పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

రవాణా విప్లవం


తొలి హరిత హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సును 25 సెప్టెంబర్ 2023న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి

Posted On: 23 SEP 2023 11:58AM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, సెప్టెంబర్ 25, 2023న ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో హరిత రవాణా లో ఒక ముఖ్యమైన ముందడుగులో భాగంగా తొలి గహరిత హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సును ప్రారంభించనున్నారు.

 

పునరుత్పాదక శక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన హరిత హైడ్రోజన్  తక్కువ-కార్బన్ మరియు స్వావలంబన ఆర్థిక మార్గాలలో కీలక పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ప్రాంతాలు, కాలాలు మరియు రంగాలకు అతీతంగా హరిత హైడ్రోజన్ ఇంధనంగా లేదా పారిశ్రామిక ఫీడ్‌స్టాక్‌గా బహుళ వినియోగ ప్రవాహాలను దేశీయంగా సమృద్ధిగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను  ఉపయోగించడం లో హరిత హైడ్రోజన్ చొరవ మెరుగైన పాత్ర పోషిస్తుంది. ఇది పెట్రోలియం శుద్ధి, ఎరువుల ఉత్పత్తి, ఉక్కు తయారీ మొదలైన వాటిలో శిలాజ ఇంధనం ఉత్పన్నమైన ఫీడ్‌స్టాక్‌లను నేరుగా భర్తీ చేయగలదు.

 

రవాణా లో నూతన ఆవిష్కరణ :  ఇంధన సెల్స్ శక్తి 

 

ఈ-రవాణా నమూనాలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ముఖ్యమైన భాగంగా అభివృద్ధి చెందుతోంది. హైడ్రోజన్‌ను ఇంధన కణాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఎలెక్ట్రోకెమికల్ ప్రతిచర్య యానోడ్ వద్ద ఇంధనాన్ని (హైడ్రోజన్) మరియు కాథోడ్ వద్ద గాలి నుండి ఆక్సిజన్‌ను నీరుగా మారుస్తుంది తద్వారా ఎలక్ట్రాన్ల రూపంలో విద్యుత్ శక్తిని విడుదల చేస్తుంది. ఇతర రవాణా ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ఇంధన కణాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంధన ఘటాల వాహనాలు బ్యాటరీ వాహనాలతో పోలిస్తే సుదూర శ్రేణి మరియు  ఇంధనం నింపే సమయం తక్కువ వంటి స్వాభావిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. హైడ్రోజన్ వాయువు సాధారణంగా 350 బార్ ఒత్తిడితో సిలిండర్లలో కంప్రెస్ చేయబడి వాహనం లో నిల్వ చేయబడుతుంది.

 

మార్గదర్శక మార్పు: భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్-ఆధారిత ఇంధన సెల్ బస్సులు

 

ఢిల్లీ, హర్యానా మరియు యూ పీ లలో గుర్తించబడిన మార్గాల్లో హరిత హైడ్రోజన్‌తో నడిచే 15 ఫ్యూయల్ సెల్ బస్సుల కార్యాచరణ ట్రయల్స్‌ను చేపట్టేందుకు శాస్త్రీయంగా రూపొందించిన కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద, మొదటి దశ 2 ఇంధన సెల్ బస్సులను 25.09.2023 (సోమవారం) న ఇండియా గేట్ నుండి ప్రారంభిస్తుంది. ఫ్యూయెల్ సెల్ బస్సులను నడపడానికి 350 బార్ వద్ద గ్రీన్ హైడ్రోజన్‌ను పంపిణీ చేయడానికి ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో మొట్టమొదటి చొరవ. ఇండియన్ ఆయిల్  ఆర్ & డి ఫరీదాబాద్ క్యాంపస్‌లో సోలార్ పీ వి ప్యానెళ్లను ఉపయోగించి విద్యుద్విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేయబడిన హరిత హైడ్రోజన్‌ ఇంధనం నింపే అత్యాధునిక పంపిణీ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసింది.

 

భవిష్య మార్గం: దీర్ఘ-కాల ప్రభావం మరియు భవిష్యత్తు అవకాశాలు

 

ఈ కొత్త సాంకేతికత యొక్క పనితీరు మరియు మన్నిక యొక్క దీర్ఘకాలిక అంచనా కోసం ఈ 2 బస్సులను ప్రారంభించిన తర్వాత అన్ని బస్సులలో 3 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ సంచిత మైలేజీ కవర్ చేయబడుతుంది. ఈ కఠినమైన ట్రయల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన డేటా జాతీయ రిపోజిటరీగా పని చేస్తుంది. ఈ హరిత హైడ్రోజన్‌ రవాణా దేశంలో సున్నా ఉద్గార రవాణా యొక్క భవిష్యత్తును రూపొందిస్తుంది.

 

****



(Release ID: 1960014) Visitor Counter : 159