రక్షణ మంత్రిత్వ శాఖ
అండమాన్ & నికోబార్ కమాండ్‌ను సందర్శించిన రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్
प्रविष्टि तिथि:
19 SEP 2023 10:27AM by PIB Hyderabad
అండమాన్,& నికోబార్ దీవులకు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ అండమాన్ & నికోబర్ కమాండ్ (ఎఎన్‌సి) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన పర్యటన 18 సెప్టెంబర్ 2023న ముగిసింది. కేంద్ర కార్యాలయ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ సహాయ మంత్రి ఎఎన్‌సి కమాండర్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ సాజు బాలకృష్ణన్‌తో సమగ్ర సంభాషణలు, కార్యనిర్వహణకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. తన పర్యటన సందర్భంగా, శ్రీ అజయ్ భట్ అనేకమందితో సంభాషించడం అన్నది ఈ సుందరమైన ద్వీపకల్పపు వ్యూహాత్మక ప్రాముఖ్యతను సూచిస్తుంది.
ఐఎన్ఎస్ ఉత్కర్ష్‌లో సంకల్ప స్మారక వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించడం ద్వారా రక్షణశాఖ సహాయ మంత్రి తన పర్యటనను ప్రారంభించారు. అనంతరం లెఫ్టెనెంట్ గవర్నర్ అడ్మిరల్ డికె జోషి (రిటైర్డ్)తో రాజ్‌నివాస్‌లో గౌరవపూర్వకంగా సమావేశం అయ్యారు.
****
(रिलीज़ आईडी: 1958837)
आगंतुक पटल : 155