వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సిమెంట్‌ రసాయన శాస్త్రం పై 17వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్‌ను గెలుచుకుంది

Posted On: 21 SEP 2023 10:50AM by PIB Hyderabad

2027లో న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ది కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ఐ సి సి సి)కి ఆతిథ్యం ఇచ్చే బిడ్‌ను భారత్ గెలుచుకుంది.

 

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న 16వ ఐ సి సి సి సందర్భంగా కాన్ఫరెన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుల ముందు భారతదేశంలోని ప్రముఖ పరిశోధన మరియు విద్యాసంస్థలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్(ఎన్ సి సి బి ఎం), ఐ ఐ టీ ఢిల్లీ విజయవంతంగా భారత్ బిడ్‌ను సమర్పించాయి. భారతదేశంతో పాటు స్విట్జర్లాండ్ మరియు యూ ఏ ఇతర బిడ్డర్లు గా ఈ పోటీ లో ఉన్నారు. 16వ ఐ సి సి సి సందర్భంగా థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ నిర్ణయం  సెప్టెంబర్ 20, 2023న ప్రకటించింది. ఎన్ సి సి బి ఎం  డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎల్ పీ సింగ్, ఎన్ సి సి బి ఎం జాయింట్ డైరెక్టర్ డా ఎస్ కే  చతుర్వేది మరియు ఐ ఐ టీ ఢిల్లీ ప్రొఫెసర్ (సివిల్ ఇంజినీర్) డాక్టర్ శశాంక్ బిష్ణోయ్ భారతీయ బిడ్‌ను సమర్పించారు.

 

సిమెంట్ కెమిస్ట్రీపై అంతర్జాతీయ కాంగ్రెస్ అనేది సిమెంట్ మరియు కాంక్రీటు రంగంలో పరిశోధన పురోగతిని సమీక్షించే అతిపెద్ద మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. 1918 నుండి నాలుగు నుండి ఆరు సంవత్సరాల వ్యవధిలో సాధారణంగా కాంగ్రెస్‌లు నిర్వహించబడుతున్నాయి, ఇది విద్యా ప్రపంచానికి మరియు సిమెంట్ పరిశ్రమకు మధ్య బలమైన మరియు ఫలవంతమైన సంబంధాన్ని అందిస్తుంది. 9వ కాంగ్రెస్‌ను 1992లో న్యూ ఢిల్లీలో ఎన్ సి సి బి ఎం నిర్వహించింది మరియు ప్రస్తుత 16వ ఐ సి సి సి బ్యాంకాక్, థాయిలాండ్‌లో 18-22 సెప్టెంబర్ 2023 వరకు నిర్వహించబడుతోంది.

 

భారతదేశంలో ఈ గౌరవప్రదమైన ఈవెంట్‌ను నిర్వహించడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిమెంట్ రంగంలో ప్రముఖ నాయకులు, నిపుణులు మరియు ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి మనకు ఒక ప్రత్యేక అవకాశం లభిస్తుంది. ఈ ఈవెంట్ మన పరిశోధన మరియు విద్యాసంస్థల సామర్థ్యాలకు నిదర్శనం మాత్రమే కాకుండా ప్రపంచ సిమెంట్ మరియు కాంక్రీట్ పరిశ్రమకు మన రాజధాని నగరం న్యూఢిల్లీని ప్రదర్శించే అవకాశం కూడా. ఆతిథ్య నగరంగా 2027లో 17వ ఐ సి సి సి కి హాజరయ్యే వారందరికీ భారత్ మండపం మరియు యశోభూమి వంటి ప్రపంచ స్థాయి సమావేశ సౌకర్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అసాధారణమైన ఆతిథ్యంతో మరపురాని అనుభూతిని అందించడానికి న్యూ ఢిల్లీ, సిద్ధంగా ఉంది.

 

నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్ సి సి బి ఎం) డి పీ ఐ ఐ టీ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం యొక్క పాలన నియంత్రణలో ఉన్న అత్యున్నత పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఎన్ సి సి బి ఎం సిమెంట్, అనుబంధ నిర్మాణ ఉత్పత్తులు మరియు నిర్మాణ పరిశ్రమల కోసం పరిశోధన, సాంకేతిక అభివృద్ధి బదిలీ, విద్య, పారిశ్రామిక సేవలకు అంకితమైన సంస్థ. ఎన్ సి సి బి ఎం కి  ఎన్ సి సి ద్వైవార్షిక ఇంటర్నేషనల్ సెమినార్లు/కాన్ఫరెన్స్‌లను ప్రపంచం నలుమూలల నుండి పాల్గొనే వారందరికీ చిరస్మరణీయమైన అనుభవం గా అందించే స్థాయి లో నిర్వహించడంలో నిరూపితమైన చరిత్ర ఉంది.

 

నేపథ్య సమాచారం 

 

భారతదేశం నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వచ్చే ఐదేళ్లలో మూడవ అతిపెద్దదిగా మారే అవకాశం ఉంది. 600 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యంతో దాని సిమెంట్ పరిశ్రమ ప్రపంచంలో రెండవ అతిపెద్దది. భారతదేశంలోని సిమెంట్ పరిశ్రమ వివిధ పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా దేశంలో వలయ ఆర్థిక వ్యవస్థ ఫ్రేమ్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోనే అత్యల్ప సీ ఓ 2 పాదముద్రలు మరియు అత్యంత శక్తి సామర్థ్యాలలో ఒకటిగా ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరులు మరియు నైపుణ్యం, ఆలోచనాపరులు, విద్యావేత్తలు, సిమెంట్ మరియు కాంక్రీట్ నిపుణులు మరియు ఔత్సాహికులను ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ప్రగతి కి మార్గదర్శి గా సంపూర్ణ నేపథ్యాన్ని భారతదేశం కలిగి ఉంది. డీకార్బనైజేషన్, సుస్థిరమైన అభివృద్ధి, వలయ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, తక్కువ కార్బన్ సిమెంట్లు వంటి స్థానిక మరియు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ ప్రయోజనాల కోసం సాంకేతిక నిపుణులు భారతీయ సిమెంట్ పరిశ్రమ యొక్క అనుభవం మరియు ఫ్రేమ్‌వర్క్ ప్రపంచ నాయకులకు చర్చలకు మరియు ప్రదర్శించడానికి అనువైన నమూనాను అందిస్తుంది.

 

***(Release ID: 1959365) Visitor Counter : 124