వ్యవసాయ మంత్రిత్వ శాఖ

హిమాలయాలలో వినూత్న కోల్డ్ చైన్ కాన్క్లేవ్: జె&కె ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేయనున్న ఎన్‌సిసిడి

Posted On: 25 SEP 2023 2:12PM by PIB Hyderabad

సహకార కృషిలో విశేషమైన ప్రదర్శనతో నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్‌మెంట్ (ఎన్‌సిసిడి) నేతృత్వంలోని వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కోల్డ్ చైన్ వాటాదారులను చైతన్యవంతం చేయడానికి తన ప్రత్యేక మిషన్‌ను కొనసాగిస్తోంది.ఆ సంస్థ ఇటీవలి ప్రయత్నంలో అద్భుతమైన విజయం జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో  నిర్వహించిన ఇండియా కోల్డ్ చైన్ కాంక్లేవ్. ఇది వారి అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

 

image.png


ప్రధాన కార్యదర్శి డా.అరుణ్ కుమార్ మెహతా మరియు గవర్నర్  సలహాదారు శ్రీ రాజీవ్ రాయ్ భట్నాగర్ వంటి ప్రముఖులతో సహా దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరైన ఈ విశిష్ట సమ్మేళనం నిర్మాణాత్మక సంభాషణలు మరియు విజ్ఞాన మార్పిడికి వేదికగా నిలిచింది. సెప్టెంబరు 20న నిర్వహించబడిన ఈ మహాసభకు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ జె.ఎస్(హార్టికల్చర్) ప్రియా రంజన్ వర్మ హాజరవడం మరింత శోభను తెచ్చింది. ఎన్‌సిసిడి సిఓఓ శ్రీ అషీష్ ఫోతేదార్; డైరెక్టర్ హార్టికల్చర్ కాశ్మీర్ శ్రీ. గులాం రసూల్; చైర్మన్ పిహెచ్‌డిసిసిఐ-కాశ్మీర్, వైస్ ఛాన్సలర్ ఎస్‌కెయుఏఎస్‌టి-కె శ్రీ. గనాయ్ మరియు పలువురు సంబంధిత అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా ఈ ముఖ్యమైన సమ్మేళనాన్ని శ్రీనగర్‌కు తీసుకువచ్చిన విధానాన్ని ప్రశంసించారు మరియు సాగుదారులకు ప్రయోజనం చేకూర్చడానికి లోయలో సిఏ స్టోర్‌ల సామర్థ్యాన్ని పెంచాలని చెప్పారు. గవర్నర్ సలహాదారు ఎస్. రాజీవ్ రాయ్ భట్నాగర్ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపారు మరియు రైతులు, సాగుదారులు మరియు సిఏ ఎంటర్‌ప్రైజ్‌లకు పూర్తి సహాయాన్ని అందించారు.

జాయింట్ సెక్రటరీ (హార్టికల్చర్) శ్రీ.ప్రియా రంజన్ సస్టైనబుల్ కోల్డ్ చైన్ యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఇంధన, సాంకేతికత, వాతావరణంపై దృష్టి సారించి కోల్డ్ చైన్ సెక్టార్ అభివృద్ధిని ఎన్‌సిసిడి ఎలా ప్రోత్సహిస్తోంది అలాగే దాని వలన కేంద్రపాలిత ప్రాంతమైన జె&కెకి మరిన్ని పెట్టుబడుల అవకాశాలు ఎలా వస్తాయో వివరించారు.

 

image.pngimage.png


సంయుక్త కార్యదర్శి శ్రీ. ప్రియా రంజన్ హిమాలయ ప్రాంతంలో స్థిరమైన కోల్డ్ చైన్ డెవలప్‌మెంట్  అత్యవసర అవసరాన్ని స్పష్టం చేశారు. సమగ్ర మార్గదర్శకాలను ఏర్పాటు చేయడంలో మరియు విస్తృతమైన అధ్యయనాలు, అవగాహన ప్రచారాలు మరియు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో సాధించిన పురోగతిని ఆయన నొక్కి చెప్పారు. పెరుగుతున్న ప్రపంచ జనాభా కారణంగా వనరులు ముప్పులో ఉన్న ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సమిష్టి ప్రయత్నాలు చాలా కీలకమైనవని చెప్పారు.

సవాళ్లతో నిండిన భవిష్యత్తు అంచు వద్ద మనం నిలబడి ఉన్నందున పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక పురోగతిని సమతుల్యం చేయడం అత్యవసరం. సుస్థిర అభివృద్ధి యొక్క దృష్టి లోతుగా ప్రతిధ్వనిస్తుంది, పురోగతి మరియు మన విలువైన పర్యావరణ వ్యవస్థల రక్షణ మధ్య సామరస్యపూర్వకమైన సహజీవనం కోసం ఒక బ్లూప్రింట్‌ను అందిస్తోందని వివరించారు.

వేగవంతమైన సాంకేతిక పురోగతి మరియు వినియోగదారుల అంచనాలను పెంచే ఈ యుగంలో కోల్డ్ చైన్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణ స్పృహ మరియు ఇంధన సమర్థవంతమైన శీతలీకరణ పరిష్కారాలతో పాడైపోయే వస్తువుల సమగ్రతను కాపాడటం చాలా ముఖ్యమైనది. వాతావరణ మార్పు ఆందోళనలను పరిష్కరించడం మరియు మన పర్యావరణంపై సంప్రదాయ రిఫ్రిజెరాంట్ల ప్రభావాన్ని తగ్గించడం అనే ఆవశ్యకత ఎన్నడూ లేనంతగా ఉంది.

ఎన్‌సిసిడి సిఓఓ శ్రీ.అషీష్ ఫోతేదార్ కోల్డ్ చైన్ అభివృద్ధిలో ఎన్‌సిసిడి అవిశ్రాంతంగా చేస్తున్న కృషి గురించి మరియు లోయలోని కోల్డ్ చైన్ యొక్క స్థిరమైన అభివృద్ధిని అందించడానికి ఎన్‌సిసిడి ద్వారా ఈ ఈవెంట్‌ను రూపొందించి శ్రీనగర్‌కు తీసుకురావడం గురించి మాట్లాడారు. ఇది గత  ఆరేడు సంవత్సర కాలంలో అపూర్వమైన వృద్ధిని సాధించింది.

డైరెక్టర్ హార్టికల్చర్ ఎన్‌సిసిడి సిఓఓతో పాటు  రైతుల ప్రయోజనం కోసం సృష్టించబడిన మౌలిక సదుపాయాలను చూడటానికి పాంపోర్‌లోని ఐఐకెఎస్‌టిసిని సందర్శించారు మరియు కుంకుమపువ్వు రంగం యొక్క సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

జెఎస్ (హార్టికల్చర్,ఎంఓఏ&ఎఫ్‌డబ్ల్యూ) సమర్థ మార్గదర్శకత్వంలో శ్రీ. ప్రియా రంజన్‌తో పాటు శ్రీ. ఆశీష్ ఫోతేదార్, ఎన్‌సిసిడి సిఓఓ, డైరెక్టర్ హార్టికల్చర్  దక్షిణాసియాలో ఆధునిక సిఎ స్టోర్‌లకు ప్రధాన కేంద్రంగా మారిన ఐజిసి-లస్సిపోరాను మీర్ సందర్శించి రైతుల ప్రయోజనం కోసం తీసుకున్న పరివర్తనాత్మక పురోగతికి సాక్ష్యమిచ్చారు.

ఈ ప్రయోగాత్మక విధానం వాక్చాతుర్యాన్ని మించిన పురోగతి పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది, వారి చొరవ యొక్క స్పష్టమైన ప్రభావాన్ని నొక్కి చెబుతుంది.

డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ.మీర్‌తో పాటు శ్రీ ప్రియా రంజన్  సెప్టెంబర్ 20, 2023న ఎస్‌కిఐసిసిలో ముగిసిన 1వ ఇండియా కోల్డ్ చైన్ కాన్‌క్లేవ్ – హిమాలయన్ చాప్టర్‌కు అమూల్యమైన మద్దతు ఇచ్చినందుకు జెకెపిఐసిసిఏకి ఆశీష్ ఫోతేదార్ కృతజ్ఞతలు తెలిపారు. లోయలో స్థిరమైన కోల్డ్ చైన్ డెవలప్‌మెంట్ కోసం వారి సామూహిక దృక్పథాన్ని ఉజ్వలమైన, మరింత పర్యావరణ స్పృహతో కూడిన భవిష్యత్తు కోసం ఆశాదీపం అని శ్రీ.ప్రియా రంజన్  కొనియాడారు.

అసోసియేషన్, కోల్డ్ చైన్ యజమానులు, సాగుదారులు మరియు ఇతర వాటాదారులకు తిరుగులేని మద్దతు మరియు సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఎన్‌సిసిడి కట్టుబడి ఉందని, ఈ ప్రాంతంలో కోల్డ్ చైన్ సెక్టార్ యొక్క నిరంతర వృద్ధికి భరోసా ఇస్తుందని శ్రీ అషీష్ ఫోతేదార్ పునరుద్ఘాటించారు.

జెకెపిఐసిసిఏ అధ్యక్షుడు, శ్రీ.మాజిద్ వఫాయ్, శ్రీ.ఇజాన్ జావీద్ మరియు లోయలోని ఇతర యువ పారిశ్రామికవేత్తలు కాశ్మీర్ లోయలో జాతీయ స్థాయి సమావేశాన్ని తీసుకువచ్చినందుకు ఎన్‌సిసిడికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్‌సిసిడి ఈ సమావేశం కోసం అంతర్జాతీయ స్పీకర్లు, ఆర్థిక సంస్థలు, ఇంధన నిపుణులు మొదలైన వారిని కాశ్మీర్‌కు తీసుకువచ్చి, సిఎ స్టోర్స్ వ్యాలీ అభివృద్ధిని అంతర్జాతీయ మ్యాప్‌లో ఉంచింది. కోల్డ్ చైన్ పరిశ్రమలో జరుగుతున్న ప్రపంచ మార్పులకు పరిమిత ప్రాప్యత ఉన్న స్థానిక రైతులు, పెంపకందారులు, సంస్థల ప్రయోజనం కోసం కాశ్మీర్‌లో ఈ కార్యక్రమాన్ని వార్షిక కార్యక్రమంగా చేయాలని అధ్యక్షుడు జెకెపిఐసిసిఏని అభ్యర్థించారు. లోయలోని అతిపెద్ద స్థానిక కోల్డ్ చైన్ ఎంటర్‌ప్రైజ్‌కు జెకెపిఐసిసిఏని ప్రాతినిధ్యం వహిస్తుందని మరియు తదుపరి ఈవెంట్‌ను జెకెపిఐసిసిఏని నిర్వహించడానికి అనుమతించాలని కూడా ఎన్‌సిసిడిని అభ్యర్థించింది.

ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్‌సిసిడి తీవ్రంగా కృషి చేస్తోందని ఈ పరిశ్రమను మరింత శక్తివంతం చేయాలనే స్థానిక రైతులు, పెంపకందారులు మరియు ఎన్‌సిసిడిల దృష్టిలో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన సమయంలో దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సిఓఓ ఎన్‌సిసిడి హామీ ఇచ్చారు.

కాన్క్లేవ్‌కు జెకెపిఐసిసిఏని డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్,బిఈఈ మరియు ఐఎస్‌హెచ్‌ఏఈతో సహా కీలక భాగస్వాముల నుండి అమూల్యమైన మద్దతు లభించింది. ఇవన్నీ కార్యక్రమం అద్భుతమైన విజయానికి దోహదపడ్డాయి. ఈ సమిష్టి కృషి భారతదేశంలో స్థిరమైన కోల్డ్ చైన్ డెవలప్‌మెంట్ పోషించే కీలక పాత్రకు పెరుగుతున్న గుర్తింపును నొక్కి చెబుతుంది.

 

****



(Release ID: 1960764) Visitor Counter : 102