రక్షణ మంత్రిత్వ శాఖ
డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావలస్ స్టాఫ్‌గా పదవీబాధ్యతలను స్వీకరించిన ఎవిఎస్ఎం, విఎస్ఎం వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి
Posted On:
01 OCT 2023 11:04AM by PIB Hyderabad
నావల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి, ఎవిఎస్ఎం, విఎస్ఎం 01 అక్టోబర్ 2023న బాధ్యతలు స్వీకరించారు.
వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తిని 01 జులై 1988లో భారతీయ నావికాదళంలో నావిగేషన్ (నౌకాయాన), దిశా నిపుణునిగా నియమించారు.
దాదాపు 35 సంవత్సరాల కెరీర్‌లో, ఆయన నౌకలలోనూ, తీరంలోనూ వివిధ రకాల కమాండ్, స్టాఫ్ బాధ్యతలను నిర్వహించారు. క్షిపణి ఓడ అయిన ఐఎన్ఎస్ నిశాంక్, క్షిపణులు కలిగిన చిన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోరా, గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కోల్‌కతాలకు అధిపతిగా ఈ ఫ్లాగ్ అధికారి ఉన్నారు. తన సిబ్బందిపాలనా బాధ్యతల కాలంలో ఆయన డైరెక్టొరేట్ ఆఫ్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్స్, డైరెక్టొరేట్ ఆఫ్ పర్సనల్‌గా, మాస్కోలోని భారతీయ రాయబారి కార్యాలయానికి నావికాదళ సహాధికారిగా పని చేశారు.
రేర్ అడ్మిరల్ ర్యాంక్‌కు 2019లో పదోన్నతిని పొందినప్పుడు, ఆయనను ఎఝిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ ప్రధాన బోధకుడిగా, డిప్యూటీ కమాండెంట్‌గాను, అనంతరం తూర్పు నౌకాదళ నాయకత్వం వహించే ఫ్లాగ్ అధికారిగా నియమితులయ్యారు. 2021లో వైస్ అడ్మిరల్‌గా పదోన్నతిని పొందిన తర్వాత, ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలోని నావికాదళ కేంద్రకార్యాలయంలో నావల్ స్టాఫ్‌కు డిప్యూటీ అధిపతిగా నియమితులయ్యే ముందు ప్రాజెక్ట్ సీబోర్డ్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
2020లో విశిష్ట సేవా పతకాన్ని, 2022న అతి విశిష్ట సేవా పతకాన్ని భారత రాష్ట్రపతి ఫ్లాగ్ అధికారికి ప్రదానం చేశారు.
దాదాపు 38 ఏళ్ళపాటు విశిష్ట సేవలను అందించి 30 సెప్టెంబర్ 2023న పదవీ విరమణ చేసిన వైస్ అడ్మిరల్ సంజయ్ మహేంద్రు తర్వాత ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. వైస్ అడ్మిరల్ సంజయ్ మహేంద్రు డిసిఎన్ఎస్‌గా ఉన్న కాలంలో, భారత నావికాదళం అత్యధిక సముద్ర తీర చొరవను, కార్యాచరణ వేగాన్ని పెంచిన అనేక కీలక విజయాలను సాధించింది. అలాగే, స్నేహపూర్వక విదేశాలతో అనేక విజయవంతమైన వ్యూహాత్మక సహకార కార్యక్రమాలను కూడా సాధించింది.
(Release ID: 1962962)
Visitor Counter : 133