మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్య విభాగంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహణ


‘స్వచ్ఛతా హి సేవ’ ప్రచారానికి సంబంధించిన వివిధ అంశాలపై సుమారు 170 మంది హెచ్‌ఈఐలు, యూజీసీ, ఏఐసీటీఈ ప్రతినిధులకు అవగాహన

Posted On: 19 SEP 2023 3:37PM by PIB Hyderabad

కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్య విభాగం కార్యదర్శి శ్రీ కె సంజయ్ మూర్తి, ‘స్వచ్ఛత హి సేవ’ (ఎస్‌హెచ్‌ఎస్‌) ప్రచారంలో భాగంగా ఉన్నత విద్య విభాగం అధికార్లు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

2023-09-19 13:37:09.793000

ప్రతి ఒక్కరు ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని, ‘స్వచ్ఛత హి సేవ’ సందేశాన్ని ఇతరుల వద్దకు కూడా తీసుకెళ్లాలని సూచించారు.

త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ప్రచారం 3.0, ఎస్‌హెచ్‌ఎస్‌, ‘మిషన్ లైఫ్’ గురించి అవగాహన కల్పించడానికి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హెచ్‌ఈఐల ఉప కులపతులు/డైరెక్టర్లతో శ్రీ కె సంజయ్ మూర్తి సమావేశం కూడా నిర్వహించారు.

సున్నా వృథా ప్రచారం, ప్లాస్టిక్ రహిత ప్రాంగణాలు, సమీపంలోని వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను సందర్శించడం, శ్రమదానం కోసం పొరుగు ప్రాంతాలను దత్తత తీసుకోవడం వంటి ఎస్‌హెచ్‌ఎస్‌ సందేశాలను ప్రచారం చేసే కార్యక్రమాలకు మద్దతుగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని సమీకరించాలని హెచ్‌ఈఐలను శ్రీ కె సంజయ్ మూర్తి అభ్యర్థించారు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని 'తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్' సూత్రాన్ని ప్రచారం చేయాలని కూడా చెప్పారు. జీ20 న్యూదిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌లో వివరించిన 'మిషన్ లైఫ్' సూత్రాలను తమ సంస్థల్లో ఆచరించాలని కూడా ఆయన హెచ్‌ఈఐలను ప్రోత్సహించారు.

దాదాపు 170 మంది హెచ్‌ఈఐలు, యూజీసీ, ఏఐసీటీఈ ప్రతినిధులు వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1958886) Visitor Counter : 123
Read this release in: English , Urdu , Hindi , Odia , Kannada