ప్రధాన మంత్రి కార్యాలయం
మహత్వాకాంక్షయుక్తబ్లాకుల కోసం ‘సంకల్ప్ సప్తాహ్’ పేరు తో ఒక విశిష్టమైన ఏడు రోజుల కార్యక్రమాన్నిసెప్టెంబర్ 30 వ తేదీ నప్రారంభించనున్న ప్రధాన మంత్రి
దేశవ్యాప్తం గా 329 జిల్లాల లో గల 500 మహత్వాకాంక్షయుక్త బ్లాకుల లో ‘సంకల్ప్ సప్తాహ్’ ను పాటించడం జరుగుతుంది
‘సంకల్ప్ సప్తాహ్’ లో ప్రతి ఒక్క రోజు ను ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సంబంధి ఇతివృత్తాని కి అంకితమివ్వడమైంది, ఆ ఇతివృత్తం పై మహత్వాకాంక్షయుక్త బ్లాకులు పనిచేస్తాయి
Posted On:
28 SEP 2023 6:36PM by PIB Hyderabad
దేశం లో మహత్వాకాంక్షయుక్త బ్లాకుల కోసం ఉద్దేశించిన వారం రోజుల పాటు సాగేటటువంటి ఒక కార్యక్రమాన్ని ‘సంకల్ప్ సప్తాహ్’ పేరు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 30 వ తేదీ న ఉదయం సుమారు 10 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించనున్నారు.
"సంకల్ప్ సప్తాహ్’ అస్పైరేశనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఎబిపి) యొక్క ప్రభావవంతం అయినటువంటి ఆచరణ తో ముడిపడివుంటుంది. దేశవ్యాప్తం గా ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి 2023 జనవరి 7 వ తేదీ న మొదలుపెట్టారు. పౌరుల జీవనం లో నాణ్యత ను వృద్ధి చెందింప చేయడం కోసం బ్లాక్ స్థాయి లో పరిపాలన ను మెరుగు పరచాలి అనేది దీని యొక్క ధ్యేయం గా ఉంది. దీనిని దేశం లో 329 జిల్లాల లోని 500 మహత్వాకాంక్షయుక్త బ్లాకుల లో అమలు పరచడం జరుగుతోంది. అస్పై రేశనల్ బ్లాక్స్ ప్రోగ్రాము ను అమలు పరచడం, అలాగే ఒక ప్రభావవంతం అయిన బ్లాకు అభివృద్ధి వ్యూహాన్ని తయారు చేయడం కోసం దేశమంతటా పల్లె స్థాయి లో మరియు బ్లాకు స్థాయి లో చింతన్ శిబిరాల ను నిర్వహించడం జరిగింది. ఈ తరహా చింతన్ శిబిరాల కు సంబంధించిన ముగింపు ఘట్టమే ‘సంకల్ప్ సప్తాహ్’.
‘సంకల్ప్ సప్తాహ్’ ను మొత్తం 500 మహత్వాకాంక్షయుక్త బ్లాకుల లో పాటించడం జరుగుతుంది. 2023 అక్టోబరు 3 వ తేదీ మొదలుకొని 9వ తేదీ వరకు ‘సంకల్ప్ సప్తాహ్’ ను ప్రతి రోజూ ఒక నిర్దిష్ట అభివృద్ధి సంబంధి ఇతివృత్తాని కి అంకితమివ్వడం జరుగుతుంది; ఆ ఇతివృత్తాన్ని ఆధారం గా చేసుకొని మహత్వాకాంక్షయుక్త బ్లాకులు అన్నీ పని చేస్తాయి. మొదటి ఆరు రోజుల కు తీసుకొన్న ఇతివృత్తాల లో ‘సంపూర్ణ ఆరోగ్యం’, ‘సుపోషిత కుటుంబం’, ‘స్వచ్ఛత’, ‘వ్యవసాయం’, ‘విద్య’, ఇంకా ‘సమృద్ధి దినం’ లు ఉన్నాయి. సప్తాహ్ చివరి రోజు న అంటే 2023 అక్టోబరు 9 వ తేదీ న మొత్తం ఏడు రోజుల లో చేసిన పనుల ను స్మరించుకొంటూ, ‘సంకల్ప్ సప్తాహ్ - సమావేశ్ సమారోహ్’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
భారత్ మండపం లో ప్రారంభిక కార్యక్రమం లో దేశవ్యాప్తం గా దాదాపు 3,000 మంది పంచాయతీ లు మరియు బ్లాకు స్థాయి ప్రజాప్రతినిధులు, ఇంకా కార్యకర్తలు పాలుపంచుకోనున్నారు. దీనికి అదనం గా, బ్లాకు స్థాయి కార్యకర్తలు, పంచాయతీ స్థాయి కార్యకర్తలు, రైతులు, ఇంకా వివిధ రంగాల కు చెందిన వ్యక్తులు సహా సుమారు రెండు లక్షల మంది వర్చువల్ మాధ్యం ద్వారా ఈ కార్యక్రమం తో జతపడతారు.
***
(Release ID: 1962561)
Visitor Counter : 110
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam