ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోని అహమదాబాద్ లో సైన్స్ సిటీ ని సందర్శించిన ప్రధాన మంత్రి

Posted On: 27 SEP 2023 2:10PM by PIB Hyderabad

గుజరాత్ లోని అహమదాబాద్ లో గల సైన్స్ సిటీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. ఈ సందర్భం లో ఆయన రోబోటిక్స్ గేలరీ ని, నేచర్ పార్కు ను, అక్వేటిక్ గేలరీ ని, ఇంకా శార్క్ టనల్ ను చూశారు, అలాగే ప్రదర్శన ను కూడా చూశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో కొన్ని ట్వీట్ లలో ఈ క్రింది విధం గా తన మనోభావాల ను వెల్లడి చేశారు :

‘‘ఈ రోజు న ఉదయం పూట గుజరాత్ సైన్స్ సిటీ లో కనులపండుగ గా ఉన్న అనేక దృశ్యాల ను చూశాను. మొదట గా రోబోటిక్స్ గేలరీ కి వెళ్ళాను, అక్కడ రోబోటిక్స్ యొక్క అపారమైనటువంటి సంభావ్యతల ను ఎంతో చక్కగా ప్రదర్శన కు ఉంచడం జరిగింది. ఈ సాంకేతికత లు ఏ విధం గా యువతీ యువకుల లో ఆసక్తి ని రేకెత్తిస్తున్నదీ గమనించినప్పుడు సంతోషం కలిగింది.’’

‘‘డిఆర్ డిఒ రోబో లు, మైక్రోబాట్స్, ఒక వ్యవసాయ ప్రధానమైన మరమనిషి, మెడికల్ రోబోలు, స్పేస్ రోబో లతో పాటు మరెన్నింటినో రోబోటిక్స్ గేలరీ లో ప్రదర్శించడమైంది. ఈ సమ్మోహక ప్రదర్శన ల మాధ్యం ద్వారా, ఆరోగ్య సంరక్షణ, తయారీ మరియు నిత్య జీవనం లో రోబోటిక్స్ యొక్క పరివర్తనాత్మకమైనటువంటి శక్తి స్పష్టం గా అగుపించింది.’’

‘‘రోబోటిక్స్ గేలరీ లో ఉన్న కేఫె లో మరమనిషి తీసుకు వచ్చి అందించిన ఒక కప్పు తేనీటి ని కూడా సేవించి ఆనందించాను.’’

‘‘సందడి గా ఉన్న గుజరాత్ సైన్స్ సిటీ లో నేచర్ పార్క్ ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన స్థలం లా తోచింది. ప్రకృతి ప్రేమికులు మరియు వృక్ష వైజ్ఞానికులు చూసితీరవలసిన చోటు ఇది. ఈ ఉద్యానం జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా ప్రజల కు విషయాల ను నేర్చుకొనేటటువంటి వేదిక వంటిది గా కూడాను ఉన్నది.’’

 

‘‘అమిత శ్రద్ధ తో దిద్ది తీర్చినట్లు ఉన్న నడక మార్గాల గుండా సాగిపోతుంటే దారి మధ్యలో వివిధ అనుభవాలు ఎదురు అవుతాయి. అది పర్యావరణ సంరక్షణ మరియు స్థిరత్వానికి సంబంధించిన విలువైన పాఠాల ను అందించేది గా ఉంది. కేక్టస్ గార్డెన్, బ్లాక్ ప్లాంటేశన్, ఆక్ సిజన్ పార్కు మరియు ఇతర ఆకర్షణీయమైన ప్రదేశాల ను కూడా తప్పక చూడగలరు.’’

‘‘సైన్స్ సిటీ లో అక్వేటిక్ గేలరీ జల చరాల కు సంబంధించిన జీవ వైవిధ్యాన్ని మరియు సముద్ర సంబంధి అద్భుతాల ను కళ్ళ కు కడుతుంది. అది మన జలచర సంబంధి ఇకోసిస్టమ్స్ తాలూకు నాజూకు గా ఉంటూనే గతిశీలమైనటువంటి సంతులనాన్ని చాటిచెప్తున్నది. ఆ గేలరీ ని సందర్శించడమనేది మనకు నేర్చుకొనే అనుభూతి ని ఇవ్వడం ఒక్కటే కాకుండా సముద్రం లోపలి జగత్తు ను సంరక్షించుకోవాలని, అలాగే ప్రగాఢమైన గౌరవాన్ని కనబరచాలని కూడా సూచిస్తున్నది.’’

 

 

శార్క్ టనల్ సొర చేప ల తాలూకు వేరు వేరు జాతుల ను గురించి తెలియజెప్పే రోమాంచకమైన అవకాశం అని చెప్పాలి. మీరు సొరంగ మార్గం గుండా నడచి వెళ్లడం మొదలుపెట్టీ మొదలుపెట్టడం తోనే సాగర జీవనం యొక్క వివిధత్వాన్ని చూసి ఆశ్చర్య చకితులు అయిపోవడం మీ వంతు అవుతుంది. అది మనస్సుల ను ఆకట్టుకొనే విధం గా ఉంది సుమా.’’

 

‘‘ఇది సుందరంగా ఉంది.’’

గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ లు ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ని అనుసరించారు.

*****

DS/TS



(Release ID: 1961267) Visitor Counter : 75