సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'పి.ఎం. విశ్వకర్మ' పథకం భారతదేశ నాగరికత, సాంప్రదాయ హస్తకళల సంపూర్ణ సమ్మేళనాన్ని సూచిస్తుంది : డాక్టర్ జితేంద్ర సింగ్


భారతదేశ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మిళితం చేసే సంస్కృతిని ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టారు, చంద్రయాన్ దీనికి అత్యంత అద్భుతమైన ఉదాహరణ : డాక్టర్ జితేంద్ర సింగ్


మూన్ మిషన్‌ కు 'చంద్రయాన్' అని, దాని ల్యాండర్‌ కు 'విక్రమ్' అని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అది దిగిన ప్రదేశానికి 'శివశక్తి' అని పేర్లు పెట్టడం నాగరికత తత్వాన్ని కాపాడుతుంది, చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి అందిన సమాచారం దానిని అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తుంది. : డాక్టర్ జితేంద్ర సింగ్


భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు, 'పి.ఎం. విశ్వకర్మ' ను ప్రారంభించడం ద్వారా, భారతదేశ ప్రత్యేక ఆస్తి అయిన సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ప్రధానమంత్రి ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 17 SEP 2023 2:37PM by PIB Hyderabad

'పి.ఎం. విశ్వకర్మ' పథకం భారతదేశ నాగరికత, సాంప్రదాయ హస్తకళల సంపూర్ణ సమ్మేళనాన్ని సూచిస్తుందని, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చెప్పారు.

ఈ పథకం జీవనోపాధిని పొందే అవకాశాన్ని కల్పిస్తూనే, భారతదేశ పురాతన గురు-శిష్య పరంపరను కొనసాగిస్తుందని,  మంత్రి చెప్పారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పి.ఎం. విశ్వకర్మ’ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలో మాట్లాడారు.

భారతదేశ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మిళితం చేసే సంస్కృతిని ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టారనీ, చంద్రయాన్ దీనికి అత్యంత అద్భుతమైన ఉదాహరణ అని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

మూన్ మిషన్‌ కు 'చంద్రయాన్' అని, దాని ల్యాండర్‌ కు 'విక్రమ్' అని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అది దిగిన ప్రదేశానికి 'శివశక్తి' అని పేర్లు పెట్టడం భారతదేశ నాగరికత పరిరక్షణకు ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని కేంద్ర మంత్రి అభివర్ణించారు.  అదేవిధంగా, చంద్రుని దక్షిణ ధృవం నుంచి అందిన సమాచారం దానిని అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తుంది. ఇప్పుడు మనకు నాయకత్వం వహించాలని అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న దేశాల కంటే భారతదేశం ముందంజలో ఉందన్న విషయాన్ని ఇది రుజువు చేస్తుందని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని, ‘పిఎం విశ్వకర్మ’ ప్రారంభించడం ద్వారా, భారతదేశ ప్రత్యేక ఆస్తి అయిన సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ప్రధానమంత్రి మోదీ ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారని, డా. జితేంద్ర సింగ్ వివరించారు. 

భారతదేశంలోని శతాబ్దాల నాటి సంప్రదాయాలు, హస్తకళలను సజీవంగా ఉంచిన సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులు సమాజంలో అంతర్లీనంగా ఉన్నారనీ, అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నడూ వారిని సరిగా  పట్టించుకోలేదనీ, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  ఈరోజు ‘పి.ఎం. విశ్వకర్మ’ పథకాన్ని ప్రారంభించడం ద్వారా సమాజంలోని ఈ అంతర్భాగానికి సరైన మద్దతు, నైపుణ్యం లభించడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో మాత్రమే సాధ్యమైందని, ఆయన అన్నారు. 

10 కోట్ల ఉజ్వల కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్ల మరుగుదొడ్లు, జల్ జీవన్ మిషన్ కింద 13 కోట్ల కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కింద 18 కోట్ల హెల్త్ కార్డులతో పాటు,  ముద్రా రుణాలు, పి.ఎం. కిసాన్ నిధి మొదలైనవి గత ప్రభుత్వాల ద్వారా ప్రధాన స్రవంతి నుండి దూరంగా ఉన్న వారి కోసం ఈ ప్రభుత్వం అంకితమయ్యిందని చెప్పడానికి నిదర్శనమని, డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

*****


(Release ID: 1959825) Visitor Counter : 123