సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండెన్సీని తగ్గించడానికి శుక్రవారం కేంద్రమంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యేక ప్రచారం 3.0ని ప్రారంభించనున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని అనుబంధ/సహాయక/క్షేత్ర కార్యాలయాలు /దౌత్య కార్యాలయాలు/రక్షణ సంస్థలు మరియు సంస్థలు/ కార్యాలయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ప్రచార ప్రారంభోత్సవం న్యూఢిల్లీలోని DARPG కార్యాలయం జవహర్ వ్యాపార్ భవన్ లో జరుగుతుంది.


ప్రత్యేక ప్రచారం 3.0 2023 అక్టోబర్ 2 నుండి 31 అక్టోబర్ 2023 వరకు జరుగుతుంది. ప్రజా ఫిర్యాదులు, పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు , అంతర్-మంత్రిత్వ సంప్రదింపులు మరియు పార్లమెంటరీ హామీలు మరియు రద్దుచేసిన అంశాల నుండి సకాలంలో , ప్రభావవంతమైన పరిష్కారాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక ప్రచారం ఉంటుంది.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సుదూర మరియు మారుమూల ప్రాంతాల నుండి 1.6 లక్షలకు పైగా సైట్లను గుర్తించడం జరిగిందని , 20.20 లక్షల భౌతిక ఫైళ్లను మరియు ప్రత్యేక ప్రచారం 3.0 కోసం మంత్రిత్వ శాఖలు/విభాగాలలో సమీక్ష కోసం 2.27
లక్షల ఈ-ఫైళ్లు గుర్తించామని తెలిపారు.

Posted On: 28 SEP 2023 1:54PM by PIB Hyderabad

        సైన్స్ & టెక్నాలజీ, MoS ప్రధానమంత్రి కార్యాలయం , సిబ్బంది , ప్రజా ఫిర్యాదులు   మరియు  పింఛన్లు , అను ఇంధనం మరియు అంతరిక్ష శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)  డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో DARPG కార్యాలయం ఉన్న జవహర్ వ్యాపార్ భవన్‌లో  శుక్రవారం ప్రత్యేక ప్రచారం ప్రారంభిస్తారు. ఈ ప్రచారంలో  దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అనుబంధ/సహాయక/క్షేత్ర కార్యాలయాలు /దౌత్య కార్యాలయాలు/రక్షణ సంస్థలు మరియు సంస్థలు/ కార్యాలయాలపై దృష్టిసారిస్తారు.

     అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాల నోడల్ అధికారులు  ప్రత్యేక ప్రచారం 3.0  ప్రారంభానికి నోడల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  హాజరవుతారు. ప్రత్యేక ప్రచారం 3.0ని అద్భుతంగా విజయవంతం చేసేందుకు DARPG చేసిన సన్నాహాలను పర్యవేక్షించడానికి ప్రారంభోత్సవానికి ముందు న్యూ ఢిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్‌లోని DARPG కార్యాలయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్శిస్తారు.

        అక్టోబర్ 2 నుండి 31 అక్టోబర్ 2023 వరకు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా  పార్లమెంట్ సూచనలు, ప్రధానమంత్రి కార్యాలయ  సూచనలు, కేంద్ర క్యాబినెట్ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ప్రజా ఫిర్యాదులు, నియమాలు/ ప్రక్రియల సడలింపు, సమీక్షకు తీసుకున్న ఫైళ్లు, పరిశుభ్రత ప్రచారోద్యమ సైట్లు, సడలింపునకు గుర్తించిన  నియమాల వంటి అపరిష్కృతంగా ఉన్న  అన్ని విభిన్న కేటగిరీల పెండెన్సీపై సమీక్ష మొదలైనవి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలోని అన్ని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో  ప్రచార కాలంలో నిర్వహించడం జరుగుతుంది.

       అదే సమయంలో , ఆగస్టు 2023కు  సంబంధించి ‘సచివాలయ  సంస్కరణల’ నెలవారీ నివేదికను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు.  ఆగస్టు ప్రగతి నివేదికలో కేంద్ర సచివాలయంలో ‘నిర్ణయాత్మకతలో సామర్థ్యాన్ని పెంచడం’ అనే ఉపక్రమణ కింద క్రమబద్ధమైన కార్యకలాపాల్లో భాగంగా, మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో పెండింగ్ తగ్గించడానికి ఆగస్టు 2023 నెలలో
చేపట్టిన పనుల నివేదిక ఉంటుంది.  

        భారత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత మరియు సంతృప్తత  విధానంతో పెండెన్సీని తగ్గించడంపై దృష్టి సారించి పరిష్కరించే ఉద్దేశంతో 2 అక్టోబర్, 2023 నుండి 31 అక్టోబర్, 2023 వరకు ప్రత్యేక ప్రచారం  3.0 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక ప్రచారం నేపథ్యంలో 25 ఆగస్టు, 2023న కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ భారత  ప్రభుత్వ కార్యదర్శులందరినీ ఉద్దేశించి ప్రసంగించారు.  మరియు DARPG ప్రత్యేక ప్రచారానికి 1 సెప్టెంబర్, 2023న మార్గదర్శకాలను  ప్రభుత్వం జారీ చేసింది. ప్రచారం సన్నాహక దశను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర ప్రసాద్ 14 సెప్టెంబర్ 2023న నేషనల్‌లో మీడియా సెంటర్ లో ప్రారంభించారు.

       సన్నాహక దశలో, అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రత్యేక ప్రచారం 3.0 పోర్టల్ (https://scdpm.nic.in)లో తమ లక్ష్యాలను తాజాపరుస్తాయి (అప్ డేట్) .  స్వచ్ఛత సమీక్ష కోసం 1.6 లక్షలకు పైగా సైట్లు, 20.20 లక్షల భౌతిక ఫైళ్లు మరియు 2.27 లక్షల ఈ-ఫైళ్లను  గుర్తించడం జరిగింది.  పెండింగ్‌లో ఉన్న 3300 ఎంపీల సూచనలు, 800 పార్లమెంటరీ హామీలు, 60 సంస్థాగత నిర్వహణ కమిటీ సూచనలు, 340 రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మరియు 550 ప్రధానమంత్రి కార్యాలయ సూచనలు అమలు దశలో పరిష్కరించడానికి గుర్తించడం జరిగింది.  మంత్రిత్వ శాఖలు/విభాగాలు  ప్రచారం అమలు దశలో నివృత్తి చేయాల్సిన  సుమారు 1.87 లక్షల ప్రజా ఫిర్యాదులను కూడా గుర్తించాయి.

        ప్రత్యేక ప్రచారం 3.0 అమలుకు పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ నోడల్ విభాగంగా ఉంటుంది.  ప్రత్యేక ప్రచారం 3.0 అమలు దశ ప్రత్యేక ప్రచారం 3.0ను గౌరవనీయ మంత్రి ప్రారంభించడంతో మొదలవుతుంది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు తాము సాధించిన విజయాల సమాచారాన్ని పోర్టల్‌లో  క్రమపద్ధతిలో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ పోర్టల్ అక్టోబర్ 31, 2023 వరకు తెరిచి ఉంటుంది.  ఈ సమయంలో మంత్రిత్వ శాఖలు/విభాగాలు పెండింగ్‌ను పరిష్కరిస్తాయి.   సన్నాహక దశలో పర్యవేక్షించగల పారామితులలో గుర్తించిన లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాయి.

 

***


(Release ID: 1962548) Visitor Counter : 95