వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛత హీ సేవ ప్రచారంలో భాగంగా 811 కార్యక్రమాలలో పాల్గొననున్న ఆహార, ప్రజాపంపిణీ విభాగం
Posted On:
30 SEP 2023 12:57PM by PIB Hyderabad
స్వచ్ఛత హీ సేవా (స్వచ్ఛతే సేవ)లో భాగంగా1 అక్టోబర్ 2023న ఏక్ తారీఖ్ ఏక్ ఘంట ఏక్ సాథ్ (ఒక తేదీ, ఒక గంట, అందరితో కలిసి)లో ఏక్ తారీఖ్ ఏక్ ఘంట ఏక్ సాథ్ స్వచ్ఛతా ప్రచారంలో చురుకుగా పాల్గొనేందుకు ఆహారం& ప్రజా పంపిణీ విభాగం (డిఎఫ్‌పిడి) నిర్ణయించింది. తన అనుబంధ కార్యాలయాలు &పిఎస్‌యులతో కలిసి ఆహారం& ప్రజా పంపిణీ విభాగం మొత్తం 811 కార్యక్రమాలను గుర్తించి, దేశవ్యాప్తంగా అందులో పాల్గొననుంది.
కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా నాయకత్వంలో న్యూఢిల్లీలోని లోధీ కాలనీ, మెహెర్‌చంద్ మార్కెట్, లోధీ కాలనీలోని అన్‌నోన్ సోల్జర్ పార్ట్‌లోనూ పారిశుద్ధ్య డ్రైవ్‌ను చేపట్టనుంది. ఈ భారీ కార్యక్రమంలో మెహెర్‌చంద్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కూడా పాలుపంచుకోనున్నారు.
అలాగే, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రకార్యాలయం, సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్‌లు, విభాగం కింద పని చేస్తున్న పిఎస్‌యుల లోని అధికారులు, సిబ్బంది న్యూఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1, పికెటి-2లోనూ, బెంగాలీ మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతాలలో, పాఠశాల వద్ద ఈ డ్రైవ్‌ను చేపడుతున్నారు.
విభాగం పరిధిలోని వేర్‌హౌజింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ 1 అక్టోబర్ 2023న శుభ్రం చేసేందుకు పార్క్ ప్రాంతం సహా హాజ్ ఖాస్ మార్కెట్ ను గుర్తించగా, మరొక సంస్థ - నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్ తన కార్యక్రమం కోసం కాన్పూర్‌లోని సివిల్ లైన్స్‌లోని పర్మత్ ఘాట్‌ను ఎంపిక చేసుకుంది.
విభాగం, దాని పిఎస్‌యులు/ సంస్థలు ఆర్‌డబ్ల్యుఎ, స్థానిక మార్కెట్ అసోసియేషన్లను, ఆలయాలు/ ఘాట్ల నిర్వాహకులు తదితరులను ఈ మెగా కార్యక్రమంలో భాగస్వాములను చేసుకుంటున్నాయి. ఈ పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వహించేందుకు 811 ప్రాంతాలను గుర్తించారు. విభాగానికి, పిఎస్‌యులు, సంస్థలకు చెందిన మొత్తం 13000కు పైగా అధికారులు, ఉన్నతస్థాయి అధికారులు, సిబ్బంది ఈ పారిశుద్ధ్య డ్రైవ్‌లో పాలుపంచుకుంటారని అంచనా.
ఈ కార్యక్రమాలన్నింటినీ సాఫీగా చేపట్టి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విభాగం, సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారిని 1 అక్టోబర్ 2023న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మొత్తం ప్రచారం, కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిగా నియమించింది.
***
(Release ID: 1962614)
Visitor Counter : 91