రక్షణ మంత్రిత్వ శాఖ
మలేషియా క్లాంగ్ రేవులో ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్
प्रविष्टि तिथि:
02 OCT 2023 2:49PM by PIB Hyderabad
ఆగ్నేయాసియాలో తన దూరప్రాంత మోహరింపులో భాగంగా భారతీయ నావికాదళం తన ఫస్ట్ ట్రైనింగ్ స్వ్కాడ్రన్ (1 టిఎస్ - వాస్తవ శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన నౌకలు) ఐఎన్ఎస్ తీర్, ఐఎన్ఎస్ సుజాత, ఐసిజిఎస్ సారథి మలేషియాలోని క్లాంగ్ రేవును సందర్శిస్తున్నాయి. 1టిఎస్ చేపట్టి కార్యకలాపాలలో వివిధ వృత్తిపరమైన, కమ్యూనిటీ పరస్పర చర్యలు, శిక్షణ బదలాయింపులు, నౌకల మధ్య లాంఛనప్రాయ పర్యటనలు, రాయల్ మలేషియన్ నేవీతో క్రీడలు, పాఠశాల విద్యార్ధులు నౌకలను సందర్శించేందుకు అనుమతి వంటివి ఉన్నాయి.
హిందూ మహా సముద్ర ప్రాంతంలోని స్నేహపూర్వక దేశాలతో సామాజిక రాజకీయ, సైనిక, సముద్ర సంబంధాలకు శిక్షణ పొందుతున్నవారికి పరిచయం చేయడం, ఇరు నావికాదళాల మధ్య ద్వైపాక్షిక కార్యకలాపాలను బలోపేతం చేయడం లక్ష్యంగా 1 టిఎస్ ను మోహరించారు.
***
(रिलीज़ आईडी: 1963438)
आगंतुक पटल : 150