ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిత్ శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ కు జయ్ పుర్ లోని ధానక్యా లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 SEP 2023 9:13PM by PIB Hyderabad

జయ్ పుర్ లోని ధానక్యా లో గల దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ స్మారక కట్టడం లో ఈ రోజు న పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు. ‘‘మా ప్రభుత్వం అంత్యోదయ యొక్క సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ దేశం లో నిరుపేదల యొక్క జీవనాన్ని సరళతరం గా మలచడాని కి కంకణం కట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘’జయ్ పుర్ లోని ధానక్యా లో ఈ రోజు న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ స్మారకాని కి వెళ్ళి ఆయన కు పుష్పాంజలి ని సమర్పించాను. ఆయన జయంతి సందర్భం లో అక్కడ ఆయన జీవనం తో ముడిపడ్డ వివిధ పార్శ్వాల ను నేను గమనించినప్పుడు ఒక క్రొత్త శక్తి నాకు అనుభవం లోకి వచ్చింది. ఆయన యొక్క అంత్యోదయ సిద్ధాంతం బాట లో సాగుతూ దేశం లో నిరుపేద ల జీవనాన్ని సరళతరం గా మార్చాలని మా ప్రభుత్వం కంకణం కట్టుకొంది.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1960954) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam