రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఓ క్యాజువల్ పెయిడ్ లేబర్‌ మృతదేహాలను ను స్వస్థలానికి పంపేలా ఏర్పాట్లు


- బీఆర్ఓ సిబ్బంది మాదిరిగా మృత దేహాలను భద్రపరచడం, రవాణాకూ వెసులుబాటు

- ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
- బీఆర్ఓ ప్రాజెక్ట్‌లలో విధులు నిర్వహిస్తూ మరణించిన సీపీఎల్ల అంత్యక్రియల వ్యయం రూ.1000 నుండి రూ.10,000కి పెంపు
- మృత దేహాలను రవాణా చేయడానికి & అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది

Posted On: 24 SEP 2023 10:05AM by PIB Hyderabad

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) సంస్థ ‘జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్’ (జీఆర్ఈఎఫ్) సిబ్బందికి అందుబాటులో ఉన్న ‘ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ది మోర్టల్ రిమైన్స్’ (సిబ్బంది మృత దేహాలను భద్రపరచడం, రవాణా) విషయమై ప్రస్తుత నిబంధనలను ‘సాధారణం చెల్లింపు కార్మికులకూ’ (సీపీఏలకు) పొడిగించేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. సీపీఎల్‌ల అంత్యక్రియల వ్యయాన్ని రూ.1,000 నుంచి రూ.10,000కు పెంచేందుకు ఆయన ఆమోదం తెలిపారు. వర్క్‌సైట్‌లో అంత్యక్రియలు నిర్వహించబడుతున్న బీఆర్ఓ ప్రాజెక్ట్‌లలో ప్రభుత్వ బోనాఫైడ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా సీపీఎల్ మరణించిన సందర్భంలో దీనిని ప్రభుత్వం భరిస్తుంది. సీపీఏలు సరిహద్దు ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కోసం బీఆర్ఓలచే నియమించబడతారు. వారు ప్రతికూల వాతావరణం మరియు కఠినమైన పని పరిస్థితులలో బీఆర్ఓ సిబ్బందితో చేతులు కలిపి పని చేస్తారు. దీని వలన కొన్నిసార్లు ప్రాణనష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు, ప్రభుత్వ ఖర్చుతో మృత దేహాలను భద్రపరచి స్వస్థలాలకు తరలించే సదుపాయం కేవలం జీఆర్ఈఎఫ్ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న సీపీఎల్‌లకు ఈ సౌకర్యం లేకుండా పోయింది. వారు మరణిస్తే రవాణా భారం మృతుల కుటుంబాలపై పడుతుండేవి. ఆర్థిక వనరుల కొరత కారణంగా, మరణించిన వారి కుటుంబం చాలా పరిస్థితులలో విమాన ఛార్జీలు లేదా రోడ్డు రవాణా ఖర్చులను భరించలేకపోతున్నారు. మరణించిన కుటుంబం వారు అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మరణించిన సీపీఎల్ల యొక్క బంధువు/చట్టబద్ధమైన వారసులు, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి బంధువులకు అంత్యక్రియలు చేయడం ద్వారా నివాళులర్పించే అవకాశం లభించదు. రక్షణ మంత్రి బీఆర్ఓ పని ప్రాంతాలను లను సందర్శించినప్పుడు, సీపీఎల్ల కష్టమైన పని పరిస్థితులను వీక్షించారు. వారి సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన సంక్షేమ చర్యలను రూపొందించమని బీఆర్ఓ ని ఆదేశించారు. ఈ కొత్త సంక్షేమ చర్యలు, మరణించిన వారిపై ఆధారపడిన వారు తమ ప్రియమైన వారికి మర్యాదపూర్వకంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తాయి.

***



(Release ID: 1960436) Visitor Counter : 125