గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పదిహేను జియో-హెరిటేజ్ సైట్లలో స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా


2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 ని ప్రారంభించనున్న జీఎస్ఐ

Posted On: 27 SEP 2023 4:14PM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా, పరిశుభ్రతను పెంపొందించడం, పెండెన్సీని తగ్గించడం, స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డు నిర్వహణ, భౌతిక రికార్డులను డిజిటలైజ్ చేయడం మొదలైనవి చేపట్టాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిర్ణయించింది. గనుల మంత్రిత్వ శాఖ కింద జీఎస్ఐ దేశవ్యాప్తంగా పదిహేను జియోహెరిటేజ్ సైట్లలో స్వచ్ఛతా డ్రైవ్‌ను నిర్వహించాలని యోచిస్తోంది.

అక్టోబర్ 2022లో స్పెషల్ క్యాంపెయిన్ 2.0 కింద, జీఎస్ఐ దేశవ్యాప్తంగా తన కార్యాలయాల్లో 89 స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించింది.  2,25,135  పాత ఫైళ్లు  తొలగించింది. స్క్రాప్ ని విక్రయించడం ద్వారా రూ.1,58,69,544/- ఆదాయాన్ని ఆర్జించింది.

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి,  జీఎస్ఐ 15.09.2023న స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని ప్రారంభించింది. జాతిపిత జన్మదినోత్సవంఅక్టోబర్ 2న జరిగే స్వచ్ఛతా దివస్‌లో తన క్షేత్ర స్థాయి, అవుట్‌స్టేషన్ కార్యాలయాల్లో వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది. 

సామాన్య ప్రజలలో పరిశుభ్రత స్ఫూర్తిని వ్యాప్తి చేయడానికి, దేశంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశాలను సంరక్షించవలసిన ఆవశ్యకతపై వారికి అవగాహన కల్పించడానికి జియోహెరిటేజ్ సైట్‌లలో 2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు ప్రత్యేక ప్రచార 3.0ని ప్రారంభించేందుకు జీఎస్ఐ సిద్ధమవుతోంది. ఈ ప్రచారం రాష్ట్రాలకు అపారమైన పర్యాటక అవకాశాలను సృష్టించడానికి, ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేయడానికి కూడా సహాయపడుతుంది.

అక్టోబర్ 2న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో నిఘోజ్ -నేచురల్ పాథోల్స్ జియోహెరిటేజ్ సైట్‌తో ప్రారంభించి, ఈ ప్రచార సమయంలో స్వచ్ఛత డ్రైవ్ కోసం జీఎస్ఐ మొత్తం పదిహేను జియో-హెరిటేజ్ సైట్‌లను (అనుబంధం-1) గుర్తించింది.

జియో-హెరిటేజ్ సైట్ ల గురించి.... 

భారతదేశం గొప్ప వారసత్వం దాని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో  ఉత్కంఠభరితమైన అందమైన, విభిన్నమైన నిర్మాణ శైలులను మాత్రమే కాకుండా మంత్రముగ్దులను చేసే, సుందరమైన భౌగోళిక స్మారక చిహ్నాలు, ప్రకృతి దృశ్యాలను కూడా కలిగి ఉంది. ప్రకృతి ఈ గంభీరమైన సృష్టిలు ఉపరితలంపై అలాగే భూమి యొక్క లోతైన భాగంలో పనిచేసే వివిధ భౌగోళిక ప్రక్రియల దృష్టాంతాలుగా పరిగణించబడతాయి. ఈ విశిష్ట భౌగోళిక స్వరూప లక్షణాలు జియో-హెరిటేజ్ సైట్‌లుగా పేర్కొంటారు.  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోసైంటిఫిక్ సర్వే, రీసెర్చ్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది, ఈ సైట్‌లను భవిష్యత్తు తరాలకు సంరక్షించేందుకు చేస్తున్న కృషి దేశానికి ఎంతో గర్వకారణం.

జియోపార్క్‌లు, స్మారక చిహ్నాలుగా ప్రకటించిన ప్రాంతాలలో జియో-టూరిజం ద్వారా జియోలాజికల్ హెరిటేజ్ సైట్‌ల ప్రజాదరణను ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా ఆచరణలో ఉంది, వాటిని సహజ క్షీణత, మానవజన్య జోక్యాల నుండి రక్షించడానికి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో అసాధారణమైన భౌగోళిక ప్రాముఖ్యత లేదా అద్భుతమైన భౌగోళిక వ్యక్తీకరణ ప్రదేశాలను గుర్తించి, వాటి పరిరక్షణ గురించి అవగాహన కల్పించే బాధ్యతను స్వయంగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు, జీఎస్ఐ అటువంటి మొత్తం 92 జియో-హెరిటేజ్ సైట్‌లను గుర్తించింది. వీటిలో కొన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా గుర్తించబడ్డాయి.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 1851లో రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను కనుగొనడం కోసం ఏర్పాటు అయింది. సంవత్సరాలుగా,జీఎస్ఐ దేశంలోని వివిధ రంగాలలో అవసరమైన జియో-సైన్స్ సమాచార భాండాగారంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌగోళిక-శాస్త్రీయ సంస్థ హోదాను కూడా పొందింది. దీని ప్రధాన విధులు జాతీయ భౌగోళిక శాస్త్ర సమాచారం, ఖనిజ వనరుల అంచనాను రూపొందించడం, నవీకరించడం. ఈ లక్ష్యాలను భూ సర్వేలు, గాలి, సముద్ర సర్వేలు, ఖనిజ పరిశీలన, పరిశోధనలు, బహుళ-క్రమశిక్షణా భౌగోళిక, జియో-టెక్నికల్, జియో-పర్యావరణ, సహజ ప్రమాదాల అధ్యయనాలు, అలాగే హిమానీనదం, భూకంప-టెక్టోనిక్,  ప్రాథమిక భౌగోళిక శాస్త్ర ఇతర శాఖల ద్వారా సాధించవచ్చు.

జీఎస్ఐ, కోల్‌కతాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది, లక్నో, జైపూర్, నాగ్‌పూర్, హైదరాబాద్, షిల్లాంగ్, కోల్‌కతాలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. జీఎస్ఐ అనేది గనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కార్యాలయం.

 

అనుబంధం-I 

ప్రత్యేక ప్రచారం-3.0 కోసం ఎంచుకున్న జియోహెరిటేజ్/జియోటూరిజం సైట్‌ల జాబితా:

                

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

సైట్ పేరు 

కార్యక్రమం ప్రతిపాదిత  తేదీ 

ఉత్తర ప్రాంతం 

01

ఉత్తరప్రదేశ్ 

సల్ఖాన్ ఫాసిల్ పార్క్ 

1అక్టోబర్ 18, 2023

దక్షిణ ప్రాంతం 

02

కర్ణాటక 

మారడిహళ్ళి పిల్లో లావా 

అక్టోబర్ 5, 2023

03

పైరోక్లాస్టిక్స్&పిల్లో లావా, పెద్దపల్లి-కోలార్ బంగారు గని 

అక్టోబర్ 19, 2023

04

కేరళ 

అంగడిపురం లేటరైట్

అక్టోబర్ 6, 2023

05

ఆంధ్రప్రదేశ్ 

వజ్రకరూర్ కింబర్‌లైట్ ఫీల్డ్

అక్టోబర్ 30, 2023

06

తమిళనాడు 

చార్నోకైట్, సెయింట్ థామస్ మౌంట్

అక్టోబర్ 4, 2023

07

సత్తనూర్ నేషనల్ ఫాసిల్ వుడ్ పార్క్

అక్టోబర్ 27, 2023

తూర్పు ప్రాంతం 

08

బీహార్ 

బరాబర్ గుహలు

అక్టోబర్ 9, 2023

09

ఝార్ఖండ్ 

దూథి నాలా 

అక్టోబర్ 10, 2023

పశ్చిమ ప్రాంతం 

10

రాజస్థాన్ 

కిషన్‌గర్ నెఫెలైన్ సైనైట్

అక్టోబర్ 13, 2023

11

గుజరాత్ 

ఎడ్డీ కరెంట్ మార్కింగ్, కడన ఆనకట్ట

అక్టోబర్ 16, 2023

సెంట్రల్ ప్రాంతం 

12

మధ్యప్రదేశ్ 

భేదాఘాట్ మార్బుల్ రాక్స్ 

అక్టోబర్ 17, 2023

13

మహారాష్ట్ర 

నిఘోజ్-సహజ గుంతలు

అక్టోబర్ 2, 2023

ఈశాన్య ప్రాంతం 

14

మేఘాలయ 

మవ్మ్లూ గుహ

అక్టోబర్ 26, 2023

15

త్రిపుర 

రాతి చిత్రాలు, ఉనకోటి

అక్టోబర్ 25, 2023

***


(Release ID: 1962541) Visitor Counter : 87


Read this release in: English , Khasi , Urdu , Hindi