నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కిల్ ఇండియా డిజిటల్‌ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఒక అత్యాధునిక వేదిక స్కిల్ ఇండియా డిజిటల్ - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

అందరికీ, ఎక్కడైనా, ఎప్పుడైనా నైపుణ్యాన్నిఅందించేది స్కిల్ ఇండియా డిజిటల్ - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

నవభారతానికి సంబంధించి న్యూ ఇండియా - స్కిల్ ఇండియా & డిజిటల్ ఇండియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు సంబంధించిన రెండు ముఖ్యమైన భాగాల కలయిక స్కిల్ ఇండియా డిజిటల్: MoS రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 13 SEP 2023 8:14PM by PIB Hyderabad

              నాణ్యమైన నైపుణ్యాభివృద్ధి, సంబంధిత అవకాశాలు మరియు వ్యవస్థాపక మద్దతు ప్రతి భారతీయుడు పొందేలా నిశ్చయం చేసుకోవడానికి  కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  స్కిల్ ఇండియా డిజిటల్ (SID)ను ప్రారంభించారు   దీని లక్ష్యం సమగ్ర డిజిటల్ వేదికను సమన్వయం చేయడం మరియు మార్చడం.  భారత నైపుణ్యాలు, విద్య, ఉపాధి మరియు వ్యవస్థాపకత దృశ్యం. పరిశ్రమకు సంబంధించిన నైపుణ్య కోర్సులు, ఉద్యోగావకాశాలు మరియు వ్యవస్థాపకత మద్దతుకు మెరుగైన అవకాశాలు , ఉజ్వల భవిష్యత్తును కోరుకునే లక్షలాది మంది భారతీయుల ఆకాంక్షలు మరియు కలల సాకారాన్ని ఈ వేదిక ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత & ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.


         భారతదేశ  నైపుణ్యం, విద్య, ఉపాధి మరియు వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు కోసం రూపొందించిన  సార్వజనిక అంకాత్మక మౌలిక సదుపాయం (DPI) స్కిల్ ఇండియా డిజిటల్‌.  డిజిటల్ టెక్నాలజీ మరియు పరిశ్రమ  4.0 నైపుణ్యాలపై దృష్టి సారించి, నైపుణ్యాభివృద్ధిని మరింత వినూత్నంగా, అందుబాటులోకి తీసుకురావడానికి మరియు వ్యక్తిగతీకరించే దిశలో  దృష్టి సారించడం ద్వారా, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నియామకాన్ని వేగవంతం చేయడంలో, జీవితకాల అభ్యాసాన్ని, ఉద్యోగ/వృత్తిలో  అభివృద్ధిని   సులభతరం చేయడంలో అత్యాధునిక వేదిక కొత్త ఆవిష్కరణ అవుతుంది. డిజిటల్ నైపుణ్యాలు మరియు డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలను  మరియు డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను  నిర్మించడానికి G20 చట్రంలో పేర్కొన్న దృష్టికి  వేదిక సంపూర్ణంగా సరిపోతుంది. ఇది అన్ని ప్రభుత్వ నైపుణ్యం మరియు వ్యవస్థాపకత కార్యక్రమాల గురించి,  ఉద్యోగ అభివృద్ధికి, జీవితకాల అభ్యాసాయానికి  సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం కోసం ఇది పౌరులకు గో-టు హబ్.

      స్కిల్ ఇండియా డిజిటల్ ప్రారంభించిన సందర్బంగా  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఇది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక అత్యాధునిక వేదిక అని అన్నారు. సార్వజనిక  అంకాత్మక  మౌలిక సదుపాయాలను  రూపొందించే దిశగా మరో ముందడుగు వేస్తూ, నైపుణ్య వృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ దేశంలోని విభిన్న జనాభా వర్గాల నైపుణ్య అవసరాలను పరిష్కరించడానికి ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించింది.   మనకున్న అధిక జనసంఖ్య ద్వారా లభించిన లాభాంశాన్ని ఉపయోగించుకొని భారతావనిని నైపుణ్యాల వృద్ధిలో ప్రపంచ కేంద్రంగా నెలకొల్పే దిశగా మరో అడుగు అని ఆయన అన్నారు.  అధ్యయనం మరియు నైపుణ్య వృద్ధిలో ఇది ఒక విప్లవం  విప్లవం, స్కిల్ ఇండియా డిజిటల్ అందరికీ, ఎక్కడైనా, ఎప్పుడైనా
నైపుణ్యం  కలిగిస్తుంది అని ఆయన అన్నారు.

            ఢిల్లీలో జి20 దేశాల బృందం శిఖరాగ్ర సభ విజయవంతమైన కొన్ని రోజుల తరువాత శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జి20
శిఖరాగ్ర సభలో రూపొందించిన  ముఖ్యమైన ఒప్పందాలలో ఒకటి అంకాత్మక మౌలిక సదుపాయాల గురించి అన్నారు.  

 స్కిల్ ఇండియా డిజిటల్ ఖచ్చితంగా యువతకు అత్యంత ముఖ్యమైన DPIలలో ఒకటి మరియు ఇది న్యూ ఇండియా - స్కిల్ ఇండియా & డిజిటల్ ఇండియా కోసం ప్రధానమంత్రి దార్శనికతకు సంబంధించిన రెండు ముఖ్యమైన భాగాల కూడలిలో ఉంది. ఇవి శక్తివంతమైన పథకాలు , భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే  నైపుణ్యాలతో యువతలో నైపుణ్యవృద్ధి చేయడమే  ఏకైక లక్ష్యం. ఇది అనేక అవకాశాల సృష్టికి దోహదం చేస్తుంది. కోవిడ్ మహమ్మారి అనంతర  ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాల గురించి విపరీతమైన అవగాహన ఉంది. స్కిల్ ఇండియా డిజిటల్ వ్యవస్థాపకతను, భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే కార్మికశక్తిని  సుసాధ్యం చేస్తుందని ఆయన తెలిపారు.


        స్కిల్ ఇండియా డిజిటల్‌ వేదికను ఈ కింది అంశాలు మెరుగుపరచడమే కాక అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
కింది అంశాలు SID ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరుస్తాయి మరియు అనేక ప్రయోజనాలను అందిస్తాయి:

ఆధార్/ కృత్రిమ మేధ ఆధారిత ముఖ సంబంధ ధ్రువీకరణ
అంకాత్మకంగా యోగ్యత గుర్తింపు (DVC)
డిజిటల్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సిఫార్సులు
ఆధార్ ఆధారిత eKYC
అంకాత్మక అధ్యయనం
పౌర-కేంద్రీకృత విధానం
మొబైల్-ఫస్ట్ అప్రోచ్
ప్రమాణం మరియు వేగం
భద్రతా చర్యలు
పరస్పర చర్య
వాట్సాప్ చాట్‌బాట్
వ్యాపార సౌలభ్యం


దేశంలో పరివర్తన మరియు సాధికారతను వేగవంతం చేయడానికి రూపొందించిన స్కిల్ ఇండియా డిజిటల్ వేదిక స్థాపనలో
చురుకుగా పాల్గొన్న సాంకేతిక బృందంతో కేంద్ర నైపుణ్య వృద్ధి మరియు వ్యవస్థాపకత  & ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (MoS) శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  సంభాషించారు.  
               పౌరుల బహువిధాల అవసరాలను SID వేదికలోని ప్రతి విభాగం తీరుస్తుంది.  స్కిల్ ఇండియా డిజిటల్ వినూత్నతకు, పురోగతికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది.   స్కిల్ ఇండియా డిజిటల్ వినియోగ హితమైన నిబద్ధతతో తన ప్రయాణాన్ని మొదలెట్టింది. 

 

***



(Release ID: 1958366) Visitor Counter : 115