రక్షణ మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత అభియాన్ ప్రారంభించిన భారత వైమానిక దళం
Posted On:
01 OCT 2023 3:34PM by PIB Hyderabad
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) స్వచ్ఛత ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది, ఐఏఎఫ్‌లోని వైమానిక సిబ్బంది, ప్రజలు 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా' కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి, న్యూదిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులు కలిసి మోతీలాల్ నెహ్రూ మార్గ్, ఎండీఎంసీ పార్కింగ్ ప్రాంతంతో పాటు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. దేశంలోని వైమానిక స్థావరాల చుట్టుపక్కల ఉన్న 750 ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. 02 అక్టోబర్ 2023న, స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేసిన తర్వాత, శ్రమవీరులను సత్కరిస్తారు.
"పరిశుభ్రత అనేది అన్ని ధర్మాల ఆధారంగా నిర్మితమైంది" అన్న మహాత్మాగాంధీ మాటల ప్రేరణతో స్వచ్ఛత ప్రచారాన్ని రూపొందించారు. మొత్తం శుభ్రత & పరిశుభ్రత ప్రమాణాల్లో మెరుగుదల సాధించడం, వ్యర్థ పదార్థాలను తగిన పద్ధతిలో నిర్వహించడం, రీసైకిల్ చేసిన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారంలో భాగం. వైమానిక సిబ్బంది మొత్తం తమ కార్యాలయ స్థలాలను బాగు చేసుకోవడానికి, పాత దస్త్రాలు, పత్రాలను వదిలించుకోవడానికి సమష్టిగా పని చేస్తారు. ఈ-ఆఫీస్, ఐఎంఎంవోఎల్‌ఎస్, ఈ-ఎంఎంఎస్ వంటి డిజిటల్ కార్యక్రమాల ప్రారంభం ద్వారా ఐఏఎఫ్ ఇప్పటికే ఈ విషయంలో చర్యలు తీసుకుంది. ఈ ప్రచారంలో భాగంగా చేపట్టిన ఉత్తమ విధానాలను పరిశీలించి, అన్ని ఐఏఎఫ్ విభాగాల్లో అనుసరిస్తారు. తద్వారా, శుభ్రత ప్రక్రియ కొనసాగుతుంది.
***
(Release ID: 1963065)
Visitor Counter : 75