గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల సామాజిక తనిఖీ” అనే అంశంపై 2023 సెప్టెంబర్, 26వ తేదీన 2వ జాతీయ సదస్సులో ప్రసంగించనున్న - కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


"పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి సామాజిక తనిఖీని పునర్నిర్మించడం" అనే ఇతివృత్తంతో - సదస్సు


అన్ని పనులు, ఖర్చులపై సాధారణ సామాజిక తనిఖీలు నిర్వహించడానికి గ్రామసభకు హక్కు కల్పించిన - మహాత్మా గాంధీ ఎన్.ఆర్.ఈ.జి.ఏ.

Posted On: 23 SEP 2023 10:03AM by PIB Hyderabad

“గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల సామాజిక తనిఖీ” అనే అంశంపై 2023 సెప్టెంబర్, 26వ తేదీన ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం లో జరిగే  2వ జాతీయ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రసంగించనున్నారు. “పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి సామాజిక తనిఖీని పునర్నిర్మించడం” అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతోంది.  

కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే; కేంద్ర గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి;  కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్;  గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్;  సంయుక్త కార్యదర్శి (మహాత్మా గాంధీ ఎన్.ఆర్.ఈ.జి.ఏ) శ్రీ అమిత్ కటారియాతో పాటు,  మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సామాజిక తనిఖీ కి సంబంధించి తమ అనుభవాలను పంచుకోడానికి ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులు, అధికారులను ఆహ్వానించడం జరిగింది.  రాష్ట్ర సామాజిక తనిఖీ బృందం లోని ఎస్.ఆర్.పి. (స్టేట్ రిసోర్స్ పర్సన్స్), డి.ఆర్.పి. (డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్), బి.ఆర్.పి. (బ్లాక్ రిసోర్స్ పర్సన్స్)తో పాటు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సామాజిక తనిఖీ బృందం డైరెక్టర్లు కూడా పాల్గొంటారు.  వారి అభిప్రాయాలు చర్చలను గొప్పగా మెరుగుపరుస్తాయి, క్షేత్రస్థాయిలో వారు అవలంబించే ఉత్తమ పద్ధతులు ఇతరులు అనుసరించడానికి ఒక నమూనాగా ఉపయోగపడతాయి.

గ్రామసభకు అన్ని పనులు, ఖర్చుల గురించి క్రమం తప్పకుండా సామాజిక తనిఖీలను నిర్వహించే హక్కును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మహాత్మా గాంధీ ఎన్.ఆర్.ఈ.జి.ఏ) కల్పించింది.   ఇది స్వతంత్ర సామాజిక తనిఖీ యూనిట్ల ద్వారా సామాజిక తనిఖీని సులభతరం చేస్తుంది.    అన్ని రికార్డులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పూర్తిగా అందుబాటులో ఉంటాయి.   వాల్ రైటింగ్స్ ద్వారా సులువుగా అందరికీ తెలుస్తుంది.   గ్రామ పంచాయితీలో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల యొక్క గ్రామ సభ ద్వారా సోషల్ ఆడిట్‌ని తప్పనిసరి చేసిన మొదటి చట్టం - మహాత్మా గాంధీ ఎన్.ఆర్.ఈ.జి.ఏ. చట్టం.  అప్పటి నుంచి, ఇది అనేక ఇతర పథకాలలో తప్పనిసరి చేయబడింది.

కేంద్ర ప్రభుత్వం, కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సి.&ఏ.జి) తో సంప్రదింపులు జరిపి, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో సామాజిక తనిఖీలను నిర్వహించే పద్దతి, సూత్రాలను నిర్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల నియమాలు, 2011 ని ప్రకటించింది.  ఇంతవరకు, 28 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు సామాజిక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.  రాష్ట్రం, జిల్లా, బ్లాకు స్థాయిలో అవసరమైన ప్రధాన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం పై ఎస్.ఏ.యు. లు నిరంతరం ఆకట్టుకుంటున్నాయి.

2019 నవంబర్ 13, 14 తేదీల్లో జరిగిన మొదటి జాతీయ సదస్సు వివిజయవంతమైన తర్వాత;  గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించే ఇతర ప్రధాన పథకాలకు కూడా సామాజిక తనిఖీని విస్తరించడం జరిగింది. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో సామాజిక తనిఖీ అమలు స్థితిని సమీక్షించి, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి సామాజిక తనిఖీని పునః నిర్మించవలసిన అవసరం ఉంది.  ఇందుకు సంబంధించి, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ 2వ జాతీయ సదస్సును 2023 సెప్టెంబర్, 26వ తేదీన నిర్వహిస్తోంది.

 

***** 


(Release ID: 1960049) Visitor Counter : 209