రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఢిల్లీ కంటోన్మెంట్ లో స్వచ్ఛతా హి సేవ లో భాగంగా రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పరిశుభ్రత మరియు మొక్కలు నాటడం కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు


మహాత్మాగాంధీ ఆశించిన ‘స్వచ్ఛ భారత్’ ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని సఫాయి కరంచారీలను కోరారు, అంకిత భావం ద్వారా వారందిస్తున్న సేవలకు అభినందనలు తెలిపారు.

Posted On: 01 OCT 2023 11:01AM by PIB Hyderabad

‘స్వచ్ఛతా హి సేవా’ ప్రచారంలో భాగంగా  ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ‘ఏక్ తారిఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ ను ఢిల్లీ కాంట్‌ లోని డిఫెన్స్ అకౌంట్స్ (CGDA)  ప్రాంగణంలో అక్టోబరు 01, 2023న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన  నిర్వహించారు. రక్షణ మంత్రి శ్రమదానం  ద్వారా పరిశుభ్రత, పరిసరాల  సుందరీకరణ మరియు మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.

 

రక్షణ మంత్రి సఫాయి కర్మచారులతో సంభాషించారు,  ప్రాంగణ పరిశుభ్రత పాటించడం లో వారి ప్రయత్నాలను ప్రశంసించారు. జాతిపిత మహాత్మాగాంధీ  ‘స్వచ్ఛ భారత్’ కలను సాకారం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన సామూహిక సామాజిక ఉద్యమాన్ని ఉత్సాహంతో  అంకితభావంతో కొనసాగించాలని మరియు ముందుకు తీసుకెళ్లాలని ఆయన వారికి స్ఫూర్తినిచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఫైనాన్షియల్ అడ్వైజర్ (డిఫెన్స్ సర్వీస్) శ్రీమతి రసిక చౌబే మరియు సీ జీ డీ ఏ సీ జీ డీ ఏ  శ్రీ ఎస్ జీ దస్తిదార్లు ఈ సందర్భంగా వివిధ పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 

పిసిడిఎ (ఆర్మీ) జమ్ము, పిసిడిఎ (ఎయిర్ ఫోర్స్) డెహ్రాడూన్, పిసిడిఎ (ఆర్మీ) జైపూర్, పిసిడిఎ (పెన్షన్లు) ప్రయాగ్‌రాజ్, సిడిఎ (ఆర్మీ) మీరట్, సిడిఎ కార్యాలయాలకు అధిపతి ప్రిన్సిపల్ కంట్రోలర్‌లు మరియు డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్‌లతో కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సంభాషించారు. గౌహతి, సీ డీ ఏ  జబల్‌పూర్, సీ డీ ఏ  (ప్రాంతీయ శిక్షణ కేంద్రం) బెంగళూరు మరియు సీ డీ ఏ  చెన్నై  వారి వారి సంబంధిత అధికార పరిధిలో 'స్వచ్ఛతా హి సేవా' ప్రచారం అమలును సమీక్షించారు.

 

సెప్టెంబరు 15, 2023న ప్రారంభమైన 'స్వచ్ఛతా హి సేవా' ప్రచారం అక్టోబర్ 02, 2023న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముగుస్తుంది. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ ప్రచారంలో భాగంగా పౌర భాగస్వామ్యం ద్వారా పలు శ్రమదాన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 

 

దేశవ్యాప్తంగా 1,100 కంటే ఎక్కువ కార్యాలయాలు మరియు నివాస కాలనీలలో రక్షణ విభాగానికి చెందిన 20,000 మంది అధికారులు మరియు సిబ్బంది చెత్తను తొలగించడం, ఫైళ్లను తొలగించడం మరియు మెరుగైన పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన ప్రచారాలతో సహా వివిధ పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టారు. ‘స్వచ్ఛతా హి సేవ’ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా రక్షణ, సేవలు మరియు సంబంధిత సంస్థల యొక్క వివిధ ఇతర సంస్థలలో ఇలాంటి పరిశుభ్రత కార్యకలాపాలు ప్రారంభించారు.

 

****


(Release ID: 1962961) Visitor Counter : 115