గనుల మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో కెనడా ప్రతినిధులతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చర్చలు
క్లిష్టమైన ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి
Posted On:
18 SEP 2023 6:32PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కెనడా ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. కెనడాలోని యుకాన్ ప్రీమియర్ రంజ్ పిళ్లై అధ్యక్షతన ఈ బృందం భారత్లో పర్యటిస్తోంది. 2023 సెప్టెంబర్ 17 నుండి 20 వరకు ఈ బృందం భారత పర్యటన ఉంటుంది. పర్యటన సందర్భంగా బృందం మంగళవారం ఇక్కడ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషితో సమావేశమైంది. ఈ మంత్రుల స్థాయి సమావేశంలో, మైనింగ్ రంగంలో ముఖ్యంగా కీలకమైన ఖనిజాల మైనింగ్ విషంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు చర్చించాయి. భారతదేశం మరియు కెనడా రెండూ కలిసి, దేశాల మధ్య కీలకమైన ఖనిజాల సరఫరా-గొలుసును బలోపేతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాయి. యుకాన్ కెనడా యొక్క పశ్చిమ భూభాగం, ఇది ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. యుకాన్ యొక్క ప్రధాన ఖనిజ వనరులు సీసం, జింక్, వెండి, బంగారం, ఆస్బెస్టాస్, ఇనుము మరియు రాగి. రంజ్ పిళ్లై యుకాన్‌లోని మైనింగ్ మరియు ఖనిజ సంభావ్యత గురించి వివరించాడు, ఇందులో భారతీయ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి యుకాన్ వనరుల కోసం మార్గాలు ఉన్నాయన్నారు. గనుల మంత్రిత్వ శాఖ కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాలను అవుట్‌సోర్స్ చేయడానికి ‘క్ఏబుల్’ అనే సంస్థను ఏర్పాటు చేసిందని శ్రీ ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఖనిజ వనరుల రంగంలో సహకారానికి సంబంధించి ఇరువైపుల అధికారులు చర్చించనున్నారు. రంజ్ పిళ్లై భారతదేశం నుండి ఒక ప్రతినిధి బృందాన్ని యుకాన్‌కు ఆహ్వానించారు. పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం మరియు ఖనిజాల సేకరణ కోసం ప్రతినిధి బృందానికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి మార్గం సుగమం చేసింది.
***
(Release ID: 1958722)