుబడి ఉన్నారు: గత తొమ్మిదేళ్లలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ కు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది: యు పి ఎ ప్రభుత్వ హయాంలో ఈ మొత్తం రూ.58 వేల కోట్లు మాత్రమే
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 25 లక్షల నకిలీ ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డులను జారీ చేసింది: దీని వల్ల కోట్లాది ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయింది: దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
మోదీ ప్రభుత్వం మొదటి నుంచి జవాబుదారీతనం, బాధ్యతకు కట్టుబడి
ఉంది: అంత్యోదయ, అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం: శ్రీ సింగ్
Posted On:
02 OCT 2023 3:01PM by PIB Hyderabad
గ్రామీణాభివృద్ధి పథకాల్లో వివక్ష చూపుతున్నారంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బీహార్ లో ఒక ముఖ్యమైన విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి యుపిఎ ప్రభుత్వ హయాంలో కంటే గ్రామీణ అభివృద్ధి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించిందని అన్నారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో పశ్చిమ బెంగాల్ కు కేవలం 58 వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గత 9 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్ కు అభివృద్ధి కోసం రూ .2 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని శ్రీ గిరిరాజ్ సింగ్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పట్ల దేశ ప్రధానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని, . ఎంఎన్ఆర్ఇజిఎ వంటి పథకాల కింద గత 9 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్ కు రూ .54 వేల కోట్లకు పైగా ఇచ్చారని, అయితే యుపిఎ హయాంలో ఈ సంఖ్య రూ .14,900 కోట్లు మాత్రమే అని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద యు పి ఎ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, మోదీ ప్రభుత్వంలో రెట్టింపు రూ.11,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4,400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, మోదీ ప్రభుత్వం బెంగాల్ కు రూ.30 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. నేడు ఎన్ ఆర్ ఎల్ ఎం కింద పశ్చిమబెంగాల్ కు చెందిన దీదీల బ్యాంకు లింకేజీ విలువ సుమారు రూ.74 వేల కోట్లు కాగా, యు పి ఎ హయాంలో అది రూ.600 కోట్లు మాత్రమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ఎస్ఎపి కింద సుమారు రూ .7 వేల కోట్లు ఇచ్చిందని, , అయితే యుపిఎ హయాంలో ఇది సగం మాత్రమే నని చెప్పారు. ఆర్థిక సంఘం కింద పశ్చిమబెంగాల్ కు ఇప్పుడు రూ.25 వేల కోట్లు విడుదల చేయగా, యూపీఏ హయాంలో రూ.3,200 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.
పథకం పేరు
|
యు పి ఎ
|
ఎన్ డి ఎ
|
మహాత్మాగాంధీ నరేగా (కేంద్ర నిధులు విడుదల)
|
14,985 కోట్ల రూపాయలు
|
54,150 కోట్ల రూపాయలు
|
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (రాష్ట్ర వాటాతో సహా మొత్తం వ్యయం)
|
5,431 కోట్ల రూపాయలు
|
11,051 కోట్ల రూపాయలు
|
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (నిధుల విడుదల)
|
4,466 కోట్ల రూపాయలు
|
30,000 కోట్ల రూపాయలు
|
ఎన్ఆర్ఎల్ఎం బ్యాంకు లింకేజీ
|
626 కోట్ల రూపాయలు
|
74,034 కోట్ల రూపాయలు
|
ఎన్ ఆర్ ఎల్ ఎం ఆర్ ఎఫ్/సి ఐ ఎఫ్ (రివాల్వింగ్ ఫండ్ + కమ్యూనిటీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్)
|
23 కోట్ల రూపాయలు
|
3,735 కోట్ల రూపాయలు
|
ఎన్ఎస్ఎపి (నిధుల విడుదల)
|
3,685 కోట్ల రూపాయలు
|
6,806 కోట్ల రూపాయలు
|
ఫైనాన్స్ కమిషన్ (నిధుల విడుదల)
|
3,270 కోట్ల రూపాయలు
|
25,000 కోట్ల రూపాయలు
|
ఆర్ జి ఎస్ఏ (నిధులు విడుదల)
|
41 కోట్ల రూపాయలు
|
227.41 కోట్ల రూపాయలు
|
మొత్తం
|
58,058 కోట్ల రూపాయలు
|
2,05,003.41 కోట్ల రూపాయలు
|
2006-14 మధ్య ఎంఎన్ఆర్ఇజిఎ కింద 111 కోట్ల పనిదినాలు కల్పించారని, , 2014 తర్వాత 240 కోట్ల పనిదినాలు కల్పించామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి తెలిపారు. యూపీఏ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేవలం 15 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించగా, పశ్చిమబెంగాల్ లో మోదీ ప్రభుత్వం 45 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిం lదని, అదేవిధంగా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద యూపీఏ ప్రభుత్వంలో కేవలం 13 వేల కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించగా, మోదీ ప్రభుత్వంలో 21 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారని చెప్పారు. 2014 వరకు కేవలం 48 వేల మంది దీదీలు మాత్రమే స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉండగా, నేడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో 11 లక్షల మందికి పైగా దీదీలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నా రని, మహిళా సాధికారతకు ఇదొక గొప్ప ఉదాహరణ అని కేంద్ర మంత్రి అన్నారు.
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మొదటి నుంచి జవాబుదారీతనం, బాధ్యతకు కట్టుబడి ఉందని, ఎవరి స్వప్రయోజనాల కోసం కాకుండా నిజంగా అర్హులైన వారి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అంత్యోదయ, అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పటి నుంచి లక్షలాది దళారుల దుకాణాలు మూతపడ్డాయని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 25 లక్షల నకిలీ ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డులను జారీ చేసిందని, దీని వల్ల కోట్లాది ప్రభుత్వ డబ్బును దోచుకున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఉపాధిహామీ, గృహనిర్మాణ పథకంలో జరుగుతున్న రిగ్గింగ్ ను కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఎండగడుతోందని, అయితే దీనిపై తగిన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మానిటరింగ్ టీంను పంపినా వారి నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలే దని, సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని మంత్రిత్వ శాఖ పలుమార్లు రాష్ట్రాన్ని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. చివరగా, సకాలంలో ఎటిఆర్ సమర్పించకపోవడం కూడా ఎంఎన్ఆర్ఇజిఎ చట్టం 2005 కింద నిధులను నిలిపివేయడానికి దారితీస్తుందని రాష్ట్రానికి తెలియచేసిన తర్వాత నిందితులను కాపాడుతూ ఏటీఆర్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని చెప్పారు. దీనిపై ప్రశ్నించగా అవినీతి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం కూడా చెప్పలేకపోయిదనిఅన్నారు. దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని గిరిరాజ్ సింగ్ అన్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకం పేరును బంగ్లా ఆవాస్ యోజనగా మార్చడంపై ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తెలిపారు. దీనికితోడు అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మార్గదర్శకాలను ఉల్లంఘించి పార్టీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించారని, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పేదల హక్కులను కాలరాయడం ద్వారా చేసిన నష్టం భవిష్యత్తులో దేశానికి హానికరమని ఆయన అన్నారు. అందుకే ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఇళ్లను కేటాయిస్తామన్న షరతుపై మాత్రమే ప్రభుత్వం ఆవాస్ ప్లస్ కింద 11.3 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని కేటాయించింది, అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనర్హ కుటుంబాల ఎంపికతో సహా ఈ పథకం అమలులో తీవ్రమైన అవకతవకలకు పాల్పడిందని పలువురు పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, సాధారణ ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చా యని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏటీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదన్నారు.
శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, ఈ రోజు మోదీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ఏళ్ల తరబడి నడుస్తున్న సిండికేట్లను విచ్ఛిన్నం చేసి, అవినీతికి గట్టి దెబ్బ కొట్టిందని, అందువల్ల ప్రభుత్వ పథకాలు లక్షల కోట్ల ఇళ్లకు సంతోషాన్ని తెచ్చిపెట్టిన చోట సిండికేట్ తో సంబంధం ఉన్న ప్రజలు కూడా ఆగ్రహానికి గురయ్యారని, వారి అలవాటు ప్రకారం నేటికీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారని అన్నారు. తాము విఫలమైనప్పుడు ప్రజల నిరసన లను పక్కదారి పట్టించడానికి కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వివిధ రకాల తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద కుటుంబాలకు సరైన మార్గంలో తీసుకెళ్లడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేసి ఉంటే, పశ్చిమ బెంగాల్ ఈ రోజు అభివృద్ధిలో కొత్త కథను రాసేదని ఆయన అన్నారు.
***
(Release ID: 1963440)
Visitor Counter : 163