గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా హి సేవా సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు , జాతీయ స్థాయిలొ కార్యక్రమాలను నిర్వహించిన గనుల మంత్రిత్వశాఖ


గనుల శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్ కాంతారావు, గనుల మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారులు, సిపిఎస్ఇలు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి, స్వచ్ఛతా హి సేవా ప్రచార

Posted On: 01 OCT 2023 4:37PM by PIB Hyderabad

‘ఏక్ తారీఖ్,  ఏక్ ఘంట,  ఏక్ సాథ్’ పాటించారు.
గ నుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఎన్ఐటి 4 గవర్నమెంట్ కాలనీ, ఫరీదాబాద్ వద్ద  పరిశుభ్రతా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు.
గనుల శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శుల స్థాయి అధికారులు, ఏక్ తారీక్, – ఏక్ ఘంటా, – ఏక్ సాథ్ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించారు.
గనుల మంత్రిత్వశాఖ, దాని కింద పనిచేసే వివిధ కార్యాలయాల ద్వారా 40 స్వచ్ఛతా హి సేవా మెగా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టింది. వీటిని దేశవ్యాప్తంగా గల వివిధ చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతాలలో నిర్వహించారు.
వీటిలో బాలసిఇనోర్ ఫాసిల్ పార్క్, గుజరాత్, ఉదయగిరి, భువనేశ్వర్ సమీపంలోని ఖందగిరి హిల్స్, పాట్నా సమీపంలోని నాగార్జున గుహలు తదితరాలు ఉన్నాయి.
గుజరాత్లోని బాలసినోర్ వద్దగల రాహియోలి డైనోసోర్ ఫాసిల్ పార్క్ , డైనోసార్ అవశేషాలకు సంబంధించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రదేశంగా గుర్తింపు పొందింది. దీనిని జియో హెరిటేజ్ పార్క్గా పరిరక్షిస్తూ వస్తున్నారు.
డైనోసార్ అవశేషాలు ఇందులోని 18.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

భువనేశ్వర్ సమీపంలోని ఖందగిరి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. ఇది ఒడిషాలో రోజూ, పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించే జియో –హెరిటేజ్ ప్రాంతం.
పాట్నా సమీపంలోని జెహనాబాద్ నాగార్జున హిల్స్, బరాబర్ మధ్య యుగాలనాటి మానవ నిర్మిత గుహలు. గ్రానైట్ ను తొలిచి గుహలుగా మలిచారు. ఇవి జియో టూరిస్ట్ ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.
వీటితోపాటుగా, మంత్రిత్వశాఖ కుచెందిన యూనిట్లు, కార్యాలయాలు, తమకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో స్వచ్ఛతా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.


గనుల విభాగం కార్యదర్శి శ్రీ వి.ఎల్ కాంతారావు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఐఎస్) వారి ‘ ఏక్ తారీక్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ శ్రమదాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు ఫరీదాబాద్లోని ఎన్ఐటి 4 గవర్నమెంట్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో  పాల్గొన్నారు.
 మంత్రిత్వశాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు, సిబ్బంది ఢిల్లీలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అక్టోబర్ 2న మంత్రిత్వశాఖకు చెందిన అన్ని యూనిట్లు,దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు, సబార్డినేట్ కార్యాలయాలు, జాతిపిత మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటిస్తాయి, అనంతరం స్వచ్చతా ప్రతిజ్ఞ చేపడతాయి.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం, 2023 ను ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0, 2023 తో అనుసంధానం చేస్తారు.

 

WhatsApp Image 2023-10-01 at 12.08.26

  1:  ఫరీదాబాద్లోని ఎన్.ఐ.టి 4 గవర్నమెంట్ కాలనీలో పరిశుభ్రతాకార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి.



ఫొటో రైటప్ 2:   గనుల మంత్రిత్వశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు , దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏక్ తారీఖ్– ఏక్ ఘంటా– ఏక్ సాథ్ కార్యాచరణలో పాల్గొన్న దృశ్యం.

WhatsApp Image 2023-10-01 at 12.59.46

ఫోటో రైటప్ 3:  గుజరాత్ లోని బాలాసినోర్ వద్ద గల రహియోలి డైనోసార్ అవశేషాల పార్క్ వద్ద పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్న గనుల మంత్రిత్వశాఖ అధికారులు.

WhatsApp Image 2023-10-01 at 12.29.04

ఫోటో రైటప్ 4:  గనుల శాఖ డైరక్టర్, భువనేశ్వర్ సమీపంలోని ఖందగిరి కొండలవద్ద పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యం.

WhatsApp Image 2023-10-01 at 13.23.34

ఫోటో రైటప్ 5 :  పాట్నా సమీపంలోని నాగార్జున గుహలవద్ద పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొంటున్న , గనుల మంత్రిత్వశాఖ అధికారులు,సిబ్బంది.

 

****


(Release ID: 1963161) Visitor Counter : 90


Read this release in: English , Urdu , Hindi , Kannada