గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ కళాకారులు,హస్త కళాకారుల కోసం ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


పురాతన కళల్లో నేటి విశ్వకర్మలు నైపుణ్యం సాధించి ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగస్వాములు కావాలి... శ్రీ నరేంద్ర మోదీ

తమ నైపుణ్యంతో కళాకారులు,హస్త కళాకారులు దేశాన్ని అందంగా మలచడం తో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతూ ఆత్మ నిర్బర్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు.. శ్రీ అర్జున్ ముండా

చేతులు,పనిముట్లతో పనిచేస్తున్న సంప్రదాయ కళాకారులు,హస్త కళాకారులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాభివృద్ధి ద్వారా సంప్రదాయ కళలను ప్రోత్సహించడం లక్ష్యంగా రూపొందిన పథకం ‘పీఎం విశ్వకర్మ’ పథకం.. శ్రీమతి రేణుకా సింగ్ సరుత

నైపుణ్యాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం మరియు బలోపేతం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం: శ్రీమతి రేణుకా సింగ్ సరుత

Posted On: 17 SEP 2023 5:27PM by PIB Hyderabad

సంప్రదాయ కళాకారులు,హస్త కళాకారుల కోసం రూపొందించిన  ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ లోగో, ట్యాగ్‌లైన్, పోర్టల్‌ను కూడా ప్రధాని ఆవిష్కరించారు.విశ్వకర్మ  రూపొందించిన స్టాంపును, టూల్ కిట్ ఇ-బుక్‌లెట్, వీడియోను కూడా ప్రధానమంత్రి  విడుదల చేశారు. 18 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు విశ్వకర్మ సర్టిఫికెట్లను ప్రధాన మంత్రి అందజేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించే విధంగా మొత్తం ప్రభుత్వం విధానంలో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 70 ప్రాంతాల్లో ఒకేసారి నిర్వహించారు. 

ప్రజల  దైనందిన జీవితంలో విశ్వకర్మల సహకారం , ప్రాముఖ్యతను ప్రధానమంత్రి గుర్తు చేశారు.  సాంకేతిక పరిజ్ఞానం  అభివృద్ధి చెందిన  సమయంలో సమాజంలో విశ్వకర్మలు ఎప్పుడూ ప్రాముఖ్యత కలిగి  ఉంటారు అని శ్రీ నరేంద్ర మోదీ  వ్యాఖ్యానించారు. విశ్వకర్మలను గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు తమ పనిని చిన్న సంస్థలకుబదిలీ చేసి పూర్తి చేస్తున్నాయని తెలిపిన శ్రీ మోదీ  “ఈ అవుట్‌సోర్సింగ్ పని మన విశ్వకర్మలకు రావాలి. దీనివల్ల  వారు ప్రపంచ సరఫరా గొలుసులో భాగస్వాములు అవుతారు. దీని కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. విశ్వ‌కర్మ స్నేహితుల‌ను ఆధునిక యుగంలోకి తీసుకెళ్ల‌డానికి ఈ ప‌థ‌కం ఒక ప్ర‌య‌త్నం” అని  అన్నారు. (వివరణాత్మక విడుదలను   https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1958169) లింక్ లో చూడవచ్చు)

కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి పని, వడ్రంగి, శిల్పకళ మొదలైన వివిధ వృత్తులలో నిమగ్నమై ఉన్న స్వయం ఉపాధి కళాకారులు. హస్త కళాకారుల భారతీయ ఆర్థిక వ్యవస్థలోభాగంగా ఉన్నారు.  సంప్రదాయ కళలపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.వృత్తి నైపుణ్యం  నైపుణ్యాలు కుటుంబాలు, ఇతర కళాకారులకు  గురు-శిష్య సంప్రదాయం ద్వారా సంప్రదాయ కళాకారులు,హస్త కళాకారులసంక్రమిస్తుంది. ఈ క్రింది లక్ష్యాల సాధన కోసం పథకం అమలు జరుగుతుంది.  

* సాంప్రదాయ చేతిపనుల  సాంస్కృతిక వారసత్వం  సంరక్షణ, ప్రోత్సాహం  మరియు ప్రచారం

* ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో  హస్తకళాకారులు భాగస్వామ్యం అయ్యేలా చూసి ప్రపంచ విలువ గొలుసు వారికి చేరువ అయ్యేలా చూడడం. 

 

రాంచీ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా తమ నైపుణ్యంతో కళాకారులు,హస్త కళాకారులు దేశాన్ని అందంగా మలచడం తో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతూ ఆత్మ నిర్బర్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు అని అన్నారు.  ఈ సంప్రదాయ కళలలో నైపుణ్యం కలిగిన వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 'పీఎం  విశ్వకర్మ పధకాన్ని ప్రారంభించారని తెలిపారు.  ప్ర‌తి హ‌స్త‌క‌ళ‌కారుడు, వారి ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు పొంద‌డానికి స‌మ‌ర్థులుగా, సాధికార‌త‌తో, అత్యంత ప్ర‌ధానంగా స్వావలంబన సాధించాలి అన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష  అని శ్రీ ముండా పేర్కొన్నారు. గిరిజన సంఘం సభ్యులతో సహా అనేక మంది ప్రజలు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వల్ల  ప్రయోజనం పొంది  జీవితంలో విజయం సాధించి పురోగతి సాధిస్తారని  మంత్రి తెలిపారు.

పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుత,  ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి,  అస్సాంలోని సిల్చార్ నుంచి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  శ్రీ బిశ్వేశ్వర్ తుడు పాల్గొన్నారు. తమ చేతులు, పనిముట్లు ఉపయోగించి  పని చేసే హస్తకళాకారులు,సంప్రదాయ కళాకారులు   సంప్రదాయ నైపుణ్యాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం, బలోపేతం చేయడం ఈ పథకం  లక్ష్యం అని శ్రీమతి సరుత అన్నారు. . తమ నైపుణ్యాలు,  శ్రమతో దేశాభివృద్ధికి దోహదపడుతున్న వర్గాల ప్రయోజనం కోసం పథకం అమలు జరుగుతుందని   శ్రీ బిశ్వేశ్వర్ తుడు అన్నారు . ఈ పథకం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి  స్థానిక కళాకారులకు  మరింత నైపుణ్యం అందిస్తుందని  ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రాలు సమర్థంగా అమలు చేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మంత్రులు పథకం వల్ల   పూర్తిగా ప్రయోజనం పొందుతారని  విశ్వాసం వ్యక్తం చేశారు.

గుర్తించిన  పద్దెనిమిది సాంప్రదాయ కళా రంగాల ద్వారా ఉపాధి పొందుతున్న భారతీయ చేతివృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చేందుకు  ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం రూపొందింది. పథకం అమలు కోసం  కేంద్ర ప్రభుత్వం రూ. 13,000 కోట్లు కేటాయించింది.  పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు (విశ్వకర్మలు) బయోమెట్రిక్ ఆధారిత పీఎం  విశ్వకర్మ పోర్టల్‌ని ఉపయోగించి కామన్ సర్వీసెస్ సెంటర్‌ల ద్వారా ఉచితంగా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. లబ్ధిదారులకు  పీఎం  విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు అందిస్తారు. పథకంలో భాగంగా  ప్రాథమిక, అధునాతన శిక్షణ , టూల్‌కిట్ అప్‌గ్రేడేషన్ కోసం 15,000 రూపాయలు అందిస్తారు. ఎటువంటి హామీ లేకుండా1 లక్ష రూపాయలు  (మొదటి విడత),2 లక్షల రూపాయలు  (రెండో విడత)  వరకు రుణ పరపతి అందిస్తారు. డిజిటల్ లావాదేవీలు, మార్కెటింగ్ సహకారం కోసం ప్రోత్సాహకంగా  5% రాయితీ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం అందిస్తారు. 

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం నోడల్ మంత్రిత్వ శాఖగా కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. పథకం  కింద ప్రణాళిక  లబ్ధిదారుల గుర్తింపు,ధృవీకరణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం లబ్ధిదారుల  సమీకరణ, రుణ సహకారం  సులభతరం చేయడం, విలువ-గొలుసును పెంచడానికి మార్కెటింగ్ సహకారం మొదలైన కార్యక్రమాలు అమలు చేస్తారు.,విశ్వకర్మల సంక్షేమం కోసం రూపొందిన  పథకం అమలుకు  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రియాశీల సహకారం అందిస్తుంది.

****


(Release ID: 1958361) Visitor Counter : 249