ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అపోహలు మరియు వాస్తవాలు


టీబీ నివారణ ఔషధాల కొరత ఉందంటూ వచ్చిన మీడియా కథనాలు అవాస్తవం.. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఆ కథనాలు ఉన్నాయి

దేశంలోని అన్ని రకాల టీబీ నివారణ మందులు ఆరు నెలలు మరియు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి అవసరమైన మొత్తంలో అందుబాటులో ఉన్నాయి

సెంట్రల్ వేర్‌హౌస్‌ల నుండి ఆ పరిధిలోని ఆరోగ్య సంస్థల వరకు వివిధ స్థాయిలలో స్టాక్ పొజిషన్‌లను మూల్యాంకనం చేయడానికి కేంద్రం ముందస్తుగా క్రమమైన అంచనాలను నిర్వహిస్తుంది.

Posted On: 01 OCT 2023 2:03PM by PIB Hyderabad

భారతదేశంలో టీబీ నివారణ మందుల కొరత ఉందని కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. అయితే ఆ నివేదికలు తప్పుడువి మరియు తప్పుదారి పట్టించేవి. ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారిపట్టించడానికి మరియు అవాస్తవాలను ప్రచారం చేయడానికి అవి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి.

డ్రగ్ సెన్సిటివ్ క్షయవ్యాధి చికిత్సలో 4ఎఫ్‌డిసి (ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటోల్ మరియు పైరజినామైడ్) రెండు నెలల పాటు అందుబాటులో ఉన్న నాలుగు ఔషధాలు ఉంటాయి, తర్వాత 3 ఎఫ్‌డిసి (ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ మరియు ఇథాంబుటోల్)గా రెండు నెలల మూడు మందులు అందుబాటులో ఉంటాయి. ఈ ఔషధాలన్నీ ఆరు నెలలు మరియు అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి తగినంత స్టాక్‌లతో అందుబాటులో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ఔషధాల సేకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించబడింది.

మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (ఎండిఆర్‌) టీబీ చికిత్స నియమావళిలో సాధారణంగా నాలుగు నెలల 7 మందులు ఉంటాయి (బెడాక్విలిన్, లెవోఫ్లోక్సాసిన్, క్లోఫాజిమైన్, ఐసోనియాజిడ్, ఇథాంబుటోల్, పైరజినామైడ్ మరియు ఇథియోనామైడ్) ఐదు నెలల తర్వాత 4 మందులు (లెవోఫ్లోక్సాసిన్, క్లోఫాజిమ్‌మైన్, పైరాజామ్‌బుటామిన్)ఉంటాయి. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్నవారిలో దాదాపు 30% మందికి సైక్లోసెరిన్ మరియు లైన్‌జోలిడ్ అవసరం. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీబీ మందులను తీసుకుంటున్న రోగులు మొత్తం టీబీ బాధిత జనాభాలో 2.5% మాత్రమే ఉన్నారు. అయితే మీడియా కథనాల్లో నివేదించినట్లుగా వీరికి కూడా ఔషధాల కొరత లేదు.

నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టిఇపి) కింద టీబీ వ్యతిరేక మందులు & ఇతర మెటీరియల్‌ల సేకరణ, నిల్వ, స్టాక్ నిర్వహణ మరియు ఇన్-టైమ్ పంపిణీ జరుగుతోంది. అరుదైన పరిస్థితుల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద బడ్జెట్‌ను ఉపయోగించడం ద్వారా పరిమిత కాలానికి స్థానికంగా కొన్ని మందులను సేకరించాలని రాష్ట్రాలు అభ్యర్థించబడ్డాయి. తద్వారా వ్యక్తిగత రోగి సంరక్షణ ప్రభావితం కాదు.

అలాగే ఎన్‌టిఈపి క్రింద మోక్సిఫ్లోక్సాసిన్  400ఎంజీ మరియు పిరిడాక్సిన్‌కు సంబంధించి 15 నెలల కంటే ఎక్కువ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. డెలమానిడ్ 50 ఎంజీ మరియు క్లోఫాజిమైన్ 100 ఎంజీఆగస్టు 2023లో సేకరించబడ్డాయి మరియు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయబడ్డాయి. దీనితో పాటు అదనంగా 8 లక్షల క్యూటీ డెలామానిడ్ 50 ఎంజీ మాత్రల సరఫరా కోసం 23.09.2023న పి.ఓ.జారీ చేయబడింది.

పైన పేర్కొన్న స్టాక్‌లతో పాటు, ఆగస్టు 2023లో 3 ఎఫ్‌డిసి(పి) లైన్‌జోలిడ్-600ఎంజీ &కాప్‌సైక్లోసెరిన్‌-250 ఎంజీ సరఫరా కోసం కొనుగోలు ఆర్డర్‌లు జారీ చేయబడ్డాయి. 3 ఎఫ్‌డిసి(పి) కోసం ప్రీ-డిస్పాచ్ ఇన్‌స్పెక్షన్ (పిడిఐ), లైన్‌జోలిడ్‌-600ఎంజీ & కాప్‌సైక్లోసెరిన్‌-250 ఎంజీ మరియు 3 ఎఫ్‌డిసి(పి) మరియు సైక్లోసెరిన్ క్వాలిటీ టెస్ట్ రిపోర్టులు వచ్చాయి. ఈ మందులను రాష్ట్రాలకు పంపిస్తున్నారు. 25.09.2023 నుండి విడుదల ఉత్తర్వులు జారీ చేయబడుతున్నాయి.

ని-క్షయ్ ఔషధి ప్రకారం ఈరోజు జాతీయ స్థాయిలో కథనంలో పేర్కొన్న ఈ ఔషధాల ప్రస్తుత స్టాక్ క్రింది విధంగా ఉంది:

 

ఔషధం పేరు

ఈ రోజు (30.09.2023) నాటికి  ఎన్‌టిఈపి (యుఓఎంకాప్స్/ట్యాబ్స్‌) కింద జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న స్టాక్

వ్యాఖ్యలు

సైక్లోసెరిన్ -250 మి.గ్రా

2,73,598

·        పైప్‌లైన్‌లో స్టాక్ - 1 ,49,02,850 .

·        క్వాలిటీ టెస్ట్ రిపోర్టులు వచ్చాయి.

·        విడుదల ఉత్తర్వులు వెలువడుతున్నాయి.

లైన్జోలిడ్ - 600 మి.గ్రా

7,69,883

·        పైప్‌లైన్‌లో స్టాక్ - 52,70,870 .

·        ప్రీ-డిస్పాచ్ ఇన్‌స్పెక్షన్ (పిడిఐ) 23.09.2023న జరిగింది మరియు

·        అక్టోబర్ 2023 1 వ వారంలోపు నాణ్యత పరీక్ష నివేదికలు అందజేయబడతాయి .

డెలామానిడ్ - 50 మి.గ్రా

10,31,770

·        లక్షల ట్యాబ్‌లు కోసం కొనుగోలు ఆర్డర్ జారీ చేయబడింది. ఇది అక్టోబర్-2023 నాటికి బట్వాడా చేయబడుతుందని భావిస్తున్నారు

క్లోఫాజిమైన్ - 100 మి.గ్రా

45,26,200

·        సేకరణ ప్రక్రియ పూర్తయింది మరియు ఇప్పటికే సరఫరా ప్రారంభమైంది.

·        వీటితో పాటు 49.72 లక్షల మాత్రల సేకరణ ప్రక్రియలో ఉంది.

మోక్సిఫ్లోక్సాసిన్ - 400 మి.గ్రా

2,72,17,061

·        తగినంత స్టాక్ అందుబాటులో ఉంది

పిరిడాక్సిన్

2,72,24,272

·        తగినంత స్టాక్ అందుబాటులో ఉంది

 


ఈ ముఖ్యమైన టీబీ నివారణ ఔషధాల లభ్యతను నిర్ధారించడానికి చేసిన ముఖ్యమైన ప్రయత్నాలతో పాటు సెంట్రల్ వేర్‌హౌస్‌ల నుండి పరిధిలోని ఆరోగ్య సంస్థల వరకు వివిధ స్థాయిలలో స్టాక్ పొజిషన్‌లను మూల్యాంకనం చేయడానికి సాధారణ అంచనాలు నిర్వహించబడతాయి.

అందువల్ల సంబంధిత మీడియా నివేదికలలో పేర్కొన్న సమాచారం సరికానిది మరియు తప్పుదారి పట్టించేది మాత్రమే కాకుండా దేశంలో అందుబాటులో ఉన్న టీబీ నివారణ ఔషధాల యొక్క సరైన పరిస్థితిని ప్రతిబింబించడం లేదు.

 
***

(Release ID: 1963036) Visitor Counter : 130