ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఆధునిక చిత్రకళా గ్యాలరీలో ప్రధానికి వచ్చిన కానుకల ప్రదర్శన


కానుకల వేలంద్వారా వచ్చిన సొమ్ము నమామి గంగే కోసం కేటాయింపు

Posted On: 02 OCT 2023 4:26PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన కానుకలు, జ్ఞాపికలతో న్యూఢిల్లీలోని  జాతీయ ఆధునిక చిత్రకళా గ్యాలరీ (ఎన్‌జిఎంఎ)లో విస్తృత ప్రదర్శన ఏర్పాటైంది. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని ప్రజలతో పంచుకున్నారు.

   దేశవ్యాప్తంగా తాను వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ కానుకలు, జ్ఞాపికలు తనకు బహూకరించబడినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇవన్నీ భారత సుసంపన్న సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని శ్రీ మోదీ తెలిపారు.

   ఎప్పటిలాగానే  తనకందిన ఈ బహుమతులను వేలం వేసి, ఆ సొమ్మును నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించలేని వారికోసం ‘ఎన్‌జిఎంఎ’ వెబ్‌సైట్‌ లింకును పంచుకున్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“న్యూఢిల్లీలోని ‘ఎన్‌జిఎంఎ’ @ngma_delhiలో నాకు ఇటీవలి కాలంలో అందిన రకరకాల కానుకలు, జ్ఞాపికలతో ప్రదర్శన ఏర్పాటు చేయబడింది.

  ఇవన్నీ దేశవ్యాప్తంగా నేను వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా నాకు బహూకరించబడ్డాయి. సుసంపన్న భారత సంస్కృతి, సంప్రదాయం, కళా వారసత్వానికి ఇవన్నీ ప్రతిరూపాలు.

   ఎప్పటిలాగానే వీటన్నిటినీ వేలం వేసి, ఆ సొమ్మును నమామి గంగే కార్యక్రమం కోసం వినియోగిస్తారు.

   వీటిని మీరు సొంతం చేసుకునే అవకాశం ఇదే! ‘ఎన్‌జిఎంఎ’ని తప్పకుండా సందర్శించండి.. ఇందుకోసం వెబ్‌సైట్‌ లింకు (pmmementos.gov.in) ఇస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1963356) Visitor Counter : 128